బుర్ఖా
నస్రుద్దిన్ హోడ్జా మొదటి వివాహము, పెద్దలు కుదిర్చిన వివాహము. దానికి తోడు, అప్పటి ఆచారం ప్రకారం అతను వధువును పెళ్లికి ముందు చూడలేదు. పెళ్లి రోజున మొదటి సారి వధువును చూసిన తర్వాత ఆమె మొహము నచ్చక, నిరాశ చెందాడు.
ఆ మరుసటి దినము అతని భార్య బజారుకు వెళ్ళుటకు తయారవుతూ, అప్పటి ఆచారాని పాటిస్తూ “ఏమండి, నేను బుర్ఖా తొడిగి వెళ్లనా? నేను మీ అనుమతి లేనిది ఎవ్వరికీ నా మొహం చూపను”అని తన భర్తతో అన్నది.
దానికి సమాధానముగా నస్రుద్దిన్ ఇలా అన్నాడు “నువ్వు బుర్ఖా తొడిగైనా వెళ్ళు, లేక తొడగకనైనా వెళ్ళు. నువ్వు నీ మొహాన్ని జనంలో ఎవరికి చూపినా, నాకు పెద్దగా తేడా లేదు. కానీ, ఇంట్లో ఉన్నంత వరకూ బుర్ఖా తొడిగి ఉండు.”

RSS - Posts


‘మధువు’ కాదు సారూ, ‘వధువు’.
అబ్రకదబ్ర
జులై 6, 2009
బాగుంది కన్వర్సేషన్.
Marthanda
జులై 7, 2009
మధువు కాదు, వధువు
కొత్తపాళీ
జులై 7, 2009
@ కొత్తపాళీ మరియు @ అబ్రకదబ్ర
నా తప్పును తెలియపరచినందుకు ధన్యవాదములు. దానిని సరిదిద్దుకున్నాను.
saipraveen
జులై 8, 2009
koMcheM krUramaina haasyamani anipiMchiMdi.
“modaTi peLLi!”annaaru,aMTE nasrii tarvaata kUDA pellillu ……..?????.
sirishasri
జులై 8, 2009
దీంట్లో క్రూరమైన విషయం ఏమి లేదండి. ఇది యదార్థముగా జరిగిన కథ. అవునండి, మీరు సరిగ్గా ఊహించారు. నస్రుద్దిన్‌కు ఇద్దరు భార్యామణులు.
saipraveen
జులై 9, 2009