దేశ భక్తి

ఏ జో దేశ్ హై తేరా

Posted on ఆగష్టు 15, 2009. Filed under: దేశ భక్తి, సంగీతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

ప్రపంచ నలుదిశలలో ఉన్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము గర్వించదగ్గరోజు. స్కూలు రోజులలోనైతే సైకిల్‌లకు, మా స్కూలు ఆటో మరియు  బస్సులకు జెండాలను కట్టేవారము. స్కూలులో ఒక అతిథి వచ్చి జెండాను ఆవిష్కరించి నాలుగు మంచి మాటలు చెప్పిన తర్వాత  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసేవారు. తర్వాత రాజ్యమంతా మాదే. ఆటపాటలు, నాటకాలు నిర్వహించేవారము. చివరన జనగణమన ఆలపించి సంబారాలకు అంతం పలికేవారము. ఇంటర్ [...]

Read Full Post | Make a Comment ( 11 so far )

వీళ్ల గురించి ఆలోచించడం అవసరమా?!

Posted on ఆగష్టు 14, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , , |

రాములమ్మ(విజయశాంతి) తెలంగాణ కొరకు ఒక పార్టీని పెట్టింది, తర్వాత గద్దముక్కాయన(కే.సి.ఆర్) పార్టీలో విలీనం చేసింది. మరి ఇప్పుడు ఆ పార్టీను కూడా వీడింది. అసలు ఆమె తెలంగాణ కోసం ఏమి చేస్తున్నట్టు?! దేవందర్ గౌడ్ తెలుగుదేశం వద్దని నవ తెలగాణ పార్టీని పెట్టాడు, ఆ పార్టీ నవ్యత్యం కోల్పోకుండానే మెగాస్టార్ పార్టీలో విలీనం చేశాడు. కాని, ఇప్పుడు ఏమైందో ఏమిటో తిరిగి సొంత గూటికి చేరాడు. అసలు ఇంత తతంగం ఎందుకు?! అసలు వీరికి ప్రజల కంటే [...]

Read Full Post | Make a Comment ( 3 so far )

మన ‘జాతీయగీతం’ చరిత్ర

Posted on ఆగష్టు 12, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |

మనభారత జాతీయచిహ్నాలలో ‘జాతీయగీతం’ ఒకటి. నేడు దేశమంతటా జాతీయగీతంగా ఆలపించబడుతున్న ‘జనగణమన’ గీత పుట్టుపూర్వోత్తరాలు, ప్రతి భారతీయుడు తెలుసుకోవటం ఎంతైనా అవసరం. జనగణమనగీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. భారతస్వాతంత్ర్య సమరంలో ‘వందేమాతరం’ గీతం విస్తృత ప్రాచుర్యం పొందినప్పటికీ ఆ గీతం లయబద్ధంగా లేదనే కారణాన జాతీయగీత ప్రతిపత్తిని పొందలేకపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంపాదకత్వంలో వెలువడే ‘తత్త్వబోధిని’ అనే పత్రికలో ‘భారతవిధాతా’ అనే శీర్షికతో తొలుత రచించారు. ఈ గీతం బెంగాలీభాషలో మొత్తం 31 చరణాలుండేది. కానీ అందులో [...]

Read Full Post | Make a Comment ( None so far )

జపనీయుల దేశభక్తి

Posted on ఆగష్టు 10, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , |

రెండవ ప్రపంచయుద్ధంలో అణుబాంబులను గుండెలపై వేయించుకొని ధ్వంసమైన జపాన్ పునఃనిర్మాణమంత్రం ‘దేశభక్తి’ అంటారు. జపాన్ దేశభక్తికి ఉదాహరణగా ఒక విషయం చెబుతారు. అక్కడ బుద్ధభగవానుడిని ఎవరైనా తిడితే‌ ఏం చేస్తావని అడిగితే వాళ్ళ తల నరికేస్తానంటారట. మరి బుద్ధుడు మీ దేశాన్ని తిడితే ఏం చేస్తారంటే ‘ఆ బుద్ధుడి తలే నరుకుతాం’ అంటారత. కానీ మనం ఎవరి తలలు నరకవలసిన అవసరం లేదు. అంతర్గత బలహీనతలను , అవలక్షణాలను నరికి, ఆత్మావలోకనంలో వికసించే విధానాలను విద్యలను మనకు [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

బలైపోతున్న భరతజాతి కుసుమాలు

Posted on జులై 9, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , |

డాలర్ దాహంతో …. జాత్యహంకార జ్వాలల్లో… బలైపోతున్న  భరతజాతి కుసుమాలు అభద్రత-భయం రూపాంతరం చెంది అసూయా ద్వేషాలై జాత్యహంకార సర్పం విషజ్వాలలు కక్కుతుంటే మేథస్సు, శ్రమ, నిజాయితీతో కూడిన సేవలు విస్తుపోయి కుదేలౌతున్నాయి. జీవన పోరాటంలో, కాసులవేట వ్యామోహంలో దేశ-ఖండాంతర సరిహద్దులు, సముద్రాలను దాటి వెళ్ళిన భారత యువత దిక్కుతోచని స్థితిలో దాడుల నెదుర్కొంటూ బిక్కుబిక్కుమంటుంది. ‘తెలివితేటలంటే ఎంత కరెన్సీ మూటకట్టాం’ అని భ్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో డాలర్ దాహంలో‌  వేల కిలోమీటర్ల దూరాలు పోయి విదేశీదాడుల్లో [...]

Read Full Post | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...

Follow

Get every new post delivered to your Inbox.