జీవితం చాలా అందమైనది

Posted on జూలై 31, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |


ఈ రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యాను.ఆ సమయంలో నాకు ‘జీవితం చాలా అందమైనది’ అని అన్పించింది.

అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల  సమ్మేలనం:
ప్రాణంవెలకట్టలేనిది
భాందవ్యాలుమనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….

ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.

“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా   అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.

ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ‌ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

8 వ్యాఖ్యలు to “జీవితం చాలా అందమైనది”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

‘జీవితం చాలా అందమైనది’ – పోనీ అలాగే కానివ్వండి, మీ మాట కాదనడం ఎందుకు?

yes, you are right..This is the right thinking about life.

@ Sarath ‘Kaalam’ @ కొత్తపాళీ @ neeharika
ధన్యవాదములు.

saipraveen, I will go over your posts soon. Thank you so much for finding my blog and these posts on spirituality. Just read your comments, will respond in detail alter. Meanwhile please comment if you could on
జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు? at:
http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html

ముందుగా నా కామెంట్లకు స్పందించినందుకు ధన్యవాదములు. ఒక మంచి బ్లాగును చుడడమే ఒక అదృష్టం…. తప్పక నా అభిప్రాయమును తెలియచేస్తాను.

As time permits read my posts “కమనీయ కావ్యం, మనిషి జీవితం” at http://maruvam.blogspot.com/2009/05/blog-post_15.html and “నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది!” athttp://maruvam.blogspot.com/2009/03/blog-post_11.html
All about how fruitful and noble life could be about…

Nijama cheypparu. andam eppudu mana mansulloney undhi.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: