జపనీయుల దేశభక్తి

Posted on ఆగస్ట్ 10, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:, , , , , , , , , , |


రెండవ ప్రపంచయుద్ధంలో అణుబాంబులను గుండెలపై వేయించుకొని ధ్వంసమైన జపాన్ పునఃనిర్మాణమంత్రం ‘దేశభక్తి’ అంటారు. జపాన్ దేశభక్తికి ఉదాహరణగా ఒక విషయం చెబుతారు. అక్కడ బుద్ధభగవానుడిని ఎవరైనా తిడితే‌ ఏం చేస్తావని అడిగితే వాళ్ళ తల నరికేస్తానంటారట. మరి బుద్ధుడు మీ దేశాన్ని తిడితే ఏం చేస్తారంటే ‘ఆ బుద్ధుడి తలే నరుకుతాం’ అంటారత. కానీ మనం ఎవరి తలలు నరకవలసిన అవసరం లేదు. అంతర్గత బలహీనతలను , అవలక్షణాలను నరికి, ఆత్మావలోకనంలో వికసించే విధానాలను విద్యలను మనకు అందించారు భారతావని మహనీయులు.

‘రియాల్టీషో’ చూడటంలో తలమునకలౌతున్న యువతరానికి, పాటల పోటీల్లో ఓడిపోయామని కన్నీరుమున్నీరవుతున్న అమోమయం పిల్లలకి, సిరియల్స్   632వ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న మహిళామణులకి, మొత్తం మన భారతీయులందరికి చైతన్యం అందిచాలని ఆ భగవంతుడిని వేడుకుందాం.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

6 వ్యాఖ్యలు to “జపనీయుల దేశభక్తి”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

అయ్యా! మీకు ఈ తప్పుడు సమాచారం ఎక్కడినుంచీ వచ్చిందో తెలీదు. జపాన్ లో బౌద్ధమతం అమలులోవున్నా, సాధారణ జపనీయుల జీవితాల్లో మతం పెద్ద పాత్రని పోషించదు. ఇక మీరు చెప్పిన religious fanaticism వారిలో మచ్చుకకి కూడా లేదు.

రెండవప్రపంచ యుద్ధం తరువాత జరిగిన పునర్నిర్మాణ దశలో ఉన్మాదభరిత దేశభక్తి (jingoism) వారికి చారిత్రాత్మక అవసరంగా వచ్చింది. ప్రస్తుతం అది చాలా వరకూ తగ్గిందనే చెప్పుకోవచ్చు. దేశప్రేమకూ ఉన్మాదానికీ తేడా గ్రహించండి బ్రదరూ!

@కత్తి మహేష్ గారు
మహేష్ గారు, ఆరాధ్య దైవాన్ని, వారి మతాన్ని ఎవరైనా తిడితే దాన్ని వారు ఎదుర్కోవటం religious fanaticism ఎలా అవుతుంది?

చక్కని విషయం రాసారు. న్యూస్ చానెల్లు చూస్తే మతి పోతోంది. తలా తోకా.. మతి లేని ప్రోగ్రాములు. ఆగస్టు పదిహేణుకే గుర్తుకొస్తుంది దేశభక్తి ఈ పనికిరాని చానెళ్ళకి. వీళ్ళ దెబ్బకి నేణు టివి చూడడం మానుకున్నా… దేశభక్తి అంటే ఏదో ఒక్క రోజు మాత్రమే చూపేది కాదు, నిరంతరం మన రక్తంలో ప్రవహించాలి.
“దేశమును ప్రేమించుమన్నా… మంచి యన్నది పెంచుమన్నా”

aamaatram desabhakti vumte manasthiti ilaavumdedikaadu .baagaacheppaaru.

మీ వేడుకోలు వినాలని కోరుకుంటూ….

క్షమించాలి. నేను భాషా పరిజ్ఞానం బాగా పెంచుకోవలసి వున్నది. మీరు చెప్పిన “మీ వేడుకోలు వినాలని కోరుకుంటూ….”అన్న వ్యాఖ్య యొక్క అర్థం గ్రహించలేకున్నా. కాస్త వివరముగా సెలవివ్వగలరా?!


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: