భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?

Posted on జూన్ 14, 2009. Filed under: మన విజ్ఞానం | ట్యాగులు:, , , , , |


ఆర్యభట్టుమన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం.

సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో‌ వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో‌నిలచి ఉన్నది అని అర్థం.

ఆర్యభట్టు క్రీ..శ 476 ప్రాంతం వాడు. ఈయన భూగోలఃసర్వతో వృత్తః అని ఆర్యభట్టీయం అనే గ్రంధంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శోకంలో తెల్పేను. భూమి వృత్తాకారంలో‌అన్నివైపులా ఉన్నదని అర్థం. పంచ మహాభూతమయస్తారాగణపంజరే మహీ గోళః(13-1)

పంచసిధ్దాంతిక అనే గ్రంథంలో కీ..శ 505 సంవత్సరానికి చెందిన వరాహమిహురుడు “పంచభూతాత్మికమైన గుండ్రని భూమి, పంజమురలో వేలాడే  ఇనుప బంతిలాగా, ఖగోళంలో‌ఉన్నది” అని వ్రాసారు.

లీలావతి అడిగిన ప్రశ్నకు – భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు నీవు చూసేదంతా నిజం కాదు. భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు పెద్ద వృత్తం(circle) గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖ(straight line) లాగ కనిపిస్తున్నది. కాని అది నిజానికి వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.(లీలావతి అనే గ్రంథంలో‌ కలదు)

ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ నభూచ్ఛాయా” సూర్యుడిని చంద్రుడు కప్పినప్పుడు నీడా భూమి మీదకు సూర్యగ్రహణంగాను, చంద్రుడు భూమిని కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను కనిపిస్తుందని ఆర్యభట్టీయంలోని 37 శ్లోకంలో ఆర్యభట్టు వివరించాడు. భూమి తన కక్ష్యలో‌తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు అని ఆర్యభట్టు స్పష్టంగా వ్రాసారు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

26 వ్యాఖ్యలు to “భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

ఒప్పేసుకున్నాం. అంగీకరించేశాం. ఇప్పుడేం చేద్దాం?

ఏం చేయాలో రేపటి టపాలో చెప్తాను.

maa taatalu nEtulu taagaarani………..

chavakiran గారు, మీరు చెప్పిన “మా తాతలు నేతులు తాగారని…..” గురుంచి రేపు ఒక టపాను ప్రచురించబోతున్నను. దాన్ని చదివిన తర్వాత మీ అభిప్రాయమును తెలపండి.

I LIKE IT. NICE ONE . LOOKING FOR MORE ABOUT GALAXY EARTH ETC ETC..

కొపర్నికస్ ప్రభృతులు కనుక్కున్నది భూమి గుండ్రంగా ఉన్నదని కాదు; భూమి, ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని. మరొక విధంగా చెప్పాలంటే అప్పటివరకు చెలామణీలో ఉన్న భూకేంద్ర సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని స్థాపించేరు.

@ Rao Vemuri
http://en.wikipedia.org/wiki/Aryabhata#Heliocentrism
మీరు చెప్పిన విషయంలో కాస్త నిజం ఉండవచ్చు. కాని, నేను ఇక్కడ మన పుర్వీకులు ఐరోపా శాస్త్రవేతలకు ఏమాత్రం తీసిపోరని, ఇంకా చెప్పాలంటే వారికంటే మునపే చాలా విషయాలు కనుగొన్నారని చెప్పే ప్రయత్నం చేసాను. ఆర్యభట్టు కూడా heliocentric theoryను నమ్మాడని రుజువు పైన ఇచ్చిన లంకె లో కలదు. నా బ్లాగుపై మీరు చూపిన ఆశక్తికి కృతజ్ఞతలు.

[…] “భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు త…” అనే టైటిల్ తో సాయి ప్రవీణ్ వ్రాసిన పోస్ట్ చదివాను. గ్రహణం సమయంలో చంద్రుని మీద పడే భూమి నీడ ఆధారంగా కొందరు గ్రీక్ మరియు భారతీయ సైంటిస్టులు భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించిన మాట నిజమే కానీ అంత మాత్రానికే వాళ్ళకి సూర్య కేంద్రక సిద్ధాంతం (Heliocentric theory) తెలిసినంత గొప్పగా ఫీల్ అవ్వకూడదు. భూమి గుండ్రంగా ఉంటుందని ఆర్యభట్టు ఊహించాడు కానీ భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని అతనికి తెలియదు. భూమి గుండ్రంగా ఉంటుందనే చెపితే అప్పట్లో ఎవరూ విశ్వసించలేదు కూడా. హిందూ మత గ్రంథాలలో భూమి తాబేలు ఆకారంలో ఉంటుందని వ్రాసి ఉంది, బైబిల్ లో భూమి బల్లపు పరుపు ఆకారంలో ఉంటుందని వ్రాసి ఉంది. భూమి గుండ్రంగా ఉంటుందని అప్పటి వాళ్ళు విశ్వసిస్తే మత గ్రంథాలలో ఇలాంటి కథలు ఎలా వ్రాసారు? భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని మొట్ట మొదట నిరూపించింది నికోలాస్ కోపర్నికస్. కంటికి కనిపించే కొన్ని గ్రహాల కదలికల గ్రాఫ్ గీసి ఆ గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుతున్నాయని వాదించాడు. ఆ గ్రాఫ్ ని కొందరు చర్చి అధికారులకి చూపించాడు కానీ ఆ చర్చి అధికారులు అతని వాదనని అంగీకరించలేదు, ఇతర చర్చి అధికారులకి తెలిస్తే నీకు ప్రమాదం అంటూ బెదిరించారు కూడా. గెలీలియో టెలీస్కోప్ తో గ్రహాల కదలికలని పరిశీలించి గ్రహాలన్నీ సూర్యుని చుట్టే తిరుగుతున్నాయని స్పష్టం చేశాడు. అతనికి కూడా చర్చి అధికారుల నుంచి బెదిరింపులు వచ్చాయి. రోమన్ కాథొలిక్ చర్చ్ అధికారులు 1830లో సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాతే ఇతర క్రైస్తవ చర్చిలు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని అంగీకరించాయి. హిందువులలో ఇప్పుడు కూడా కొందరు ఆధునిక ఖగోళ శాస్త్రాన్ని అంగీకరించరు. మా ఇంటిలో గ్రహణం సమయంలో నేను తప్ప ఎవరూ భోజనం చెయ్యరు. మా కుటుంబ సభ్యులలో కూడా మూఢ విశ్వాసాలు ఇంకా ఉన్నాయి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని అప్పట్లో విశ్వసించకపోవడం అప్పటి పరిస్థితుల దృష్ట్యా విచిత్రం కాదు. […]

@ science.teluguwebmedia.net

ఆర్యభట్టుకు సూర్య కేంద్రక సిద్ధాంతం మీద అవగాహన ఉందని ఇక్కడ చూడగలరు. మన మత గ్రంథాలు, ముఖ్యముగా వేదములు మొదలగునవి కొన్ని వేల యుగముల మునపే ఉన్నవి. ఆర్యభట్టు వంటి శాస్త్రవేతలు, క్రొత్త విషయాలను కనుగొన్నప్పుడు మన ప్రభువులు, ప్రజలు, మత పెద్దలు, అందరూ వాటిని ఆహ్వానించారు. కాని, ఐరోపాలో దానికి భిన్నముగా జరిగినది. హిందువులలో కొందరు ఆధునిక ఖగోల శాస్త్రాలను అంగీకరించరని మీరు చెప్పినది, ముమ్మాటికి నిజం కాదు. గ్రహణాన్ని మన ఉత్త కంటితో చూడరాదని, శాస్త్రవేతలు సూచించిన పరికరాలతోనే చూడాలని చెప్పటం ఎందుకు. ఎందుకంటే గ్రహణ సమయంలో మనకు హాని కలిగే కిరణములు వెలువడతాయి. గ్రహణ సమయంలో గర్బిణులు బయటకు వస్తే, వారికి పుట్టిన పిల్లలు ఏదో ఒక లోపముతో పుట్టిన సందర్భాలు మీరు గమనించలేదా? మన పెద్దలు గ్రహణ సమయంలో భోజనము చేయకూడదు అని చెప్పుటకు కొన్ని కారణములు ఉండవచ్చు. మధ్యలో కొందరు, మన పూర్వీకులు సూచించిన పద్దతులను సరిగ్గా అర్థం చేసుకోక కొన్నింటిని తప్పుత్రోవ పట్టించారు. అయినంత మాత్రాన, అన్నింటిని మూఢ నమ్మకాలని చెప్పుట తగదు.

chaalaa bagaa vraasaaru

గ్రహణం మొర్రితో పిల్లలు పుట్టడానికీ, గ్రహణానికీ సంబంధం లేదని డాక్టర్లు చెప్పిన విషయం సాయి ప్రవీణ్ గారు గమనించినట్టు లేదు.

@ మార్తాండ

మార్తాడగారు, గ్రహణం మొర్రి గురుంచి కాస్త పక్కనపెడితే, మీకు రెండు రోజులుగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు నా బ్లాగులో మరియు ఇతర బ్లాగుల్లో వ్రాసిన వ్యాఖ్యలను గమనించిన తర్వాత, మీకు మన భారత వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం లేదని నాకు అనిపిస్తున్నది.

