ఆకులో భోజనం ఎందుకుచేయాలి?

Posted on జూన్ 13, 2009. Filed under: ఆరోగ్యం, పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , |


అరటిఆకులో భోజనంభోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.

పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి. ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా అన్నిట్లోకి అరిటాకులో భోజనం చేయడం మిక్కిలి శ్రేష్టం. పచ్చటి అరిటాకులో వేడివేడి పదార్థాలను వేసుకొని తినడంవల్ల కఫవాతాలు(cold) తగ్గిపోతాయి. బలం చేకూరుతుంది.ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరానికి కాంతి వస్తుంది. ఆకలి పుడుతుంది. మోదుగ, మఱ్ఱి, రావి ఆకులను ఎండబెట్టి విస్తర్లను తయారుచేస్తారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు. పచ్చి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తిన్నడం శ్రేయస్కరం. పూర్వం భోజనానికి విస్తర్లు, నీళ్ళు తాగడానికి ఆకు దోనెలను ఉపయోగిస్తారు. అలాగే మోదుగ ఆకులతో‌కుట్టిన విస్తరిలో‌అన్నంతింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మర్రిచెట్టు విష్ణువు స్వరూపం. మర్రి ఆకులో అన్నంతింటే క్రిమిరోగ నివారణి, కళ్ళకు సంబంధించిన దోషాలు తొలిగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా అరటి, మోదుగ, మర్రి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే ప్రేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదంలో  చెప్పారు. కాలక్రమేణా ఈ అలవాట్లు మారిపోయాయి. చాలామందికి విస్తరిలో భోజనం చేయడం అపురూపమైంది. కాంక్రీట్ జంగిల్ గా పేరొందిన నగరాలలో కూడా పండుగలు, పర్వదినాలలో మార్కెట్లో అరటిఆకులు అమ్ముతున్నారు. వాటిని కొన్నుకొని ఆ రోజు వాటిలో భోజనం  చేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్నిప్రాంతల్లోని హోటళ్ళలో  ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

15 వ్యాఖ్యలు to “ఆకులో భోజనం ఎందుకుచేయాలి?”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు.. బాగుంది..
కొన్ని అక్షరదోషాలను నివారించగలిగితే మరింత బాగుంటుంది..

If those leaves are littered in dust bins, then dust bins generate foul smelling. Didn’t you notice foul smelling in surroundings of kalyana mantapams during marriage times.

మార్తాండగారు, ఏ వస్తువునైనా వాడిన తర్వాత వాటిని సరైన రీతిలో‌ dispose చేయాలి. భోజనం కోసం వాడే ఆకులు మన ప్రర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. చెత్తను సరైన విధముగా handling and disposing చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది కలగదని మీరు గుర్తించాలి.

అవునండీ! నేను నా పరిక్షల ముందు రోజు HARD-DISK మీద అన్నం తిన్నాను, పరిక్షలకు ఏమీ చదవకున్నా అన్నీ జ్ఞాపకమొచ్చాయి. నా కంపూటర్ లో ఉన్న డేటా అంతా నా మెదడులోకి ఇంకిపోయి ఉంటుందనుకుంటా.

గవేష్ గారు మీకు మంచి హాస్యచతురత ఉందని అనుకుంటాను. నాకు ఆకుల సంగతైతే తెలుసు, కాని hard disk మీద ప్రయోగాలు చేసే మీకే వాటి గురించి తెలవాలి.

ఆ ఫొటొ చూడగానే అర్జెంట్ గా అరటి ఆకులో వెంటనే భోజనం చేయాలనిపించింది.. ఆహా ఎంత కమ్మని సువాసన వస్తుంది … చాలా మంచి పోస్ట్

ఆకులు పడి వెయ్యడానికి సౌకర్యాలు ఎక్కడున్నాయి? Existing dust bins are not enough to litter existing garbage. How can they be capable to to bear banana leaves?

మార్తాండ గారు. మీ website చూసాను. మీరు మంచి అభ్యుదయ భావాలు కలిగిన వారుగా ఉన్నారు. చాలా సంతోషం. నేను ఒక మెరుగైన సమాజం కోరుకునేవాడిని. సమాజంలోని ప్రతీ వ్యక్తి తన హక్కులతో పాటు తన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలి. అందరూ కేవలం వారి స్వార్థాన్నే కాక, వారు నివసిస్తున్న సమాజం పట్ల అవగాహన కలిగి ఉండి, వారి విధిని సరిగ్గా నిర్వర్తించేలా ఉండాలి. అటువంటి సమాజం ఏర్పడితే ఈ చెత్త(garbage) సమస్య వంటివి అసలు ఉండవు.

మీ వివరణ ,ఫొటొ చాలా బాగున్నాయి

ప్రవీణ్ గారు,

చాల మంచి విషయం చెప్పారు ! ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ వల్ల, వేడి పదార్థాలతో కలిసి, మనకు ఎంతో మంచి చేస్తుంది.ఆకు కూరలు వండినప్పుడు కూడా, ఎక్కువ సేపు ఉడకటం వల్ల పోషకాలు కొంచెం నశిస్తాయి, అదే అరటి ఆకు కేవలం కొద్దిగానే వేడి అవుతుంది అన్నానికి, ఆ వేడికి లోపల ఉన్న క్లోరోఫిల్, వగైరాలు వచ్చి, మంచి చేస్తాయి. పైగా ఆ రుచే వేరు !

అరటి ఆకుల్లో మేము వారానికో రోజు భోజనం చేసేవాళ్ళం ! ఇంట్లో చెట్టు ఉండేది అప్పట్లో ! ఎంత కమ్మగా అనిపించేదో ఆ రోజు వంట !

మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో ! నేను ఉండే ప్రాంతం లో విరివి గా దొరకవు అరటి ఆకులు ! దొరికితే, వదిలే సమస్య లేదు ! పైగా, అరటి ఆకులు వాడటం వల్ల ఆ రోజు అంట్ల పని సగం తగ్గేది !

నాకు మాత్రం శాస్త్రీయంగా అనిపించలేదు!!:)

ఒక నెల రోజులు మీరు అరటి ఆకుల్లో భోజనం చేసి చూడండి. మీకు ప్రస్తుతానికి నమ్మకం కలగకుంటే “పానీపూరి 123” గారి comment చూడండి.

మీరు తమిళనాడు లో చూసినట్లైతే…అక్కడ చాలా చోట్ల అరటి ఆకులే వాడతారు….

ఇప్పుడు జనాభా పెరిగింది కదా, dust bins పెట్టి ఆకులు లిట్టర్ చేసిన జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో foul smelling తో ఎంత ఇబ్బందో ఆలోచించండి.

chaala baaga rasarandi.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: