Archive for సెప్టెంబర్, 2009

నాస్తికవాదులారా! మీకో విజ్ఞప్తి

Posted on సెప్టెంబర్ 16, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

ప్రపంచాన్ని మనం చూసే కోణాన్నిబట్టే అది మనకు కనిపిస్తుంది. మనసు చంచలమైనది. రాగద్వేషాలకు నిలయం. అనుకూలతలను, వ్యతిరేకతలను సృష్టిస్తూ ఉంటుంది. సిద్ధాంతాలు చాలా ప్రమాదకరమైనవి. అవి అహంకారానికి ప్రతిరూపాలు. ‘నా సిద్ధాంతమే గొప్పది’ అనేవారు ఇతరుల మనోభావాలను గౌరవించలేరు, వ్యతిరేకతను సృష్టించుకుంటారు. అదే మానవ మేథస్సునందలి బలహీనత, పక్షపాతవైఖరి ఉన్నంతవరకు సత్యదర్శనం కాదు.

సైన్సు కేవలం ప్రాథమికమైనది, పరిమితమైనది. తెలుసుకొనడానికి అవసరమేకాని సాధనకు అవరోధమే. అందుకే Where Science ends there philosophy starts, where philosophy ends there religion starts, where religion ends there spirituality starts అన్నారు. సైన్సు మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే ఆత్మహత్యా సదృశమే. ఆధ్యాత్మికతకు సైన్సు జోడించకపోతే అసంపూర్ణం. రెండూ కలిస్తేనే పరిపూర్ణం.

భగవంతుని ఉనికిని విస్మరించి స్వశక్తిమీద ఆధారపడడం ముర్ఖత్వం, భగవంతునిమీదనే ఆధారపడి స్వశక్తిని మరచిపోవడం బానిసత్వం. రెండూ అసంపూర్ణాలు, ద్వందాలే. ముందు స్వశక్తి ఉంటే ఆ తదుపరి దైవశక్తి తోడవుతుంది, అదే సమగ్రం, సంపూర్ణం మరియు పరిపక్వతకు చిహ్నం. ఆస్తికవాదం లేకుండా నాస్తికవాదానికి తావేలేదు. ఆస్తికుని కన్నా నాస్తికుడే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుని వ్యతిరేకించడంలోనే ఆరాధన ఉందనే నగ్నసత్యాన్ని విస్మరిస్తున్నారు. ఊగిసలాడే ఆస్తికవాదికన్నా వ్యతిరేకించే నాస్తికవాదే భగవంతునికి త్వరగా దగ్గరవుతాడు. కష్టాలు రానంతవరకు భగవంతుని ఉనికి గుర్తుకురాదు, అవి మొదలైతే భగవంతునికొరకు అన్వేషణ ప్రారంభమవుతుంది.

మానవజన్మ లభించడం వరం. అందునా భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతం. ఈ పవిత్రభూమిలో జన్మించి సనాతన ఋషి సాంప్రదాయంలోనికి ప్రవేశించలేకపోవడం దురదృష్టకరం. ఎవరైతే ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించి, దానిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలుగుతారో వారు మనసును కరిగించుకొని, ఆత్మస్థితికి చేరి విశ్వవ్యాపితభావనలో జీవిస్తూ, “నేనే భగవంతుణ్ణి” అనే స్థాయికి చేరి సర్వత్రా భగవంతుణ్ణే దర్శించగలుగుతారు.

అదే మానవ జీవితపరమార్థమంటే. అందుకే నాస్తికవాదులకు విజ్ఞప్తి ఏమిటంటే ఆస్తికత్వంలోని మూఢనమ్మకాలను చాదస్తాలను తప్పక వ్యతిరేకించండి లేకుంటే సత్యదర్శనం కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని, భగవంతుని యొక్క ఉనికిని వ్యతిరేకించకండి. ఎందరో దశాబ్దాల తరబడి పరుధులలో ఉండి, చివరకు ఈ‌మార్గానికి చేరి పరిపూర్ణత్వం పొందారు. చేతులు కాలాక ఆకులుపట్టుకున్న చందాన వయసు మళ్ళినతరువాత ఈ‌ మార్గానికి చేరినా శరీరం మనసు సహకరించక అసంతృప్తితో‌ జీవితాన్ని ముగించవలసి వస్తుంది. పరివర్తన పశ్చాత్తాపానికి మించిన దైవత్వం లేదు, సత్యాన్ని వ్యతిరేకించడంలో ఆత్మవంచన ఉంటుంది, దానిని స్వీకరించడంలో గొప్పదనముంటుంది. ప్రపంచ పరిస్థితులు మారి ఆదర్శ ప్రపంచం ఏర్పడాలంటే మేథావివర్గంలో మార్పు రావలసిందే. ఎందుకంటే వారే ప్రపంచాన్ని శాసించగలిగేది. వారంతా రజ్యాంగపు పరిధిలో, చట్టం ముసుగులో ప్రపంచాన్ని పతనం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, శాస్త్రవేత్తలు, విద్యా-వ్యాపార-పారిశ్రామికవేత్తలు ద్వారానే‌ ప్రపంచం నడుస్తుంది. వీరి సంఖ్య తక్కువే కాని, వీరి ద్వారా ప్రమాదం ఎక్కువ. వీరు మాయలోపడి అహంకారం పెంచుకొని ఆధిపత్యపు పోరులో మానసిక ఒత్తిళ్ళను పెంచుకొని తాము పతనమై ప్రపంచాన్ని కూడా పతనం చేస్తున్నారు. అందుకే అందరూ సనాతన ఋషిసాంప్రదాయపు ఔన్నత్యాన్ని గుర్తించి, ప్రపంచ భవితకు బంగారు బాటవేయాలని మనసా వాచా కర్మణా ఆ భగవంతుని వేడుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 19 వ్యాఖ్యలు )

