కృషి చేస్తే….. ఏమిటట????

Posted on జూలై 29, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |


కృషి

“కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు…” ఇది ఎన్.టి.ఆర్ గారి ఒకానొక సినిమాలోని పాట యొక్క మొదటి చరణము.

ఈ రోజు  యదావిధిగా, java క్లాసు పూర్తయిన తర్వాత వేలూరు నుండి చిత్తూరుకు RTC బస్సులో తిరిగివస్తుండగా, conductor దగ్గర టికెట్ల వివరములు కలిగిన ఒక చిట్టాలో నాకు ఒక వాక్యము కనిపించింది. అదేమనగా “కృషి చేస్తే జీతమునకు, జీవితమునకు చేయూత”.

నిజమే!! కృషి చేస్తే పైన తెలపబడిన లాభాలు తప్పక కలుగుతాయి. కాని, నా ఆలోచనలు ఇంతటితో ఆగలేదు. నాకు మా పాఠశాల అధ్యాపకులు గుర్తుకు వచ్చారు. వారు నాకు చిన్ననాటి నుంచి చాలా విషయములు భోదించారు, నడత నేర్పారు, నా గుణమును స్వభావమును తీర్చిదిద్దారు, మంచి విలువలను అందించారు…… ఇంకా మరెన్నో.

పాఠశాలలో చదువుతున్న రోజులలో నాకు చిరకాలము గుర్తుకు ఉండిపోయో ఒక సంఘటన చోటుచేసుకుంది. అది నేను తొమ్మిదవ తరగతిలో, కోడైకనాలుకు విహారయాత్రకు వెళ్ళిన రోజులు. విహారయాత్ర రెండవ రోజున మా బృందము మధ్యాహ్నం భోజనానికి ఒక మాంసాహార హోటలులో దిగాము. నేను శాఖాహారి అయినందున నాకు అక్కడ భోజనం చేయటం కష్టతరమైంది. ఒక్క ముద్ద కూడా గొంతు దిగడంలేదు. నాకు తెలవకుండానే వేడివేడిగా కన్నీటి దారలు కారడం మొదలైంది. నాకు ఏమి చేయాలో పాలుపోక బయటకు వెళ్ళిపోయాను. నా తోటి విద్యార్థులంతా భోంచేసి మా యాత్ర బస్సులోనికి  ఎక్కిన తర్వాత, నేను భోజనం చేయలేదని గ్రహించిన మా social మేడము నన్ను హోటలు లోనికి బలవంతంగా తీసుకెళ్లింది. నేను చిన్నపటి నుంచి బయపడే science మేడము, ఇంకా chemistry మేడము నా ప్రక్కన కూర్చొని “మేము కూడా ప్రస్తుతము వ్రతములో ఉన్నాము. మేము కూడా మాంసాహారము తినరాదు. బాధపడవద్దు” అని నన్ను ఓదారుస్తూ, అమ్మలాగా  గోరుముద్దలు తినిపించారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే… వారు ఆనాడు కేవలం జీతం కోసమే పని చేసేవారై వుంటే నాతో ఆ విధంగా ప్రేమగా వ్యవహరించేవారా??!! ఒకవేళ, వారు జీతం కోసమే పనిచేస్తుండవచ్చు, కాని వారు వారి వృత్తిని ప్రేమించారు. వారు నాపై చూపిన వాత్సల్యము వారి జీతమునకు ఏ విధంగా దోహదపడిందో నాకు తెలియదు, కాని వారికి చిరకాలము కృతజ్ఞతా భావము కలిగిన ఒక విద్యార్థి(బిడ్ద)ను సంపాదించి పెట్టింది.

కొన్ని నెలలలో నేను కూడా ఒక సాఫ్టువేరు కంపెనీలో ఉద్యోగంలో చేరనున్నాను. నేను కూడా మా టీచర్ల వలే నా వృత్తి ప్రేమిస్తాను. బాగా కృషిచేసి నా జీతమునకు, జీవితమునకు చేయూత అందేవిధంగా నడచుకుంటాను. మరి, ఈ‌ వాక్యము చదినప్పుడు మీకు ఏమి స్పురించింది?????

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “కృషి చేస్తే….. ఏమిటట????”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

మంచి అనుభవాన్ని మాతో పంచుకున్నారు. సంతోషం.

>>నా వృత్తి ప్రేమిస్తాను
ఇది ముఖ్యం. ఏ కంపెనీలో చేరుతున్నారేంటి?
కష్టించి పని చేయండి…

నేను Infosysలో చేరనున్నాను. మీ సూచనను తప్పకుండా గుర్తుంచుకుంటాను.

i wish you all the best.

Thanks for Sharing your good experiences with others

ఉపాధ్యాయులు కేవలం విజ్ఞానాన్ని ఇవ్వటానికి కాదు, మార్గదర్శకులు కూడా కావాలి. కృషితో నాస్తి దుర్బిక్షం. సంతృప్తితో సామరస్యంగా సాగిన జీవితం సఫలం. pass on the torch to you next generation just like how you were given…


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: