కథా స్రవంతి
పరమళించిన మానవత్వం
అది కొండలపై వెలసిన దేవాలయం. దైవ దర్శనం కోసం వేలాది భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన మెట్లెక్కి దేవుని దర్శించి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుంటారు. ఒక భక్త బృందం మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ గుంపులో కాళ్ళులేని ఒక వికలాంగుడు మెట్లెక్కలేక ప్రయాసపడుతూ ప్రాకుతూ, చెమటలు కార్చుకుంటూ మెట్లెక్కుతున్నాడు. చకచకా ముందుకు సాగుతున్న భక్తులెవరూ ఈ వికలాంగుని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా ఒక భక్తుడు మాత్రం వికలాంగుని దీనావస్థ చూచి జాలిపడి అతనిని తన భుజాలపై నెక్కించుకొని [...]
Read Full Post | Make a Comment ( 2 so far )చెంప దెబ్బ
నస్రుద్దిన్ హోడ్జా బజారులో ఉండగా, ఒక అపరిచితుడు నస్రుద్దిన్ దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టిన తర్వాత “నన్ను క్షమించండి. మిమ్ములను వేరొకరని పొరబడ్డాను” అని అన్నాడు.
ఆ సమాధానముతో తృప్తి చెందని నస్రుద్దిన్, ఆ అపరిచితుడిని ఖాది దగ్గరకు తీసుకెళ్లి పరిహారము కోరాడు. ఆక్కడికి వచ్చాక, ఖాది మరియు ఆ అపరిచితుడు మంచి మిత్రులని గ్రహించాడు నస్రుద్దిన్. అపరిచితుడు తన తప్పును అంగీకరించిన తర్వాత, న్యాయమూర్తి అయిన ఖాది “తప్పుచేసిన అపరాధి, బాధితుడికి ఒక అణా పరిహార [...]
నీకు నీవే విధాతవి
లోకంలో చాలా మంది తమ సుఖదుఃఖాలకు, కష్టనష్టాలకు విధాత నొసట రాసిన గీతలే కారణంగా భావిస్తుంటారు. అది కొంతవరకే నిజం. ప్రతివ్యక్తీ తనకు తానే విధాత అనే సత్యాన్ని గ్రహించడు.
అదెలాగో చూద్దాం!
మాధవపురంలో సుమతి, కుమతి అనే ఇద్దరు సోదరులుండేవారు. తండ్రి భూస్వామికావటంవల్ల, తండ్రి మరణానంతరం ఇద్దరికీ విలువైన ఆస్తులు వచ్చాయి. కుమతి పేరుకు తగినట్లే చిన్నతనం నుండీ అసూయాపరుడు. పరమ సోమరికావడంతో తండ్రికి ఏ పనిలోనూ సాయం చేసేవాడు కాదు. ఇందుకు విరుద్ధంగా సుమతి తండ్రికి అన్నిపనుల్లోను [...]
బుర్ఖా
నస్రుద్దిన్ హోడ్జా మొదటి వివాహము, పెద్దలు కుదిర్చిన వివాహము. దానికి తోడు, అప్పటి ఆచారం ప్రకారం అతను వధువును పెళ్లికి ముందు చూడలేదు. పెళ్లి రోజున మొదటి సారి వధువును చూసిన తర్వాత ఆమె మొహము నచ్చక, నిరాశ చెందాడు.
ఆ మరుసటి దినము అతని భార్య బజారుకు వెళ్ళుటకు తయారవుతూ, అప్పటి ఆచారాని పాటిస్తూ “ఏమండి, నేను బుర్ఖా తొడిగి వెళ్లనా? నేను మీ అనుమతి లేనిది ఎవ్వరికీ నా మొహం చూపను”అని తన భర్తతో అన్నది.
దానికి [...]
నరుడి బ్రతుకు నటన
ఇప్పుడే అందిన వార్త: నక్సలైట్లపై పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు రామ్ కుమార్ కూడా మృతిచెందాడు. తన కారు చెడిపోవడంతో అటుగా వస్తున్న నక్సలైట్లు వ్యానును గుర్తించకుండా లిఫ్ట్ అడిగి , ఎక్కడంతో ఆయనకు ఈ ప్రమాదం సంభవించినట్లు రామ్ కుమార్ కారుడ్రైవరు గోవిందం తెలిపాడు” అని ప్రముఖ టీ.వి.చానళ్ళలోని వార్తల్లోని ముఖ్యాంశాలలో ఆయన మృతివార్తను ప్రసారం చేయడం జరిగింది!
******************
ఆ వార్త విన్న సీత గుండె గుభేలుమంది! ఇక తనకి దిక్కెవరన్నట్లు కూలబడిపోయింది. ఇంట్లో [...]

RSS - Posts

