నరుడి బ్రతుకు నటన

Posted on జూన్ 10, 2009. Filed under: కథా స్రవంతి |


ఇప్పుడే అందిన వార్త: నక్సలైట్లపై పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు రామ్ కుమార్ కూడా మృతిచెందాడు. తన కారు చెడిపోవడంతో అటుగా వస్తున్న నక్సలైట్లు వ్యానును గుర్తించకుండా లిఫ్ట్    అడిగి , ఎక్కడంతో ఆయనకు ఈ ప్రమాదం సంభవించినట్లు రామ్ కుమార్ కారుడ్రైవరు గోవిందం తెలిపాడు” అని ప్రముఖ టీ.వి.చానళ్ళలోని వార్తల్లోని ముఖ్యాంశాలలో ఆయన మృతివార్తను ప్రసారం చేయడం జరిగింది!

******************
ఆ వార్త విన్న సీత గుండె గుభేలుమంది! ఇక తనకి దిక్కెవరన్నట్లు కూలబడిపోయింది. ఇంట్లో ఏమని చెప్పలో తెలియక, తనలోతాను సతమతమవుతున్నది. వీరు ప్రేమించుకున్నారన్న సంగతి తెలిసిన తల్లిదండ్రులు సీతను ఓదార్చారు.

******************
సీతా, రామ్ లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ పోటోపడి మరీ చదివేవారు! వారిద్దరిలోనే ఎప్పుడూ కాలేజీ ఫస్టూ, సెకండూనూ! ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో వాళ్ళ పరిచయం ప్రణయమై, పరిణయానికి దారితీసింది.

సీతా, రామ్ లు తమ పెద్దవాళ్ళతో  చెప్పి పెళ్ళి చేసుకుందామనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. రామ్ కుమార్ నడవడిక, సత్ప్రవర్తన చూసిన సీత తల్లిదండ్రులు వారి పెళ్ళికి తమకేమి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక రామ్ తల్లిదండ్రులని మాత్రమే ఒప్పించాలని అనుకున్నాడు.

ఎయ్.బి.ఎ. ఫైనలియర్ ఎగ్జామ్స్    అయిపోవడంలతో రామ్ తమ పెళ్ళివిషయం తన తల్లిదండ్రులకు కూడా చెప్పి ఒప్పిస్తానని, తన మాటను తన తల్లిదండ్రులు ఎప్పుడూ కాదనరనీ సీతకు చెప్పి, తన ఊరు ప్రయాణమయ్యాడు.

కానీ,ఇంతలోనే ఈ దుస్సంఘటాన సంభవించింది. సీత భోరున ఏడుస్తూ కూలబడింది. తీవ్రమైన మనస్తాపానికి లోనై, ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పడంతో తిరిగి కోలుకుంటోంది!

అర్థరాత్రి అపరాత్రులు కూడా సీత నిద్రలోంచి ఉలిక్కిపడిలేచి ఏడ్చేది. తాను ఎంతగానో ప్రేమించిన రామ్ ని దూరం చేసిన ఆ దేవుణ్ణి సైతం నిందించేది.

“ఎంత ఏడిస్తే మాత్రం పోయినోళ్ళు తిరిగివస్తారా? ఊరుకోమ్మా! … ఊరుకో!..” అని సీతను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ఓదార్చారు.

అప్పుడు చెప్పింది సీత గుండెలు బద్దలయ్యేలాంటి వార్తొకటి! తాను గర్భవతినని, తన కడుపులో రమ్ కుమార్ ప్రతిరూపం పెరుగుతోంది! ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. బోరున ఏడుస్తున్న కూతురును తాము ఓదార్చాల్సింది పోయి, తామే పసిపిల్లల్లా బోరున విలపిస్తున్నారు.

“ఇంక.. ఈ విషయం ఇంతటిటో మర్చిపొమ్మని చెప్పి, సీతకు అబార్షన్ చేయించాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. దానికి సీత ఏమాత్రం అంగీకరించలేదు. పోనీ రామూ విషయం దాచి, సీతకు ఓ మంచి సం బంధం చేయాలనుకున్నరు. దానికీ సీత ససేమిరా అంగీకరించలేదు.

“కవిత!.. వనిత!.. లత!.. ఆశ్రయం లేనిదే శోభిల్లవమ్మా! చెప్పిన మాట వినమ్మా!.. మేమునంతవరకు నీకు రక్షణ.. మేమిద్దరం దాటిపోతే .. నీకు రక్షణ కావాలి కదా! తల్లీ! కాదనకు..” అంటూ సీతను ఆమె తల్లిదండ్రులు బ్రతిమాలారు. సీత “సరే మే ఇష్టం!” అంది. అమ్మా, నాన్నా సంబంధం తెచ్చినప్పుడు కదా చూసుకునేది అనుకుంది.
******************
తక్కువస్థాయి నుంచి బాగా కష్టపడి పైకొచ్చి, ఇప్పుడు మంచి పొజీషన్ లో ఉన్న ఓక మంచి సంబంధం సీత తల్లిదండ్రులకు నచ్చింది.

కష్టపడి పైకివచ్చినవారు కనుక కష్ట, సుఖాలు తెలుస్తాయని సీతకు నచ్చజెప్పి, పెళ్ళిచూపులకు ఏర్పాటు చేశారు ఆమె తల్లిదండ్రులు.
******************
చూడానికి మర్యాదస్తుల్లా ఉన్నారు. అబ్బాయి పేరు రవి, చాలా అందంగా హూందాగా ఉన్నాడు. అతను కంప్యూటర్ ఇంజనీరుగా బెంగలూరులో జాబ్ చేస్తున్నాడు. ఎందుకో నా మనసు అంగీకరించకపోయినా పెద్దవాళ్ళని నొప్పించడం ఇష్టంలేక ఒప్పుకున్నను.

మంగళవాయిద్యాలతో, వేదమంత్రాల మధ్య మా పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. నా తల్లిదండ్రులు మా పెళ్ళిచూసి సంభరపడిపోయారు. నిండునూరేళ్ళు సుఖంగా జీవించండీ అని మా పెద్దలందరూ కలిసి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించారు. నాకు ఆనందం  కల్గినా.. నేను చేసిన తప్పు నన్ను ఏకో మూల వెంటాడుతూనే ఉంది.
*******************
‘ఏయ్ సీతా! నీవు చేస్తున్నది తప్పు! నీవు తప్పు చేసినది కాకుండా ఆ తప్పును ఇంకొకరికి రుద్దుతావా! నిజం చెప్పు! నీలో రామ్ ప్రతిరూపం పెరగడం లేదూ! రేపు పుట్టబోయే నీ‌ బిడ్డ “అమ్మా! నా తండ్రి ఎవరూ?” అని అడినితే ఎవరని చెబుతావు. బిడ్డ తండ్రి ఎవరని చెబుతావు? సిగ్గుమాలినదానా! ఇప్పుడైనా నిజం చెప్పు!.. నీ తప్పుని దిద్దుకో! .. నిజం ఒప్పుకో!.. నిజం నిప్పులాంటిది!.. దాచాలన్నా దాగదు!..నిజం నిప్పులాంటిది!.. దాచాలన్నా దాగదు!..” అని అంతరాత్మ ఎదురుపడి, శోభనం గదిలోకి వెళుతున్న సీతను నిలదీస్తూండే సరికి పాలగ్లాసు వదిలేసి సీత మూర్చబోయింది.

సీతముఖం మీద నీళ్ళు చల్లి తట్టి లేపాడు రవి. కొంతసేపటికి తేరుకొన్న సీత కళ్ళు తెరిచింది. తాను తప్పు చేసిన సంగతి, తన పెద్దవాళ్ళు ఆ తప్పును కప్పిపుచ్చిన సంగతి సీత రవితో వివరంగా చెప్పేసింది!

రవి నిశ్చేష్ఠుడై చూస్తూ.. నిల్చుండిపోయాడు.

కొంతసేపటికి తేరుకున్న రవి “నువ్వేం కంగారు పడవద్దు డియర్! నాకు పిల్లలు కలిగే భాగ్యం ఎలాగూ లేదని డాక్టలందరూ తేల్చిచెప్పేశారు, ఆ విషయం మా తల్లిదండ్రులు దాచి నన్ను నీకు అంటగట్టారు” అని రవి కూడా నిజం చెప్పేయడంతో ఈసారి ఆశ్చర్యపోవడం సీతవంతయ్యింది.

“నరుడి బ్రతుకు నటన .. ఈశ్వరుని తలపు ఘటన.. దేవుడు తన తప్పును దిద్దుకోవడానికి మనిద్దరికీ పెళ్ళి చేసుంటాడు కాబోలు! నీకు పుట్టే బిడ్డ మన బిడ్దవుతుంది!” అని రవి సీతను దగ్గరకు తీసుకుంటుంటే, సీతముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

4 వ్యాఖ్యలు to “నరుడి బ్రతుకు నటన”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

కామెంట్ చెయ్యాలనిపించింది. ఏమి కామెంట్ చెయ్యాలో తెలియడం లేదు. ఐ మీన్ “ఈ కథ ద్వారా ఇదో తెలుసుకోవలసి వుంది .. అదేమిటో స్పష్టంగా తెలియడం లేదు ..”

ఏదైనా మనకు కనిపించించేది, అనిపించేది మనము వాటిని చూసే మరియు తీసుకొనే విధానము బట్టి ఉంటుంది. కాబట్టి, మీరు ఒక విషయాన్ని గ్రహించి వాటిని మీపరంగా అన్వయించుకొనే విధానము, మీ అలోచనా సరళి మరియు మీ యొక్క సంధార్భాన్ని బట్టి ఉంటుంది.

కధకి surprise ending ఇద్దామన్న ప్రయత్నం, బాగుంది. అయితే కధా వస్తువు అంత గొప్పది ఎంచుకోలేదు. మొదటి కధ అయ్యుంటె మంచి ప్రయత్నం కిందనే లెక్క.

దృష్టి పెట్టాల్సిన లోపాలు: కధనం సరిగా లేదు. ఒక్కోచోట first person లోనూ, మిగతా చోట్ల third person లోనూ సాగింది. ఇది చాలా పెద్ద పొరపాటు, మీ అంతట మీరే చూసుకునుండాలి. రెండోది, అచ్చు తప్పుల మీద దృష్టి పెట్టండి. కధాంశం అంత గొప్పగా లేకపోయినా, సరళమైన భాష, presentation ద్వారా కూడా ఆకట్టుకోవచ్చు.

మీ సూచనలు నాకు కనువిప్పు కలిగించినది. మీ సూచనలను నేను కచ్చితముగా పాటిస్తాను. ధన్యవాదములు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: