సాంకేతికంశాలు
తేజస్విలో సాంకేతికంశాలు వ్రాయమని పలువురు నాకు సలహాలిచ్చారు. కాని, నా బ్లాగును కాస్త భిన్నమైన పంథాలో నడపాలని తలచాను. అలాగని నాకు సాంకేతికంశాల మీద ఆసక్తి లేదని పొరబడకండి. తెలుగులో సాంకేతిక గమనాగమనాలు తెలిపే టెక్‌సేతు అనే సైటు ఇదివరకే కొందరు మిత్రులు మొదలుపెట్టి ప్రాచుర్యం పొందారు. అన్నీ అంశాలను నేను ఒక్కడినే వ్రాయలేను గనక, ఇంకా పలు ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒక తాటిపై కలిసి వారికి తెలిసిన విషయాలు తెలుపుతుంటే అందరికి అది లాభదాయకం గనక, సాంకేతికంశాలపైన నా రచనలు టెక్‌సేతులో ఉంచాలని దలచాను.
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నా టపాల చిట్టా:
ట్విట్టర్ వాడటం ఎలా?




