మృదు మధుర భాషణ

Posted on ఆగస్ట్ 5, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |


నాలుక

భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు. దానితో మనం రెండు పనులు చేసుకోవచ్చు. ఒకటి రుచి చూడడం. రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాము. తియ్యగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకమే మన వశమవుతుంది.

కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం. కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కోకిల చేసిన పుణ్యమేమి? కాకి చేసిన పాపమేమి? వాటి నోటి నుంచి వచ్చిన ధ్యనిలో ఆ భేదం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చెప్తారు. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు. కాని కొంత ఊరటగా మాట్లాడవచ్చు. దానివలన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.

మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మనకు అన్నీ సుఖాలను తెస్తుంది. చడ్దదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి.

ఒకప్పుడు ఒక రాజు మంచివస్తువులన్నిటికీ ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేకమంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువు పరీక్షగా చూస్తూ వస్తున్నాడు. హఠాతుగా ఒకచోట ఆగి ఆశ్చర్యంలతో చూచాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను కోసి ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటని అడిగాడు. ఆ వ్యక్తి “ప్రభూ! నాలుకను మించిన మంచి వస్తువు లేదు. నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు” అని చెప్పాడు. రాజు ఆనందించి నాలుకకు ప్రధమ బహుమతి ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత రాజు చెడ్డవస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. దానిలో అనేక చెడ్డ వస్తువులు ప్రదర్శించ బడ్డాయి. అందులో కూడా అంతకు ముందు బహుమతి పొందిన వ్యక్తి ఒక నాలుకకు కోసి ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యపడి ప్రశ్నిచాడు. ఆ వ్యక్తి “ప్రభూ! నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డదైతే అందరి కోపానికి గురు అవుతాము” అని చెప్పడు. రాజు ఆ నాలుకకు మళ్ళీ ప్రధమ బహుమతి ఇచ్చాడు.

నేను ఇదివరకే నా బ్లాగులో సందర్భానికి తగినట్లుగా మాట్లాటడం ఎలా అని టంగ్ ఫూ – మాటే పంచ్ లో తెలిపాను.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

2 వ్యాఖ్యలు to “మృదు మధుర భాషణ”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

చాలా మంచి మాట చెప్పారు. నరం లేని నాలుకను అదుపులో పెట్టుకోకపోతె వచ్చే కష్టాలు బోలేడు. ధన్యవాదాలు..

“పెదవి దాటితే పృథ్వి దాటుతుంది” అన్న నానుడి, “నోట్లో నువ్వు గింజ నానదు” అన్న వాడుక రెండూ మనం మాటని మితంగా వాడాలి, నాలుకకి అమితమైన నిగ్రహం నేర్పాలి అని సూచించటానికే.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: