పట్టుదల ముఖ్యం

Posted on జూన్ 11, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , |


swami_vivekananda_portrait

ఓ సరస్సు ఒడ్డున కొంతమంది  విదేశీ యువకులు నిలబడి తమ చేతిలో ఉన్న తుపాకులతో నీటిమీద తేలుతున్న కోడిగుడ్డు డొల్లలను గురిచూసి కాల్చసాగారు. కాని వారి గురి తప్పుతోంది. ఆ దోవనే వెళుతున్న ఓ కాషాయ వస్త్రధారి అది గమనించి ఓ యువకుడి వద్ద నుండి తుపాకి తీసుకుని వరుసపెట్టి కోడిగుడ్డు డొల్లలను కాల్చాడు. ఆశ్చర్యం! ఒక్కటి కూడా గురి తప్పలేదు. అప్పుడు ఆ విదేశీ యువకులంతా కాషాయ వస్త్రధారితో  “షూటింగ్ లో మీకు  గొప్ప అనుభవం ఉండి ఉండాలి అవునా?”‌అనడిగారట. దాని కాయన నవ్వుతూ “లేదు! నాకు షూటింగ్ లో  అనుభవం లేదు. అసలు తుపాకీ చేతపట్టుకుంది ఇప్పుడే, ఇదే తొలిసారి. కానీ‌ మీకు నాకు ఒక్కటే తేడా. నేను తుపాకీ చేతపట్టగానే కాల్చగలను అని నాకు నేనే ధైర్యం చెప్పకున్నాను. గురి చూసేటప్పుడు సాధించాలి అనే పట్టుదలను నా చూపుడు వేలిలో ఉంచి, మనస్సును ఏకాగ్రతతో నా లక్ష్యం వైపు గురిచూసాను. నా సర్వశక్తులనూ దాని మీదే కేంద్రీకరించాను. అంతే! సాచించగలిగాను” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడట ఆయన. విదేశీ యువకులంతా తమకంత దృడనిశ్చయం లేనందుకు సిగ్గుపడుతూ అక్కడి నిండి వెళ్ళిపోయారట. ఇంతకూ ఆ కాషాయ వస్త్రధారి ఎవరో తెలుసా? స్వామి వివేకానంద.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “పట్టుదల ముఖ్యం”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

thats y we admire swami vivekananda and follow his footsteps..good post praveen thank you

అవును…నిజమే..
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
మంచి వ్యాసం …థాంక్యూ ప్రవీణ్.

మీరు చెప్పదలచుకున్నది బాగుంది కానీ ఉదాహరణ కాస్త అతిశయోక్తిగా ఉంది.

మీ అభిప్రాయం తెలియపరిచినందుకు ధన్యవాదములు. కానీ నేను ఇచ్చిన ఉదాహరణ అతిశయోక్తి కాదు. అది యదార్థముగా జరిగిన ఒక సంఘటన. కాని మీరు చెప్పిన విషయములను నా తదుపరి టపాలను ప్రచురించేముందు గుర్తుంచుకుంటాను.

మీ వ్యాసం బావుంది. వివేకానంద గురించి ఏం చెప్పినా ఇంతే ఆశ్చర్యంగా ఉంటుంది. మీలాగే వివేకానంద ని బాగా అభిమానించి, అక్కడితో వదిలిపెట్టకుండా కొన్ని ఫోలో ఐపోయే నా ఫ్రెండొకడున్నాడు.. క్రాంతి అని. వీలైతే పరిచయం చేసుకోండి.(kranthili2020 @ gmail)

thats y we admire swami vivekananda and follow his footsteps.. Disappoint people must read swamijis sayings then you sure regain the energy


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: