ఏ జో దేశ్ హై తేరా

Posted on ఆగస్ట్ 15, 2009. Filed under: దేశ భక్తి, సంగీతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |


ప్రపంచ నలుదిశలలో ఉన్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము గర్వించదగ్గరోజు. స్కూలు రోజులలోనైతే సైకిల్‌లకు, మా స్కూలు ఆటో మరియు  బస్సులకు జెండాలను కట్టేవారము. స్కూలులో ఒక అతిథి వచ్చి జెండాను ఆవిష్కరించి నాలుగు మంచి మాటలు చెప్పిన తర్వాత  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసేవారు. తర్వాత రాజ్యమంతా మాదే. ఆటపాటలు, నాటకాలు నిర్వహించేవారము. చివరన జనగణమన ఆలపించి సంబారాలకు అంతం పలికేవారము. ఇంటర్ లో ఆ అవకాశం దొరకలేదు. ఇంజనీరింగులో తిరిగి అటువంటి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంజనీరింగు కూడా అయిపోయింది. ఆ రోజులు మళ్లీ తిరిగివస్తే ఎంత బాగుండును.

అసలు విషయానికి వస్తే; నిన్న  ప్రయాణిస్తున్నప్పడు షారుక్ ఖాన్ హిందీలో నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని బాణీలు విన్నాను. ఏ.ఆర్.రెహమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆ సినిమాను పలుమార్లు చూసాను.చూసిన ప్రతీసారి ఒక మంచి అనుభూతి కలిగేది. అందులో ఒక్కొక్క పాట ఒక్కో ఆణిముత్యం. కాని ఈ రోజు ప్రత్యేకంగా చర్చించుకోవలసిన పాట ఒకటి ఉన్నది. అది “యే జో దేశ్ హై తేరా”. హిందీ బాగా అర్థమవుతుందన్న వారు ఆ పాట యొక్క చరణాలు ఇక్కడ చూడగలరు. కథా నాయకుడు అమెరికాలో 12 సంవత్సరాలు ఉండి, తిరిగి భారతదేశానికి తనిని చిన్నప్పుడు పెంచినావిడను చూడడానికి వస్తాడు. అమెరికాకు తిరిగి వెళ్లాక మన దేశంలో అతను గడిపిన క్షణాలు నెమరువేసుకుంటూనే ఉంటాడు. ఇక్కడి మనుషులు, అతని ప్రేయసి మరియు మన దేశ దుస్థితి చూసి చలించి, NASAలో తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదలి మన దేశం తిరిగి వచ్చేస్తాడు. అతడు చేసినదాన్ని నేను సమర్థిస్తున్నాను, మన దేశాన్ని మనము కాకుంటే మరెవరు కాపాడుకుంటారు?! మీరందరు ఈ సినిమా ఒకవేళ చూసివుండకపోతే తప్పక చూడవలసినదిగా నేను కోరుతున్నాను. నా నిన్నటి మరియు ఇవాల్టి టపాలను చూసి, నన్ను ప్రవాసాంధ్రులు మరియు ప్రవాసభారతీయుల వ్యతిరేకి అని దయచేసి అనుకోవద్దు.మరోమారు మీ అందరికి స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు. జై హింద్!!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

11 వ్యాఖ్యలు to “ఏ జో దేశ్ హై తేరా”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

స్వదేష్ చూసాను, చూసిన వెంటనే తెలిసినవారు అదిగో నీవంటి జీవి అని కూడా అన్నారు. త్వరలో వచ్చేస్తాననే నా ఆశ, నమ్మకం. జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరియసి – అని శ్రీరాముడే పలుకగా లేనిది, మానవ మాత్రురాలిని ఆ మాత్రం ప్రేమ వుండదా..

నేను సరిగ్గా ఇటువంటి స్పందన కొరకే ఎదురుచూసాను. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.

స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు. జై హింద్!!

స్వదేస్ చాలా మంచి సినిమా. మూడు సార్లు చూసాను. నా అల్ టైం ఫేవరెట్.
అసలు రెహమాన్ ఈ సినిమా కి అందించిన సంగీతం simply superb. అన్ని పాటలూ చాలా బావుంటాయి.
yeh taaraa voh tara ఐతే నాకు బాగా నచ్చిన పాట.

శరత్ గారు, స్వదేస్ సినిమాలో రెహమాన్ అందించిన సంగీతం నిజంగా అద్భుతం. నా బ్లాగును చూసి వ్యఖ్యానించినందుకు ధన్యవాదములు.

దురదృస్టమేమిటంటే ఇలాంటి సినిమాలు హిట్టవ్వవు.

అప్పారావు గారు, వాస్తవమైన మాట చెప్పారు. స్వదేస్ లాంటి సినిమా కోవలోకి చెందినదే హృతిక్ రోషన్ నటించిన “లక్ష్య” అనే సినిమా. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. మన ప్రజల అభిరుచిని గ్రహించడం నిజంగా కష్టతరం.

సాయిప్రవీణ్, లక్ష్య నేనూ చూసాను. ఇంకా మరి కొన్ని అటువంటి చలచిత్రాలు, రచనలు చదివాను. ఈ మాధ్యమాలు మనలో ఆలోచన కలగచేస్తాయి అవి ఆచరణగా మారటానికి పరిస్థితులు అంగీకరించాలి. సంకల్పం, సమ్యానుకూలత, ఇలా ఎన్నో. స్వత్రంత్ర పోరాటం మాదిరి ఇల్లు, వూరు వదిలి వచ్చేయలేము. అందువలన ఇది సమిష్టి నిర్ణయం వంటిది. కుటుంబ భాధ్యత నెరవేర్చలేని నాడు ఇతరత్రా లక్ష్యాలు నిష్ప్రయోజనం. నా వరకు విదేశం రావటానికి కారణాలు పెక్కు, వెనక్కి రావాలని ఆశ అంతే స్థిరం. చూద్దాం భావి ఏం దాచిందో నా కొరకు. నా ముందు వ్యాఖ్యలో ఈ పొడిగింపు సమయాభావం వలన వ్రాయలేకపోయాను.

ఉష గారు, నేను ప్రవాసీయులను బాధించాలని ఈ టపా వ్రాయలేదు. నా మిత్రుడొకడు శాశ్వతంగా ఆస్ట్రేలియాలోనే వుండిపోవాలని, తిరిగి ఇక్కడకు రాకూడదని, ఇక్కడ భవితలేదని వెళ్ళిపోయాడు. ఒకవేళ అటువంటి వారెవరైనా వుంటే వారి భావన తప్పని నిరూపించి, తిరిగి ఇక్కడకు రప్పించుకోవాలనే ఉద్దేశంతో‌ వ్రాశాను. ఒకవేళ విదేశాలలోనే వుంటూ మన దేశానికి సాధ్యమైంత తోడ్పాటు అందించేవారుంటే, వారు మన దేశానికి శాశ్వతంగా తిరిగిరావలసిన అవసరంలేదనే భావన నాది.

జన్మ భూమి – కర్మ భూమి వేరైనా ఈ దేశానికి మేమేమిచ్చాము అన్నది ఎవరమైనా వేసుకోవాల్సిన ప్రశ్న. Sure neither your post implied that nor my responses conveyed that. We are on same page, it’s a message oriented post and I do have in implementation. As per me whether I reside or not is immaterial. What am I contributing matters. All clear … 🙂


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: