నిన్ను నీవు తెలుసుకో!

Posted on జూలై 17, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , |


ఈనాడు లోకములో ‘నాకన్నీ తెలుసున’ని విఱ్ఱవీగే  వెఱ్ఱివ్యక్తులు ఎందరో ఉన్నారు. కాని, వారిలో ఒక్కరైనా ఆనందమునకు నోచుకోలేకపోతున్నారు. అన్నీ తెలిసిన వారైతే ఆనందమునకు ఎందుకు దూరము కావలెను? పరమానందయ్య  శిష్యులలో ఎన్నిసార్లు లెక్కించినా ఒక్కడు తక్కువగా ఉన్నాడనే కథను మనము వినే ఉంటాము. ఆ‌ఒకడు ఎవడంటే తనను తాను మరచినవాడే. మానవుడు తన నిజతత్త్వమును తాను గుర్తించక అన్నీ తెలుసుకొన్నవాడుగా తయారైతే ఫలితము లేదు. మొదట తనను తాను గుర్తించుకొనే ప్రయత్నము పూనుకోవలెను. దీనికే ఆధ్యాత్మిక మార్గమని పేరు. దేనిని మరచి పోవలెనో దానిని మరచినప్పుడే ఆనందము ప్రాప్తిస్తుంది. అంతవరకు ఈ ప్రకృతిలో ఎన్ని రకముల కర్తవ్య కర్మల నాచరించిననూ ఆనందము ప్రాప్తించదు. మనము మరచిపోవలసినదేమిటి? చేరవలసిననది దేనిని? ‘అసతో మా సద్గమయ’, ‘తమసో మా జ్యోతిర్గమయ’, ‘మృత్యోర్మా అమృతంగమయ’ అని ప్రాచీన ఋషులు ప్రార్థించినారు. ‘అసత్తు’ అయిన జగత్తును మరచిపోవలెను. ‘తమస్సు’ అయిన అహంభావమును వదలవలెను. బ్రహ్మతత్త్వమైన అమృతత్వమును చేరవలెను.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

10 వ్యాఖ్యలు to “నిన్ను నీవు తెలుసుకో!”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

Why are you so unhappy about others happiness my friend?

@ కె.మహేష్ కుమార్

మనము ఒక నలుగురు కొరకు ఏమైనా మంచిది చేస్తే, ఆ నలుగురు తిరిగి మనకు మేలు చేస్తారు. మనుషులు సంఘజీవులు. మనము ఉండే సంఘము సుఖ సంతోషాలతో ఉంటేనే, మనము కూడా సదా ఆనందంగా జీవించగలుగుతాం. I am not unhappy. I just want to be more happier than I am now. And for this sake, I bother about others happiness bro.

మంచి టాపిక్. అయితే ఇలాంటివి మరింత వివరంగా విశ్లేషించాలి. నాలుగైదు లైన్లలో వ్యక్తం కాదు. యాదృఛ్ఛికంగా ఇదే విధమైన భావాన్ని వ్యక్తం చేసే రోజు నండూరి వారి పద్యం ప్రచురితమైంది ఫణీంద్ర గారి బ్లాగులో…

http://dracharyaphaneendra.blogspot.com/2009/07/2009_17.html

చాలా అందమైన, అర్ధవంతమైన పద్యం

మీ సూచనను నేను స్వీకరిస్తున్నాను. మరింత విశ్లేషణ కొరకు ప్రయత్నిస్తున్నాను. మీరు అందించిన పద్యము చాలా బాగున్నది. ధన్యవాదములు.

@నిన్ను నీవు తెలుసుకో!

అంత ఈజీ కాదు.

హ హ!!! కాస్త కష్టమే. కాని, ప్రయత్నించడంలో తప్పులేదు. మనసుంటే మార్గముండును. ఎంతైనా, ఈ విషయాలను మన బాగు కొరకే చెప్పబడినవి. పాటిస్తే మనకే మంచిది.

నిన్ను నీవు తెలుసుకో!
ప్రయత్నం చెయ్యాలి

జవాబు .నిన్ను నీవు నిండా తెలుసుకున్నట్లైతే నీ స్వరూపమే పూర్తిగా మారి పోతుంది. నీలో జ్ఞాన తరంగాలు వెల్లివిరుస్తాయి. నీ మాటల్లో, చేతల్లో, భావంలోప్రయత్నం చెయ్యాలి చైతన్యం ఉరకలు వేస్తుంది. నీలో నిర్భయత్వం చోటు చేసుకుంటుందిమానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖముగా విన్నగాని అవగతము కావు. కావున, సత్ గురువును ఆశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము చేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గము

నీలో నీవు రమించినపుడే పరమానందం. నీ నిజస్ధితిని తెలుసుకొనకుండుటకు మించిన ఘోర పాపం మరొకటిలేదని శాస్త్రాలు సెలవిస్తున్నాయి. నిన్ను నీవెరింగిన నీవే నిజ దైవం. నీకు మొక్కోటి దేవతలమీద నమ్మకమున్నా, నీ మీద నీకు నమ్మకం లేనట్లైతే ముక్తి శూన్యం. అందులకే నేను దేహం కాదు, ఆత్మ స్వరూపాన్ననే భావనకు రావాలి. అప్పుడే సర్వం బట్టబయలు కాగలదు. సర్వం నీలో లయించిన అనుభూతి చిక్కుతుంది. చిక్కిన అనుభూతిని చక్కగా కాపాడుకొని చిన్మయ భావంలో జీవించాలి. ఇహమేవ! ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలోనే ముక్తి సాధనకు ప్రయత్నం చేద్దాం. ముక్తికాంతను వరిద్దాం. ఆనంతాత్మ సాగరంలో మునిగి తేలుగాం. జీవన్ముక్తుల మౌదాం.

your are right. ప్రయత్నం చెయ్యాలి.

ప్రపంచమునందు ఎన్నో తెలియని విషయములు ఉండును. వాటిని తెలుసుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖముగా విన్నగాని అవగతము కావు. కావున, సత్ గురువును ఆశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము చేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గమును ఎరిగి, ఇంద్రియ నిగ్రహము, మనస్సుపై జయము సంపాదించి ఆత్మసాక్షాత్కారము పొందగలడు. కనుక శ్రీఘ్రముగా పరమాత్మను చేరవలెనన్న సత్ గురువు యొక్క కృప ఎంతయో అవసరము.
ఆత్మజ్ఞానమునొందిన వ్యక్తికి ఈ సంసార విషయములపై ధ్యాసే ఉండదు. ఏమి తినుచున్నాడో, త్రాగు చున్నాడో, ఏ వస్త్రములు ధరించుచున్నాడో కూడా అతనికి తెలియదు. ఆ స్థితిలో అతడు ఒక ఉన్మత్తుడువలె, బాలుడి వలె చూచు వారికి కనిపించును. చిరిగిన వస్త్రములతో, మాసిన ఆకృతితో అతడు కనిపించవచ్చును. దానికి కారణము వానికి ఈ సంసార విషయములపై ఏ మాత్రము ఆసక్తి లేకపోవుట. అట్టివానికి మనసు నిశ్చలమై, వ్యవహార ప్రపంచములో మంచి చెడులకు అతీతుడై వ్యవహరించును. మనసు నిర్మలమై, యోగములో నిమగ్నమై, ఆత్మానందమును చెందుచుండును. అన్ని ఆనందముల కన్ననూ మిన్నగు ఆత్మానందము ననుభవించుచూ అతడు పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువగా ఉండును.
ప్రతి ఒక్కరు తమ తమ మనసులలో ఈ విధముగా ప్రశ్నించు కోవలెను. నేను ఎవడను?, ఎక్కడ నుంచి వచ్చినవాడను? ఈ జగములో నేను ఏమి చేయుచున్నాను? నాకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు, మిత్రులు, సేవకులు, గురువులు ఈ విధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు? వారితో నా ఆత్మకు సంబంధమేమి? ఆ బంధము ఎంత పురాతనమైనది? ఎంత కాలము నుంచి కలదు? ఇంకెంత కాలము ఉండును? ఈ తనువు తదనంతరము ఇంకను అట్టి బంధము ఉండునా? లేకున్న వారేమగుదురు? నేనేమగుదును? ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది? తిరిగి ఎచ్చటకు పోవును? నాయొక్క నిజస్వరూపమేది? ఈ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరుకును. ఆ సమాధానములతో ఆత్మతత్వము అవగతమగును. సంసారము ఒక కల వలె తోచును. మన బంధములన్ని ఒక మిధ్య అని జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్ధమగును. దాని వలన మనసులో అలిమిన మోహము నశించి, మమకారము, వ్యామోహము, వస్తు ప్రపంచముపై ఆశా పాశములు నశించి ప్రశాంత చిత్తము కలుగును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము.

ప్రతి ఒక్కరిలో పరమాత్మగలడు. అందుచేత సహనముతో, కోప తాపములు వీడి అందరినీ సమభావముతో, ప్రేమతో చూచుకొనవలెను. మనలను మనము ఎంత ప్రీతితో, ప్రేమతో, జాగ్రత్తతో చూచుకొందుమో, పరులను కూడా అదే భావముతో చూడ వలెను. పరమాత్ముడు సర్వవ్యాప్తి, అందరు జీవులు అతని రూపులే. ఈ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా ఇతరులును దూషింపడు, నిందింపడు. సమరస జ్ఞానము లేని మంద బుద్ధులే ఇతరులపై కోపతాపములు చూపుదురు. మనము ఎన్ని మంత్రములు పఠించగలము, ఎన్ని గంటలు పూజలు చేయగలము, ఎంతసేపు భగవంతుని గురించి ఉపన్యాసములు ఇవ్వగలము, యిత్యాదులు, ఈ సమరస భావమునకు కొలమానములు కావు. ఇతరులతో ఎంత ప్రేమ, దయ, సహనము చూపగలము, మనలో ఎంత మానవత్వమున్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు. భగవంతుడు సర్వ వ్యాప్తి, జడ, చైతన్య, వస్తు, జంతు పదార్ధములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. చిన్న చీమ నుంచి, పెద్ద ఏనుగు వరకు సమస్త జీవులయందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ, జల, వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. భగవంతుడు సూక్ష్మముగా జీవులలోను, ఊర్జముగా పంచభూతములలోను నిక్షిప్తుడై ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. అందరినీ ప్రేమతో, దయతో చూడవలెను. ద్వేష, విరోధ భావములను రూపు మాపి శాంతి, సహృదయము అలవరచు కోవలెను. శత్రువులైనను, పుత్రులైనను, బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించ వలెను. భేద భావము చూపుట కేవలము అజ్ఞానమే.

సర్వశాస్త్రసారము శ్రీమద్ భగవత్ గీతలో కలదు, అలాగే సర్వమంత్రసారము శ్రీ విష్ణు సహస్రనామములో కలదు. వీనిని పఠించు వారికి సర్వ మంత్రములు, సర్వ శాస్త్రములు పఠించిన ఫలము దొరుకును. వీటిని పఠించి, వాటిలో అర్ధము తెలుసుకొన్నచో విశ్వజ్ఞానమంతయు వారికి అవగతమైనట్లే. కేవలము పఠించుటయే కాదు, ఆ భావము మననము చేసుకొని, త్రికరణ శుద్ధిగా ఆచరించవలెను. మంచివారు, జ్ఞానులు, గురువులతో స్నేహము చేసి, వారి సాంగత్యముతో మనకున్న జ్ఞానము పెంచుకొనవలెను. బీదలు, అనాధల యెడల దయ, కరుణ కలిగి వారికి అన్న, ధన, విద్యా దానములొసగవలెను
ఇంద్రియ సుఖము, కామ వాంఛలు అనర్ధములకే దారి తీయును. వస్తు సుఖములు ఆశాశ్వితములగుటయే కాదు, వాని వలన అనేక అనర్ధములు, కష్టములు కలుగును. అజ్ఞాని అటువంటి దృశ్యపదార్దముల వెనుక పడి, అందే ఆనందము కలదని భ్రమించి, శాశ్వతమైన, పరిపూర్ణమైన, అపరిమితమైన పర సుఖములను మరచి నానా కష్టముల పాలగుచున్నాడు. మృత్యువు పచ్చగడ్డిలో పామువలె పొంచి ఉన్నది. అది ఏ క్షణములోనైనను శరీరమును కబళించును. కావున శరీర సుఖములపై మోహము వదిలి, భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో సాధన చేసి, పాపమును కడగి వేసి, ఆత్మానుభూతితో జీవితము సఫలము చేసుకొనవలెను.

మానవుడు తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొందవలెనో, ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు కలవు. అవి – యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును.
పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము, ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము. హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం. ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిదురించు చున్నా, క్రీడించు చున్నా మనసున హరి ధ్యానమును మరువకుడు.
భగవంతుడిని సేవించటానికి, తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలు, పద్ధతులున్నాయి. అందులొ ఒకటి “భక్తి” మార్గం. ఈ భక్తిని సాధన చేయటానికి తొమ్మిది పద్ధతులు పెద్దలు చెప్పారు. …


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: