లక్ష్మీకృప కలగాలంటే…….

Posted on ఆగస్ట్ 4, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |


లక్ష్మీ మాత

లక్ష్మీదేవి ఏ ఇంటిని విడిచిపెడుతుందో, ఏ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మన పురాణాది వాంగ్మయం స్పష్టంగా పేర్కొంది. మంచి అలవాట్లు, సద్గుణాలు,సౌమనస్య వాతావరణం, శుచీ శుభ్రత, సదాచారం కలిగిన ఇంట అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో ఆ ఇంట సిరి తాండవిస్తుంది.

తల్లినీ, తండ్రినీ, గురువునీ అవమానించే  చోట లక్ష్మి నిలవదు. ఏ ఇంట అతిథికి భోజనం పెట్టరో, ఆ చోట సిరి నిలవదు. అబద్ధాలాడేవారు, ఏదీ ఎవరకీ ఈయక ‘లేద’నే వారు, శీలంలేనివారు- ఉన్న ఇంట సిరి ఉండదు. పరద్రవ్యాన్ని ఆశించేవారిని, అపహరించేవారిని శ్రీ మాత విడిచి పెడుతుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారినీ, విశ్వాస ఘాతకుల్నీ, కృతఘ్నుల్నీ, ఉత్సాహంలేని వారినీ, భయపడేవారినీ ఆ తల్లి దరిచేరదు. కలహాలు జరిగేచోట, చెడుమాటలు పలికేచోట, జూదాలాడేచోట, స్త్రీని బాధించేచోట, మనోబలంలేని చోట… ఐశ్వర్యం క్రమంగా తొలగుతుంది. సంధ్యా సమయాల్లో నిద్రపోయే వారినీ, పగలు నిద్రించేవారినీ, దానం చేయనివారినీ విష్ణుపత్ని విడిచిపెడుతుంది.

శుచులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, మనోవాక్కాయాల్లో పవిత్రత కలిగినవారు, ప్రియవాదులు, స్నేహశీలురు, శౌర్యవంతులు మొదలైన సత్వగుణ సంపన్నులను సిరి తల్లి వీడదు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

2 వ్యాఖ్యలు to “లక్ష్మీకృప కలగాలంటే…….”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం ………………

వీటన్నిటితో పాటు స్వయంకృషి అన్నది ముఖ్యం. ఇన్ని సద్గుణాలు వున్న చోట ఐశ్వర్యం కన్నా శాంతి సంతృప్తి తాండవిస్తాయి అవే మూల ధనం.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: