వ్యక్తిత్వ వికాసం
వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…
వ్యసనం – వ్యాపకం… రెండింటిలో ఏది మేలు చేస్తుంది? మరియు వాటి నడుమ గల వ్యత్యాసాన్ని ఈ టపాలో కనుగొనండి.
Read Full Post | Make a Comment ( 4 so far )ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా
శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా. మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో [...]
Read Full Post | Make a Comment ( 3 so far )అంతస్సారం
రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది. గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే [...]
Read Full Post | Make a Comment ( 2 so far )సంకల్పాలు
విత్తనం ఏ రీతిగా వృక్షమై ఫలాల నందిస్తుందో, సంకల్పాలు కూడా అదే విధంగా క్రియారూపం ధరించి ఫలరూపంగా మారిపోతాయి. దుష్టభావనలు మనస్సులో ఉన్నంత వరకూ దుష్టప్రవర్తన తోటే జీవితం అంతమొందుతూ వుంటుంది. సద్భావాలు హృదయంలో ఆవిర్భవించినపుడు అవి సత్-చింతనగా శుభదృష్టిగా రూపొందుతాయి. కనుక సాధ్యమైనంత వరకు మన సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండేటట్టు ప్రయత్నపూర్వకంగా మనం సాధన సాగించాలి. సంకల్పాలు ఒక సంకల్పం నుండి మరో సంకల్పానికి పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సంకల్పం అనేక సంకల్పాలకు [...]
Read Full Post | Make a Comment ( 1 so far )మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!
Self Reliance is not about being independent, but interdependent. ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో….. ఒక్కరైనా నీ కేకవిని ఓ యని రాకున్నా… ఒక్కడవే బయలుదేరు ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే ఒక్కడవే బయలుదేరు. జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. [...]
Read Full Post | Make a Comment ( 8 so far )వాదోపవాదాల కాలక్షేపం వద్దు
చాలా మామూలు సంభాషణతో మొదలయి, వాదనగా మారి .. చివరికి గొడవగా పరిణమించే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవైకవేద్యమే. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులమధ్యనో, స్నేహితులమధ్యనో బయటిప్రపంచం వ్యక్తులతోనో అనుభవంలోకి రావచ్చు. వాదోవవాదాలు లేకుండా ఉంటాయా? మాట నేర్చిన మనిషి ఎంత కాదనుకున్నా ఈ ‘వాదోపవాదాల’ సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అతను ఉపయోగించాల్సిందల్లా గొడవదాకా దారితీయకుండా చూసుకునే తనదైన ‘విద్వత్తు’ను. సంభాషణ నుంచి వాదనకు మన మాటతీరు ఎలా మారింది? అన్నది మనం జాగ్రతగా గమనించాల్సి [...]
Read Full Post | Make a Comment ( 4 so far )సర్దుబాటు మనస్తత్వం కీలకం!
ఆధునిక జీవితంలో మనిషి సంతోషంగా జీవించాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇంకొన్ని సామాజిక పరమైన సమస్యలు, మరికొన్ని వృత్తిపరమైన సమస్యలు. అనేకమైన సవాళ్ళు, సమస్యలు ఎదురయ్యే సమాజంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అనుకున్నట్లు మనచుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు ఉండవు. వాటికి తగ్గట్టుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. ‘Ability is something but test is everything’ అన్నారు. test [...]
Read Full Post | Make a Comment ( 2 so far )పట్టుదల ముఖ్యం
ఓ సరస్సు ఒడ్డున కొంతమంది విదేశీ యువకులు నిలబడి తమ చేతిలో ఉన్న తుపాకులతో నీటిమీద తేలుతున్న కోడిగుడ్డు డొల్లలను గురిచూసి కాల్చసాగారు. కాని వారి గురి తప్పుతోంది. ఆ దోవనే వెళుతున్న ఓ కాషాయ వస్త్రధారి అది గమనించి ఓ యువకుడి వద్ద నుండి తుపాకి తీసుకుని వరుసపెట్టి కోడిగుడ్డు డొల్లలను కాల్చాడు. ఆశ్చర్యం! ఒక్కటి కూడా గురి తప్పలేదు. అప్పుడు ఆ విదేశీ యువకులంతా కాషాయ వస్త్రధారితో “షూటింగ్ లో మీకు గొప్ప అనుభవం [...]
Read Full Post | Make a Comment ( 7 so far )అంతరాలున్నవి అధిగమించడానికే
నిత్యజీవితంలో ప్రతీ మనిషీ కాస్త అటుఇటుగా తనకు ఎదురయ్యే అవాంతరాలకు నిరాశతో ఉసూరుమనడం సహజాతిసహజం. కాని ఈ నిరాశకాలం ఎంత తక్కువయితే మనిషికి అంతమంచిది, అలాకాదని నిరంతరం పైవిధంగా చింతిస్తూపోతే, ఇలాంటి ‘చింతన’నే ఆలోచనల్లో ప్రధనభాగం చేసుకుంటే అతను కానీ ఆమె కానీ జీవితంలో చాలా కోల్పోవలసివస్తుంది. మనకు అవాంతరాలు ఎదురయ్యాయంటే మనం ఒక పనిని మొదలెట్టామని అర్థం. ఏదో ఒకపని మొదలు పెట్టడమన్నది ఎప్పుడూ మంచిదే. అలా మొదటి అడుగు మంచిది అయినప్పుడు ఇక మనం [...]
Read Full Post | Make a Comment ( None so far )మూడ్
మంచిమూడ్ మన జీవితంలో చాలా అవసరం. పనిలోను, వ్యవహారల్లోనూ, సృజన శక్తులు పెంచుకోవడంలోను మంచి మూడ్స్ ( moods ) ఎప్పుడూ అవసరమే. మనసుకు బాధపడటం కూడా ఆనందాన్ని ఇస్తుందని అంటారు తాత్వికులు. అలా బాధపడటం అనేది అలవాటుగా చేస్తే మనం నీరసించిపోవటం మినహా సాదించేది ఏమీ ఉండదు. మన మూడ్స్ మన మనసుకు కళ్లేల వంటివి. కళ్లాలను చేపట్టి సమర్ధవంతంగా స్వారీచేయగలిగితేనే మనం మన గమ్యస్థానాలను చేరుకోగలం అన్నది సత్యం. ప్రశాంతంగా, నవ్వుతూ ఉండటమన్నది ఒక [...]
Read Full Post | Make a Comment ( None so far )



