భగవంతుడు భావప్రియుడు

Posted on జూలై 13, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , |


కృష్ణుని దివ్య చరణములు

సత్యభామ ఒకనాడు బంగారు తట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచి “ఇవి నా తోటలో పండిన పండ్లు. ఈ జాతి మరియెక్కడను లేదు” అని వాటిని గూర్చి గొప్పగా వర్ణించింది. కృష్ణుడొక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ‘ఇవి సారహీనముల’ని చప్పరించి పడవేసెను. ఇంతలో ‘గుబ్బి’ యను ఒక గొల్లపిల్ల దోసిటిలో  కొన్ని పండ్లు తెచ్చి, “స్వామీ! ఇవి అల్లోనేరేడు పండ్లు; స్వామివలె శ్యామసుందరములు; అందువలన నాకు మిక్కిలి ప్రియములు. దయతో గైకొని అనుగ్రహింపవలెను” అనుచు పాదముల మ్రోల వ్రాలినది. కృష్ణుడు వాటి రుచిని అడుగడుగున మెచ్చుకొనుచు అన్నియు తినివేసెను. నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములే విలువ కలవి, రుచియును కలవి. అయిననేమి?! ఆమె అహంభావము, స్వాతిశయము మూలమున భగవానుని దృష్టిలో అవి రసహీనములైనవి. నేరేడు పండ్లు ఫలజాతిలో చెప్పుకోదగినవి కావు. కాకపోయిననేమి?! ఆ గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “భగవంతుడు భావప్రియుడు”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

avunu svaami ki bhaavamegaani bhoutikamulu istamukaavu

hi
it is really good, applies to my life in someway.

thanks

తేజస్వి గారికి, నమస్కారములు.

మీ వ్యాసం చక్కగా వున్నది. ఇందులో చెప్పబడిన ” ప్రేమ, అమాయకత్వము, అణుకువ ” భగవంతుడికి ఎప్పుడూ వుంటాయి. వుండవలిసినది మనుషలకి. అవి వున్నప్పుడే మనుషులందరు మానవత్వంతో మసులుతారు.

భవదీయుడు,
మాధవరావు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: