ఆధ్యాత్మికం
ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా
శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా. మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో [...]
Read Full Post | Make a Comment ( 3 so far )మౌనానందం
నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో శ్రీ సత్య సాయి బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను. మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని [...]
Read Full Post | Make a Comment ( 6 so far )నాస్తికవాదులారా! మీకో విజ్ఞప్తి
ప్రపంచాన్ని మనం చూసే కోణాన్నిబట్టే అది మనకు కనిపిస్తుంది. మనసు చంచలమైనది. రాగద్వేషాలకు నిలయం. అనుకూలతలను, వ్యతిరేకతలను సృష్టిస్తూ ఉంటుంది. సిద్ధాంతాలు చాలా ప్రమాదకరమైనవి. అవి అహంకారానికి ప్రతిరూపాలు. ‘నా సిద్ధాంతమే గొప్పది’ అనేవారు ఇతరుల మనోభావాలను గౌరవించలేరు, వ్యతిరేకతను సృష్టించుకుంటారు. అదే మానవ మేథస్సునందలి బలహీనత, పక్షపాతవైఖరి ఉన్నంతవరకు సత్యదర్శనం కాదు. సైన్సు కేవలం ప్రాథమికమైనది, పరిమితమైనది. తెలుసుకొనడానికి అవసరమేకాని సాధనకు అవరోధమే. అందుకే Where Science ends there philosophy starts, where philosophy [...]
Read Full Post | Make a Comment ( 19 so far )దారము ఆధారము
ఈనాటి సైంటిస్టులందరూ కేవలము సృష్టిని గురించి పరిశోదనలు సలుపుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు సృష్టికర్తను గురించి పరిశోదన చేస్తున్నారు. ఆధారాన్ని కాకుండా కేవలం అధేయాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం తెలివితక్కునే చెప్పాలి. హారమునకు ఆధారమైన దారమును కాకుండా హారమును మాత్రమే చూసేవారు చాలా మంది ఉంటారు. ఆధారమును చూసేవారు ఏ కొద్ది మందో ఉంటారు. దారము ఆధారము, పుష్పములు అధేయములు. ఈనాడు పుష్పము నిన్న మొగ్గ, కాని దారము నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే, దారము వలే [...]
Read Full Post | Make a Comment ( 2 so far )సత్కర్మలు ద్వైతం, ఆధ్యాత్మికం అద్వైతం
మీరు భజనలు చేస్తున్నారు, జపధ్యానములు సల్పుతున్నారు, యజ్ఞయాగాదుల నాచరిస్తున్నారు. ఇవన్నీ ప్రాకృతమైన ప్రవృత్తి మార్గములేగాని, నివృత్తి మార్గములు కావు. ఇవన్నీ కేవలం సత్కర్మలేగాని, ఆధ్యాత్మికమునకు సంబంధించినది. అయితే, మీరు ఎట్టి కర్మలు చేస్తారో అట్టి ఫలితము మీకు తప్పక లభిస్తుంది. అనగా, సత్కర్మలవల్ల మీకు సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ప్రాప్తిస్తుంది. కాని, ఆత్మకు సంబంధించిన ఫలితం రాదు. కనుక, మొట్టమొదట సత్కర్మలతో ప్రారభించి క్రమక్రమేణ ఆత్మసంబంధమైన మార్గంలో ప్రవేశించాలి. ఎంత కాలమైనప్పటికీ సత్కర్మలలోనే ఉంటే ఇంక [...]
Read Full Post | Make a Comment ( 4 so far )లక్ష్మీకృప కలగాలంటే…….
లక్ష్మీదేవి ఏ ఇంటిని విడిచిపెడుతుందో, ఏ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మన పురాణాది వాంగ్మయం స్పష్టంగా పేర్కొంది. మంచి అలవాట్లు, సద్గుణాలు,సౌమనస్య వాతావరణం, శుచీ శుభ్రత, సదాచారం కలిగిన ఇంట అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో ఆ ఇంట సిరి తాండవిస్తుంది. తల్లినీ, తండ్రినీ, గురువునీ అవమానించే చోట లక్ష్మి నిలవదు. ఏ ఇంట అతిథికి భోజనం పెట్టరో, ఆ చోట సిరి నిలవదు. అబద్ధాలాడేవారు, ఏదీ ఎవరకీ ఈయక [...]
Read Full Post | Make a Comment ( 2 so far )నిన్ను నీవు తెలుసుకో!
ఈనాడు లోకములో ‘నాకన్నీ తెలుసున’ని విఱ్ఱవీగే వెఱ్ఱివ్యక్తులు ఎందరో ఉన్నారు. కాని, వారిలో ఒక్కరైనా ఆనందమునకు నోచుకోలేకపోతున్నారు. అన్నీ తెలిసిన వారైతే ఆనందమునకు ఎందుకు దూరము కావలెను? పరమానందయ్య శిష్యులలో ఎన్నిసార్లు లెక్కించినా ఒక్కడు తక్కువగా ఉన్నాడనే కథను మనము వినే ఉంటాము. ఆఒకడు ఎవడంటే తనను తాను మరచినవాడే. మానవుడు తన నిజతత్త్వమును తాను గుర్తించక అన్నీ తెలుసుకొన్నవాడుగా తయారైతే ఫలితము లేదు. మొదట తనను తాను గుర్తించుకొనే ప్రయత్నము పూనుకోవలెను. దీనికే ఆధ్యాత్మిక మార్గమని [...]
Read Full Post | Make a Comment ( 10 so far )భగవంతుడు భావప్రియుడు
సత్యభామ ఒకనాడు బంగారు తట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచి “ఇవి నా తోటలో పండిన పండ్లు. ఈ జాతి మరియెక్కడను లేదు” అని వాటిని గూర్చి గొప్పగా వర్ణించింది. కృష్ణుడొక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ‘ఇవి సారహీనముల’ని చప్పరించి పడవేసెను. ఇంతలో ‘గుబ్బి’ యను ఒక గొల్లపిల్ల దోసిటిలో కొన్ని పండ్లు తెచ్చి, “స్వామీ! ఇవి అల్లోనేరేడు పండ్లు; స్వామివలె శ్యామసుందరములు; అందువలన నాకు మిక్కిలి ప్రియములు. దయతో [...]
Read Full Post | Make a Comment ( 5 so far )ఆనందో బ్రహ్మ
పుట్టపర్తి సత్యసాయిబాబాను వేలాదిగా, లక్షలాదిగా జనం ఆయన చుట్టూ ఒక తన్మయీభావంతో తేలిపోతూ ఉంటారు. వారిని ఆయన చిరునవ్వుతోనూ, ‘బంగారూ ‘ అన్న పలకరింపుతోనూ పరామర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. ఈ మొత్తం క్రమంలో ఎక్కడలేని నింపాదితనం, ప్రశాంతత, ఆనందం, ఆయన మొహంలో కనిపిస్తుంటుంది. ఆయన ఒకానొక పుట్టినరోజున లక్షాలాదిమంది భక్తులు ఒక్కసారి ‘హాపీ బర్తడే బాబా’ అంటూ విషెస్ చెప్పారు. తెల్లరినప్పటి నుంచి ఇదే తంతు జరుగుతోందని ఆయన సభలో చెబుతూ “ఈ రోజు ప్రత్యేకించి ‘హాపీ’ [...]
Read Full Post | Make a Comment ( 1 so far )



