మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి

Posted on ఆగస్ట్ 16, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |


మన్మోహనుడి దేశ స్వామి భక్తి:

నిన్న ప్రొద్దున, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రజలకు అందించే సందేశాన్ని చూడాలని దూరదర్శన్ ఛానల్ పెట్టాను. జెండా ఆవిష్కరణ మరియు పెరేడ్‌ను చూడలేకపోయాను, అయినా నేను చాలా ఆసక్తిగా ఎదురుచూచిన ప్రధాని సందేశ సమయానికి t.v. పెట్టానని ఆనందించా. చిన్నప్పుడు మా నాన్న మన్మోహన్ సింగ్ 90లలో విత్తమంత్రి గా పనిచేసిన రోజులలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చాలా కీలకమైనవి అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక  ప్రత్యేక అభిమానం ఏర్పడింది. కాని, నిన్నటి సందేశాన్ని విన్నాక ఆయన మీద నాకున్న అభిమానం నీవా నదిలో  కొట్టుకుపోయింది.

“నాకు మరల ఈ అవకాశాన్ని ఇచ్చిన భారత దేశ ప్రజలకు ధన్యవాదములు. గడిచిన సార్వభౌమిక ఎన్నికలలో ప్రజలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గాంధీ, ఇందిరమ్మ మరియు రాజీవ్ చూపిన బాటలో నడుస్తూ, వారి కలను నెరవేర్చడానికి కట్టుబడి వున్నా”మని ప్రధాని తన సందేశాన్ని మొదలుపెట్టారు. నాకైతే ఆయన మాటలలో దేశభక్తి కన్నా స్వామిభక్తి పాళ్లు ఎక్కువ కనిపించింది. నెహ్రూ కుటుంబం మన దేశానికి చేసిన మేలు కంటే, నష్టమే ఎక్కువ. తెల్లవాళ్ళు కూడా మనకు రైళ్ల రవాణా వ్యవస్థను అందించారు, కొన్ని పెద్ద పెద్ద డాం లను, బ్రిడ్జిలను నిర్మించారు. కాని, అవన్నీ వారి స్వార్థ నిమిత్తం చేసారు. అంతమాత్రాన వాళ్ళు మనకు మేలు చేసారని భావిస్తామా? అప్పుడు తెల్లదొరలైతే, ఇప్పుడు నల్లదొరలు దోచుకుంటున్నారు. స్వాతంత్ర్యయానికి ముందు-తర్వాత కు తేడా ఇదే. మన రాజకీయాలు ఒక కుంటుంబ వ్యాపారంగా, పెత్తందారీతనంగా తయారవడానికి బీజం వేసినది, పెంచి పోషించినది నెహ్రూ కుటుంబమే. నెహ్రూ కుటుంబీకుల పేర్లకు గాంధీ అనే తోక రావటమే ఒక ***** కథ.(ఇక్కడ నేను ‘*’లు వాడడానికి కారణం, అక్కడ సరైన పదం నాకు దొరక్కపోవడమే. మరే అర్థాలను స్పురింపచేయడానికి కాదు.)

ప్రధాని సందేశంలోని కొన్ని ముఖ్య అంశములు:
* అక్రమ సరకు నిల్వదారులను మరియు రవాణాదారులను వారించడం.
* ఎవ్వరూ ఆకలిని అనుభవించరు.
* స్వైన్ ఫ్లూ చూసి బయపడవలసిన పనిలేదు.
* ప్రతి భారతదేశ పౌరుడు సౌభాగ్యం మరియు భద్రతను అనుభవిస్తూ, గౌరవమైన జీవితాన్ని   గడపాలి.
* మనకు సరపడ్డ ఆహార నిల్వలు వున్నాయి. ధాన్యం, పప్పులు మరియు నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తాము.
* మురికి వాడల నిర్మూలన కొరకు రాజీవ్ ఆవాస్ యోజన.
* సోలార్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహించి ఊతమందించేందుకు, జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్.
* నక్సలిజానికి, తీవ్రవాదానికి చమరగీతం పలకటం.
* అణగారిన వర్గాలు, మైనారిటీల సంక్షేమం కొరకు ప్రత్యేక పథకాలు.
* అవినీతిని అంతమొందిచి, ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయటం.
* పన్నుదారుల సొమ్ము సరిగ్గా ఉపయోగపడేలా చూడటం.
* దేశ నిర్మాణమే ప్రధాన లక్ష్యం.
ఇంకా మరెన్నో…

ప్రధాని హామీలు ఇవ్వటం ఒక విశేషమైతే, అవి మన ప్రభుత్వం ఆచరణలో పెట్టలేని పనులు కావటం మరో విశేషం. అక్రమాలను ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ప్రోత్సహించే మన ప్రభుత్వ తీరు, విభజించి పాలించు అనే తెల్లవాళ్ళ సిద్ధాంతాన్ని పాటించడం, ప్రజలకు అతి ముఖ్యమైన విద్య-వైద్య-ఆహారాన్ని అందించడానికి కావలసిన చిత్త శుద్ధి లోపించడాన్ని మనము చవి చూస్తున్న తరుణంలో ప్రధాని దేశ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తారని, యువతను ఉత్సాహ పరుస్తారని నేను భావించాను. కాని అది జరగలేదు. ప్రధానికి దేశ భక్తి కన్నా, స్వామి భక్తే ఎక్కువని నిరూపించుకున్నారు. ఆయన హామిలను చూస్తుంటే నాకు ముందు నవ్వోచింది, తర్వాత బాధేసింది, చివరన ఆయన మీద అసహ్యం మొదలైంది.

ఉజ్వలమైన భారతదేశ నిర్మాణం కొరకు మనమందరము పూనుకోవాలి. అందుకు రాజకీయ ప్రక్షాలనే ప్రధాన మార్గం. పవిత్ర రాజకీయాలను బురద గుంటలుగా తయారు చేసిన వారిని ఏరిపారేయాలి. మన సత్తా ఎంటో చాటాలి. జై భారతమాత!! జై హింద్!!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

గాడ్సే గాంధీని బదులు నెహ్రూను చంపి ఉంటే, మనదేశం ఇప్పుడున్న స్థితికన్నా మెరుగ్గా ఉండేదేమో.

మీ వ్యాఖ్య చదివిన ఓ నిమిషానికి నేను కడుపుబ్బ నవ్వాను. మీరు చెప్పినట్లు ఒకవేళ జరిగివుంటే, మనము నిజంగా బాగుపడి వుంటామేమో!!

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉతికి ఆరేసారు.
Nice post.

ధన్యవాదములు. మీ సహకారం ఇలాగే కొనసాగిస్తే నేను ఇంకా బాగా వ్రాసే ప్రయత్నం చేస్తాను.

పాపం ఆయన మాత్రం ఏమి చెయ్యగలరు. కాంగ్రెస్సు వాళ్ళంతా మేడం గారి చెప్పుచేతల్లొనే గ ఉండేది.

బాగా రాసారు.

ఆయనకు నిజంగా దేశ భక్తి గనక ఉండివుంటే, ఈ దేశానికి ఏమైనా మంచి చేయాలని ఉన్నట్లైతే, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరో మార్గము కొరకు అన్వేషించవలసినది. ఇక్కడ మనకు Dr. JP లోక్ సత్తా పార్టీ పెట్టినట్టు, ఇంకేమైనా చేసివుండవచ్చును.

మీరు ఇలాగే నా బ్లాగును చూస్తూ, మీ విలువైన అభిప్రాయములు తెలపాలని ఆశిస్తున్నాను. నెనర్లు.

గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
“కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: