బధ్రపరచినది నవంబరు, 2009
ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా
శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా. మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో [...]
Read Full Post | Make a Comment ( 3 so far )తండ్రి మనస్సు
మా నాన్నగారు వంశపార్యంపరంగా వస్తున్న మా చిల్లర అంగడి ( దీనినే కొన్ని చోట్ల కిరాణా కొట్టు అనో లేక శెట్టంగడి అనో లేక ఉత్తిగా కిరాణా అనో పిలుస్తుంటారు ) నిర్వహిస్తున్నారు. మా జీవనాధారం, ఊపిరి అంతా అదే. మాకు అన్నం పెట్టే దైవమది. నా ఇంజనీరింగు ఈ ఏడాదే పూర్తయ్యింది. నాకు ఉద్యోగవకాశం ఇచ్చిన సంస్థ వారు, వచ్చే నెల నన్ను ఉద్యగంలోకి తీసుకోనున్నారు. మరి ఈ కాలీ సమయాన్ని ఎలా తోసిబుచ్చాలని నేను [...]
Read Full Post | Make a Comment ( 7 so far )English నుంచి తెలుగు నేర్చుకోవలసినది….
ఇది మీరు చదువుతున్నారంటే కచ్చితంగా తెలుగువారే అయివుంటారని నేను అనుకుంటాను. తెలుగులో బ్లాగు/సైట్లను నిర్వహిస్తున్నవారు, రచనలు చేసేవారు మాతృభాష మీద అభిమానము చేతనే ఆ పని చేస్తున్నారు. కని గమనించారా? తెలుగు బ్లాగుల URLలు ఆంగ్లములో ఉన్నది. కనీసం, తెలుగులో URL అంటే ఏంటని కూడా నాకు తెలియదు. అది నా పరి(దుః)స్థితి. కాని, మనకు నచ్చిన భాషలో URLలను పొందవచ్చని ఎక్కడో ఒక బ్లాగులో చదివాను. ప్రస్తుతం తెలుగుభాష యొక్క స్థితిని ఏవిధంగా మెరుగుపరచడం అని [...]
Read Full Post | Make a Comment ( 7 so far )బాల్యం returns (నా మదిలో….)
నా బాల్యము గడిచిపోయినదని మొన్న నాకు మరోమారు గుర్తుకువచ్చినది. మొన్న, నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా నేను చదివిన పాఠశాలకు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకు వెళ్ళాలన్న ఉద్దేశ్యం కూడా ఉన్నది కాదు. నా మిత్రుడు విద్యా సాగర్‌కు ఎంతైనా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. అతనే నన్ను మా పాఠశాలకు తీసుకువెళ్ళాడు. ఆ రోజు నాకు చాలా గుర్తుండిపోతుంది. నేను మా పాఠశాలలో 10 సంవత్సరాల కాలం చదువుకున్నాను. ఇప్పుడు ఆ సంతోషకరమైన, [...]
Read Full Post | Make a Comment ( 2 so far )మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు
నా గడిచిన జీవిత కాలంలో, నేను డబ్బుతో ముడిపడివున్న ఎన్నో సంఘటనలను గమనించాను. వాస్తవానికి మనకు తెలిసో తెలియకో మన జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని. ఈ సత్యం జీర్ణించుకోవటానికి కాస్త కష్టంగానే ఉన్నా, నిత్య జీవిత ఘటనలను నిశిధంగా పరిశీలిస్తే ఇది బాగా అర్థమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము. [...]
Read Full Post | Make a Comment ( 8 so far )మౌనానందం
నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో శ్రీ సత్య సాయి బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను. మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని [...]
Read Full Post | Make a Comment ( 6 so far )మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 2వ భాగం
ఈ శీర్షికలోని మొదటి భాగంలో బాల్య మిత్రులను గురించి చెప్పుకొచ్చాను. బాల్యంలో కాకుండా తర్వాతి కాలంలో మనకు మిత్రులైన వారు నిజమైన స్నేహితులు కారా? అనే సందిగ్ధంతో ముగించాను. “Tell me who your friends are and I will tell you who you are” అనే సామెత ఒకటున్నది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అతని మిత్రులను బట్టి లెక్కకట్టవచ్చన్నది దీని అర్థం. అందరూ ఈ సామెతతో పూర్తిగా/పాక్షికంగా ఏకీభవించకపోవచ్చు. కాని, మన [...]
Read Full Post | Make a Comment ( None so far )అంతస్సారం
రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది. గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే [...]
Read Full Post | Make a Comment ( 2 so far )



