Archive for ఆగష్టు, 2009
విషాదము నుంచి జనించిన కవిత
యథావిధిగా నేను రెండు రోజుల క్రిందట వేలూరుకు వెళ్తుండగా అక్కడ చోటుచేసుకున్న ఒక సంఘటన నన్ను కుదిపేసింది. బైకు నడుపుతున్న ఒక వ్యక్తి బస్సు చక్రం క్రింద పడి, ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అతని తల నుజ్జుగా నలిగి, మొదడు బయటికి చొచ్చుకు వచ్చి, క్రొన్ని ఎముకలు విరిగి చెల్లా చెదురుగా పడి వుండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. రక్తపు మడుగులో అతను పడి వున్న దృశ్యాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకున్నాను. ఆ సంఘటన ఎలా [...]
Read Full Post | Make a Comment ( 4 so far )అందరూ యాచకులే
ఓ మారు ఒక యాచకుడు అక్బరు బాదుషా గొప్ప దాత అని తెలుసుకొని, అతని దగ్గర యాచించడానికి వస్తాడు. ఆ యాచకుడు రాజ దర్బారుకు వచ్చినప్పుడు, అక్బరు బాదుషా అక్కడ వుండరు. భటుడి ద్వారా అక్బరు దేవుని ప్రార్థనలో నిమగ్నమై వున్నారని తెలుసుకుంటాడు. కాసేపు నిరీక్షించిన తర్వాత అతడు వెనుదిరుగుతుండగా, అక్బరు బాదుషా వచ్చి ఆ యాచకుడితో తన ఆలస్యానికి మన్నించమని మరియు తనకి ఏమి కావలెనో అడగమని చెప్తారు. అందుకు ఆ యాచకుడు బాదుషావారిని యాచించక [...]
Read Full Post | Make a Comment ( 2 so far )తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ
కనీ వినీ ఎరుగని రీతిలో మన ఆంధ్ర ప్రజల సంతోషం కొరకు, భారి బడ్జెట్‌తో మన ప్రభుత్వం మనకు సమర్పిస్తున్న మెగా సిరియల్……
పేరు : అసెంబ్లీ
ప్రసారం : అన్నీ వార్తా ఛానళ్లు (live & exclusive)
అన్నీ తెలుగు ఛానళ్లు(exclusive)
దిన పత్రికలు
సమయం : కచ్చితముగా చెప్పలేము ( ఒకవేళ మొదలైనా నిరసనలు మరియు వాకౌట్‌ల వల్ల ఆగిపోవచ్చు)
నిర్మాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దర్శకుడు : గౌ॥స్పీకరు గారు
తారాగాణం :
హీరో : డా॥వై.యస్.రాజశేఖర్ రెడ్ది
విలన్ : నారా చంద్రబాబు నాయుడు
(గమనిక: [...]
చిత్తశాంతికి సులువైన మార్గం
పట్టుపురుగు తనలోని దారముతో పసిడికాయ నల్లును. తుదకదియే దానికి గోరీ యగును. అట్లే, మనుజుడును తన మనసులోని వాంఛలనెడి దృఢ పాశములతో బోను నిర్మించుకొని, అందు బంధితుడై, తప్పించుకొని దారి తెలియక బాధపడుచుండును. కాని, అందుకొక మార్గమున్నది. ఆ మార్గమును గురువు ఉపదేశించును.లేదా, నీలోనున్న దైవమే నీకు స్ఫురింపజేయవచ్చును. నీవు చేసిన ప్రతి చెడ్ద పనిని నీ దినచర్యలో వ్రాసి పెట్టూకొను మనియు, ఆ వ్రాతను పలుమారు చదువుకొనుచు నిన్ను నీవే సంస్కరించుకొనుటకు నిశ్చయించుకొనుమనియు ఉపదేశించు గురువులు [...]
Read Full Post | Make a Comment ( 1 so far )పరమళించిన మానవత్వం
అది కొండలపై వెలసిన దేవాలయం. దైవ దర్శనం కోసం వేలాది భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన మెట్లెక్కి దేవుని దర్శించి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుంటారు. ఒక భక్త బృందం మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ గుంపులో కాళ్ళులేని ఒక వికలాంగుడు మెట్లెక్కలేక ప్రయాసపడుతూ ప్రాకుతూ, చెమటలు కార్చుకుంటూ మెట్లెక్కుతున్నాడు. చకచకా ముందుకు సాగుతున్న భక్తులెవరూ ఈ వికలాంగుని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా ఒక భక్తుడు మాత్రం వికలాంగుని దీనావస్థ చూచి జాలిపడి అతనిని తన భుజాలపై నెక్కించుకొని [...]
Read Full Post | Make a Comment ( 2 so far )ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!
క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను.
తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి [...]
సత్కర్మలు ద్వైతం, ఆధ్యాత్మికం అద్వైతం
మీరు భజనలు చేస్తున్నారు, జపధ్యానములు సల్పుతున్నారు, యజ్ఞయాగాదుల నాచరిస్తున్నారు. ఇవన్నీ ప్రాకృతమైన ప్రవృత్తి మార్గములేగాని, నివృత్తి మార్గములు కావు. ఇవన్నీ కేవలం సత్కర్మలేగాని, ఆధ్యాత్మికమునకు సంబంధించినది. అయితే, మీరు ఎట్టి కర్మలు చేస్తారో అట్టి ఫలితము మీకు తప్పక లభిస్తుంది. అనగా, సత్కర్మలవల్ల మీకు సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ప్రాప్తిస్తుంది. కాని, ఆత్మకు సంబంధించిన ఫలితం రాదు. కనుక, మొట్టమొదట సత్కర్మలతో ప్రారభించి క్రమక్రమేణ ఆత్మసంబంధమైన మార్గంలో ప్రవేశించాలి. ఎంత కాలమైనప్పటికీ సత్కర్మలలోనే ఉంటే ఇంక [...]
Read Full Post | Make a Comment ( 2 so far )మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి
మన్మోహనుడి దేశ స్వామి భక్తి:
నిన్న ప్రొద్దున, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రజలకు అందించే సందేశాన్ని చూడాలని దూరదర్శన్ ఛానల్ పెట్టాను. జెండా ఆవిష్కరణ మరియు పెరేడ్‌ను చూడలేకపోయాను, అయినా నేను చాలా ఆసక్తిగా ఎదురుచూచిన ప్రధాని సందేశ సమయానికి t.v. పెట్టానని ఆనందించా. చిన్నప్పుడు మా నాన్న మన్మోహన్ సింగ్ 90లలో విత్తమంత్రి గా పనిచేసిన రోజులలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చాలా కీలకమైనవి అని చెప్పారు. అప్పటి [...]
ఏ జో దేశ్ హై తేరా
ప్రపంచ నలుదిశలలో ఉన్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము గర్వించదగ్గరోజు. స్కూలు రోజులలోనైతే సైకిల్‌లకు, మా స్కూలు ఆటో మరియు బస్సులకు జెండాలను కట్టేవారము. స్కూలులో ఒక అతిథి వచ్చి జెండాను ఆవిష్కరించి నాలుగు మంచి మాటలు చెప్పిన తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసేవారు. తర్వాత రాజ్యమంతా మాదే. ఆటపాటలు, నాటకాలు నిర్వహించేవారము. చివరన జనగణమన ఆలపించి సంబారాలకు అంతం పలికేవారము. ఇంటర్ [...]
Read Full Post | Make a Comment ( 11 so far )« Previous Entries

RSS - Posts

