సూక్తి రత్నావలి

మౌనానందం

Posted on నవంబరు 5, 2009. Filed under: ఆధ్యాత్మికం, సూక్తి రత్నావలి | Tags: , , , , , , , , , , , , , , |

నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో  శ్రీ సత్య సాయి  బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను.
మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

చిత్తశాంతికి సులువైన మార్గం

Posted on ఆగష్టు 20, 2009. Filed under: సూక్తి రత్నావలి | Tags: , , , , , , , , , , , , , , , , , |

పట్టుపురుగు తనలోని దారముతో పసిడికాయ నల్లును. తుదకదియే దానికి గోరీ యగును. అట్లే, మనుజుడును తన మనసులోని వాంఛలనెడి దృఢ పాశములతో బోను నిర్మించుకొని, అందు బంధితుడై, తప్పించుకొని దారి తెలియక బాధపడుచుండును. కాని, అందుకొక మార్గమున్నది. ఆ మార్గమును గురువు ఉపదేశించును.లేదా, నీలోనున్న దైవమే నీకు స్ఫురింపజేయవచ్చును. నీవు చేసిన ప్రతి చెడ్ద పనిని నీ దినచర్యలో వ్రాసి పెట్టూకొను మనియు, ఆ వ్రాతను పలుమారు చదువుకొనుచు నిన్ను నీవే సంస్కరించుకొనుటకు నిశ్చయించుకొనుమనియు ఉపదేశించు గురువులు [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

మృదు మధుర భాషణ

Posted on ఆగష్టు 5, 2009. Filed under: సూక్తి రత్నావలి | Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , |

భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు. దానితో మనం రెండు పనులు చేసుకోవచ్చు. ఒకటి రుచి చూడడం. రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాము. తియ్యగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకమే మన వశమవుతుంది.
కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం. కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కోకిల చేసిన పుణ్యమేమి? కాకి చేసిన [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

సంకల్పాలు

Posted on ఆగష్టు 2, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం, సూక్తి రత్నావలి | Tags: , , , , , , , , , , |

విత్తనం ఏ రీతిగా వృక్షమై ఫలాల నందిస్తుందో, సంకల్పాలు కూడా అదే విధంగా క్రియారూపం ధరించి ఫలరూపంగా మారిపోతాయి. దుష్టభావనలు మనస్సులో ఉన్నంత వరకూ దుష్టప్రవర్తన తోటే జీవితం అంతమొందుతూ వుంటుంది. సద్భావాలు హృదయంలో ఆవిర్భవించినపుడు అవి సత్-చింతనగా శుభదృష్టిగా రూపొందుతాయి. కనుక సాధ్యమైనంత వరకు మన సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండేటట్టు ప్రయత్నపూర్వకంగా మనం సాధన సాగించాలి. సంకల్పాలు ఒక సంకల్పం నుండి మరో సంకల్పానికి పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సంకల్పం అనేక సంకల్పాలకు [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

జిహ్వా బహుపరాక్!!!

Posted on జులై 15, 2009. Filed under: సూక్తి రత్నావలి | Tags: , , , , , , , , , , , |

ఓ నాలుకా! తిండి తినే విషయంలో, తిన్నగా మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండు. తిండి ఎక్కువగా తిన్నా, మాటలు ఎక్కువగా మాట్లాడినా ప్రాణహాని కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకో!
పంచేంద్రియాల్లో నాలుక ప్రధానమైనది. భాషకు పర్యాయపదంగా నాలుక ప్రయోగించబడుతుంది.’వాడు నోట్లో నాలుక లేనివాడు’ అంటే సరిగా మాట్లాడలేనివాడు, అమాయకుడు అనే అర్థాలు వస్తాయి. వాక్కును ఉత్పత్తిచేసే ప్రధాన సాధనాల్లో నాలుక ఒకటి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తిండి తినటానికి కూడా నాలుక అవసరం ఎంతో ఉన్నదనే విషయాన్ని [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

మన చరిత్ర – మన భవిష్యత్తు

Posted on జూన్ 15, 2009. Filed under: సూక్తి రత్నావలి | Tags: , , |

ఏ జాతికీ తన చరిత్రను గురుంచిన వాస్తవికమైన జ్ఞానము ఉండదో ఆ జాతికి భవిష్యత్తు కూడా ఉండదు. అయితే ఆ సత్యంతోబాటు మరో‌మహా సత్యం కూడా ఉంది. ఏ జాతి అయినా తన గౌరవ పూర్ణ గత చరిత్రతో తన్మయత్వం పొందితే సరిపోదు, తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడంలో‌ గత చరిత్రను ఉపయోగించుకొనే క్షమత సంపాదించుకోవడం కూడా అత్యంత అవశ్యకం. “మా తాతలు నేతులు త్రాగేరు, కావాలంటే మా మూతులు వాసన చూడండి” అని గొప్పలు చెప్పుకోరాదు. మన [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

మిత్ర లాభం

Posted on జూన్ 12, 2009. Filed under: సూక్తి రత్నావలి | Tags: , |

మానవుడు సంఘజీవి . నిత్యమూ ఇతరులతో కలిసి మాత్లాడకపోతే జీవనం సాగదు. అంటే సమాజంలోని ఇతరులతో  తప్పనిసరిగా  సంబంధం పెట్టుకోక తప్పదు. అందుకే తోటివారితో మిత్రభావంతో మెలగాలి. స్నేహంగా ప్రవర్తించాలి. ఎదుటివారినుంచి నువ్వు ఏది ఆశిస్తావో దాన్ని నువ్వు కూడా ఎదుటివారికి చేస్తే స్నేహం పదికాలాలపాటు మనగలుగుతుంది. స్నేహం పలుసందర్భాల్లో ఏర్పడవచ్చు. పరిసరాలవల్ల, విద్యాభ్యాసం చేసేటప్పుడు, ఉద్యోగ నిర్వహణలో, ప్రయాణాల్లో  స్నేహాలు కలుగవచ్చు. అయితే కొన్ని స్నేహాలు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించి ఆ తర్వాత కొనసాగపోవచ్చు. మరికొన్ని [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

సేవ ఎందుకంటే

Posted on జూన్ 9, 2009. Filed under: సేవ | Tags: , |

మన జీవితములో అనేక వేలమంది సహాయ సహకారములు పొందుతున్నము. ఇతరులకు ఎల్లవేళలా సహాయపడుతూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. ఇతరులకు సహాయపడాలన్న కోరికతో వీలైనంత సేవచేయటములో ఆత్మానందం లభిస్తుంది. ఈ సేవలు ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో చేసినప్పుడే దైవప్రీతిని పొందగలము. అసలైన సంఘసేవకు కావలసిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం అప్పుడే లభిస్తాయి.

Read Full Post | Make a Comment ( 1 so far )

సేవలోనే ఆనందం

Posted on జూన్ 8, 2009. Filed under: సేవ | Tags: |

మీచే సేవలందుకొనే వారిని మీ నిజస్నేహితులుగా భావించు. అదే నిన్ను భవష్యత్తులో వెలుగులోనికి తీసుకొని పోతుంది. దర్పాన్ని, అహంకారాన్ని, అధికారాన్ని, అసూయను, అనుమానాన్ని సేవాలో ప్రవేశపెట్టరాదు. వ్యక్విగత సేవలకంటే సామాజిక సేవలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ప్రతివారూ సేవలో పాల్గొనాలి. సేవకుడే నాయకుడైననాడు ప్రపంచం అభివృధ్ది    చెందుతుంది.

Read Full Post | Make a Comment ( 6 so far )

Liked it here?
Why not try sites on the blogroll...