మీ site ను చూసాను. అందులో మన దేశంలోని వివిధ సమస్యలను ప్రస్తావించారు. సమస్యలను భూతద్దంతో చూడడం మాని, వాటి పరిష్కారం కొరకు వెతకండి. ఈ దేశానికి కావలసినది, సమస్యలను ఎత్తిచూపేవారు కాదు, సమస్యలను గుర్తించి వాటికి పరిష్కరించేవారు.

ఇవ్వన్ని నేను మీరు నాపై వ్యాఖ్యలు రాసారని చెప్పటంలేదు. నేను చెప్పిన విషయమును కాస్త సానుకూల దృక్పధంతో ఆలోచించండి. మీరు చెప్పిన గ్రహణం మొర్రి గురించి నేను తెలుసుకుంటాను.

It depends on which school; I think some schools did not agree. There are some papers in the site”Samskrit Knowledge Systems”. One paper:
http://www.columbia.edu/itc/mealac/pollock/sks/papers/minkowski_pandit.pdf

thanks for sharing your knowledge with us. You threw some light over this post. But, I am in need of information about medieval Indian astronomers. Can you help me with this one?

My impression is that some great mathematics was done by Indians. In the early days, it was in connection with specifications for riual platforms(sulvasutras) and later in connection with Astronomy and Astrology. The only book I recently browsed through is:
The Mathematics of Egypt, Mesopotamia, China, India, and Islam: A Sourcebook
Where Kim Plofker has a long article (over 100 pages) about Indian mathematics. She has recently published a long book on Indian mathematics which I have not read. The links are in my blog:
http://gaddeswarup.blogspot.com/2009/06/kim-plofkers-book-on-indian-mathematics.html
My impression is that even though Aryabhatta advocated heliocentric theory, it was not followed but Indians managed their often precise calculations with their mastery of certain areas of mathematics. It does not matter what the centre is ( after all, it only gives you a frame of reference) if you can handle complicated mathematics. My other impression is that Indians were more interested in Astology and hence in accurate calculations. Somehow observational aspects were weak though emphasized by Neelakantha Shastry. Many, including him were trying to reconcile Puranic accounts with Astronomy and may be that led to the problems. I have not really followed these accounts carefully. My main interest is why they have not been able to sustain their great mathematical traditions; Madhava did a number of things which Newton and Leibnitz rediscovered centuries later.

Sorry: I did not directly respond about references. Possibly, Paruchri Srinivas can provide some. I only read some papers in the site ‘Samsrit Knowledge systems’, some in Wikipedia , various math. sites, one by Bronkhorst and few more that I do not remember immediately.

Indeed I am very much thankful to you. There’s no point of you to feel sorry. Thanks for the support and to have a interest in my blog.

“సమస్యలను భూతద్దంతో చూడడం మాని, వాటి పరిష్కారం కొరకు వెతకండి. ఈ దేశానికి కావలసినది, సమస్యలను ఎత్తిచూపేవారు కాదు, సమస్యలను గుర్తించి వాటికి పరిష్కరించేవారు.”

బాగా చెప్పారు…!

chalaa maMchi vishayaalanu aMdiMchaaru.I kRshini paaThakulaku aMdiMchE mI niraMtara kRshi konasaagaalani,niraMtaramuu manasphuurtigaa kOrukuMTunnaanaMDI!

mii blog,vij~naana daayakamugaa unnadi.ennO amUlya vishayaalanu aMdistunnaaru.

మీ అమూల్యమైన అభిప్రాయమును తెలిపినందుకు చాలా ధన్యవాదములు. ఒక రచయిత/బ్లాగరి వ్రాసేది పాఠకుల కొరకే, వారి నుండి ఆదరణ లభించినంత కాలము నేను వ్రాస్తూనే వుంటాను.

భూమి గుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా అనే ప్రశ్న హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే ఈ భూమ్మీద జీవజాలం మనుగడ సాగించినంతకాలం కాలానుగుణంగా వాటిలో వచ్చే మార్పులను దృస్టిలో ఉంచుకొని ప్రకృతి సంబంధ ధర్మాలను కట్టుబాట్లద్వారా ఆచరించు నట్లు సమాజనిర్మాణం కొరకు పాటుబడిన మహానుభావులు (ప్రాచీనులు) చంద్రుణ్ణి పరమేశ్వరుని శిరస్సుపై అధిష్టించేయడం లో గల అంతరార్ధం శివలింగంపై ధారాపాత్ర ద్వారా పూర్వీకులు మనకిచ్చిన సందేశం అర్ధం చెసుకుంటే భూమి లింగ ఉపరితలాన్ని పోలి గుండ్రగా ఉందని దాని శక్తి సుస్థిరం గా ఉండునట్లు ధారాపాత్ర వలే చంద్రుడు అందించే శక్తి వల్ల మాత్రమేనని ఇంతవరకు సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యం

మీ సైట్ చాలా బాగుంది సార్


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: