బధ్రపరచినది జూన్ , 2009
టంగ్ ఫూ – మాటే పంచ్
కుంగ్ ఫూ ఏవిధంగా అయితే ప్రత్యర్థుల దాడినుంచి మన శరీరాన్ని రక్షిస్తుందో అలాగే టంగఫూ వాగ్భాణాలనుంచి రక్షిస్తుందనమాట. సందర్భానికి తగినట్లుగా మాట్లాడేలా నాలుకకు శిక్షణ ఇస్తామన్నమాట. ఈ అంశాలు నేర్చుకుంటే మన ఇంటిలోని వారితో,సన్నిహితులతో మరియు సహోద్యోగులతో నిర్మాణాత్మకంగా మాట్లాడవచ్చు. వివరాలలోకి తొంగిచూద్దాం… వివరణ వద్దు దీనినే మనం వాడుకలో “సాకులు వద్దు” అని కూడా అంటుంటాం. ఫలానా సమయానికి పూర్తవ్వాల్సిన పని కాకపోతే అవతలివారికి కోపం రావడం సహజం. అప్పుడు మనం ఏం చెప్తున్నా వారికవి [...]
Read Full Post | Make a Comment ( 4 so far )మీ కలల సాకారం కోసం
అబ్దుల్ కలామ్ గారు కలల (Dreams) గురుంచి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కలల కనడంలోని గొప్పతనం ఏంటి? కలల ద్వారా ఏమిటి లాభం? ఒకవేళ ఈ ప్రశ్నలకు మీకు సమాధానం ఇదివరకే తెలిసివుంటే లేక తర్వాత తెలుసుకుంటారని అనుకుందాం, ఇక మనము చింతించాల్సిన విషయం “ఆ కలలను ఎలా సాకారం చేసుకోవాలి?!” మరి ఈ ప్రశ్నకు సమాధానముగా పలువురు పలు విషయాలను సెలవిస్తారు. కలల సాకారంతో పాటు సంతోషము, కార్య సిద్ధి, కీర్తి, ధనము మొదలగునవి సాకారం [...]
Read Full Post | Make a Comment ( 3 so far )మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!
Self Reliance is not about being independent, but interdependent. ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో….. ఒక్కరైనా నీ కేకవిని ఓ యని రాకున్నా… ఒక్కడవే బయలుదేరు ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే ఒక్కడవే బయలుదేరు. జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. [...]
Read Full Post | Make a Comment ( 8 so far )విజయానికి తొందరపనికిరాదు
అనేకులు తొందరగా విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో విపరీతమైన మానసిక వత్తిడికి లోనవుతుంటారు. విజయాన్ని సాధించడానికి మెదడులోని కణాలు తమలో తాము సంప్రదించుకొని అనుకూలమైన రసాయనాలను ఉత్పత్తి చేయాలి. ఆలోచనల నాణ్యతను బట్టి మెదడులోని కణాల స్పందన వుంటుంది. ఆలోచనలు మెదడులోని కణాలను కంపింపచేసి వాటిలో నిక్షిప్తమైన సమాచారాన్ని బహిర్గతం చేయ్యడానికి తోడ్పడుతాయి. సవ్యంగా ఆలోహించుతున్నప్పుడు విజయానికి తోడ్పడే రసాయనాలు ఉత్పత్తవుతాయి. ఆపనసవ్యంగా ఆలోచించుతున్నప్పుడు పనిని వాయిదా వేయడానికో లేక పనిని ఎగ్గొట్టడానికో ప్రేరణలను కలుగజేసే రసాయనాలు ఉత్పత్తవుతాయి. [...]
Read Full Post | Make a Comment ( 1 so far )వాదోపవాదాల కాలక్షేపం వద్దు
చాలా మామూలు సంభాషణతో మొదలయి, వాదనగా మారి .. చివరికి గొడవగా పరిణమించే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవైకవేద్యమే. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులమధ్యనో, స్నేహితులమధ్యనో బయటిప్రపంచం వ్యక్తులతోనో అనుభవంలోకి రావచ్చు. వాదోవవాదాలు లేకుండా ఉంటాయా? మాట నేర్చిన మనిషి ఎంత కాదనుకున్నా ఈ ‘వాదోపవాదాల’ సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అతను ఉపయోగించాల్సిందల్లా గొడవదాకా దారితీయకుండా చూసుకునే తనదైన ‘విద్వత్తు’ను. సంభాషణ నుంచి వాదనకు మన మాటతీరు ఎలా మారింది? అన్నది మనం జాగ్రతగా గమనించాల్సి [...]
Read Full Post | Make a Comment ( 4 so far )సర్దుబాటు మనస్తత్వం కీలకం!
ఆధునిక జీవితంలో మనిషి సంతోషంగా జీవించాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇంకొన్ని సామాజిక పరమైన సమస్యలు, మరికొన్ని వృత్తిపరమైన సమస్యలు. అనేకమైన సవాళ్ళు, సమస్యలు ఎదురయ్యే సమాజంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అనుకున్నట్లు మనచుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు ఉండవు. వాటికి తగ్గట్టుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. ‘Ability is something but test is everything’ అన్నారు. test [...]
Read Full Post | Make a Comment ( 2 so far )మన చరిత్ర – మన భవిష్యత్తు
ఏ జాతికీ తన చరిత్రను గురుంచిన వాస్తవికమైన జ్ఞానము ఉండదో ఆ జాతికి భవిష్యత్తు కూడా ఉండదు. అయితే ఆ సత్యంతోబాటు మరోమహా సత్యం కూడా ఉంది. ఏ జాతి అయినా తన గౌరవ పూర్ణ గత చరిత్రతో తన్మయత్వం పొందితే సరిపోదు, తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడంలో గత చరిత్రను ఉపయోగించుకొనే క్షమత సంపాదించుకోవడం కూడా అత్యంత అవశ్యకం. “మా తాతలు నేతులు త్రాగేరు, కావాలంటే మా మూతులు వాసన చూడండి” అని గొప్పలు చెప్పుకోరాదు. మన [...]
Read Full Post | Make a Comment ( 1 so far )భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?
మన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం. సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలోనిలచి ఉన్నది [...]
Read Full Post | Make a Comment ( 25 so far )ఆకులో భోజనం ఎందుకుచేయాలి?
భోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు. పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, [...]
Read Full Post | Make a Comment ( 15 so far )మిత్ర లాభం
మానవుడు సంఘజీవి . నిత్యమూ ఇతరులతో కలిసి మాత్లాడకపోతే జీవనం సాగదు. అంటే సమాజంలోని ఇతరులతో తప్పనిసరిగా సంబంధం పెట్టుకోక తప్పదు. అందుకే తోటివారితో మిత్రభావంతో మెలగాలి. స్నేహంగా ప్రవర్తించాలి. ఎదుటివారినుంచి నువ్వు ఏది ఆశిస్తావో దాన్ని నువ్వు కూడా ఎదుటివారికి చేస్తే స్నేహం పదికాలాలపాటు మనగలుగుతుంది. స్నేహం పలుసందర్భాల్లో ఏర్పడవచ్చు. పరిసరాలవల్ల, విద్యాభ్యాసం చేసేటప్పుడు, ఉద్యోగ నిర్వహణలో, ప్రయాణాల్లో స్నేహాలు కలుగవచ్చు. అయితే కొన్ని స్నేహాలు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించి ఆ తర్వాత కొనసాగపోవచ్చు. మరికొన్ని [...]
Read Full Post | Make a Comment ( 2 so far )« పాత ఎంట్రీలు