వై.యస్. రైతు బాంధవుడా?! బహుశా కావచ్చేమో

Posted on సెప్టెంబర్ 8, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

ysr

నేను ఇదివరకే నా బ్లాగులో వై.యస్. ఇక లేరు అని ఒక టపా వ్రాసి, అందులో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరాను. వై.యస్. ఎలాంటి వారు అనేదానిని ప్రక్కన బెడితే, ఒక ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రమాదం జరిగిందని నేను విచారించాను.

ఆయన చనిపోయినప్పుడు, మీడియా అంతా ఆయనను రైతు బాంధవుడని, పుడమి తల్లి కన్న రత్నమని చెప్పారు. ఒకవేళ మాహాత్ముడు కూడా ఇన్నాళ్లు బ్రతికి వుండి, వై.యస్. మరణించిన రోజే గనక గతించివుంటే, ఆయనకు వై.యస్.కు లభించిన ఆదరణ లభించకపోవచ్చని అనుకుంటాను.

రైతు పక్షపాతి, స్వర్ణాంధ్ర రూపకర్త, జల ధాత, ఆరోగ్య శ్రీ ప్రదాత అని పలువిధాలుగా మన మీడియా ఆయనను అందలాలకు ఎక్కించింది. వై.యస్. చనిపోయిన నాడు, నా మిత్రులు పలువురు దుఃఖంలో కూరుకుపోయారు. ఆయనను ఒక మాహాత్ముడని భావించారు.నాకది చాలా బాధ కలిగించింది. ఈ నేపథ్యంలో  నాలాగే ఆలోచించే కొందరు మిత్రులు నాకు ఈ క్రింది లంకె(link)లను నాకు అందించారు. వాటిలో వై.యస్. యొక్క నిజ జీవిత చరిత్ర, ఆయన ఈ స్థాయికి ఎదిగిన తీరు చాలా చక్కగా వివరించారు. సమయభావం చేత వాటిని తెనుగీకరించడం కుదరలేదు. ఈ మహనీయుడి దివ్య గాధను చదవండి, చదివించండి.

Democracy as mafia warfare

Andhra Pradesh: Beyond Media Images

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 5 వ్యాఖ్యలు )

దారము ఆధారము

Posted on సెప్టెంబర్ 4, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , |

పూల మాలలు/పూల దండలు

ఈనాటి సైంటిస్టులందరూ కేవలము సృష్టిని గురించి పరిశోదనలు సలుపుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు సృష్టికర్తను గురించి పరిశోదన చేస్తున్నారు. ఆధారాన్ని కాకుండా కేవలం అధేయాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం తెలివితక్కునే చెప్పాలి. హారమునకు ఆధారమైన దారమును కాకుండా హారమును మాత్రమే చూసేవారు చాలా మంది ఉంటారు. ఆధారమును చూసేవారు ఏ కొద్ది మందో ఉంటారు. దారము ఆధారము, పుష్పములు అధేయములు. ఈనాడు పుష్పము నిన్న మొగ్గ, కాని దారము నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే, దారము వలే ఆధారమై మార్పు చెందనటువంటిదే దైవత్వము. దీనినే ఉపనిషత్తులు సూత్రేన మణిగణా ఇవ అన్నవి. ఈ జగత్తనే పుష్పములలో సూత్రమనే బ్రహ్మచేరి ఉంటుంది. కనుక అందరూ కూడా మణులవంటి వారే. అందరిలో చేరిన దైవత్వమే ఇందులో దారము వంటింది.

మూలం : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాఖ్య విభూతి నుంచి.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

వై.యస్. ఇక లేరు

Posted on సెప్టెంబర్ 3, 2009. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , |

మన గౌ॥ ముఖ్యమంత్రి డా॥వై.యస్. రాజశేఖర రెడ్డి ఇక లేరు. ఆయన కాలమైపోయారు. ఒక దురదృష్ట సంఘటనలో ఆయన గతించారు. గతంలో ఎన్నడూ చేపట్టని రీతిలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను మన మధ్యకు తీసుకు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో, ఈ మరణ వార్త వెలువడడం చాలా బాధాకరం. 60 ఏళ్ల ఆయన ప్రస్థానం ఈ రోజుతో‌ ముగిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం.

ఈ దుర్ఘటన యొక్క పూర్తి వివరములు కొరకు నా మిత్రుడు గవేష్ నాకు అందించిన ఈ లంకెను మీరు చూడగలరు.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది

Posted on సెప్టెంబర్ 2, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

ఒకానొక తమిళ ఛానలును నేను వీక్షిస్తుండగా, ఒక కొరియర్ సర్వీసు ప్రకటన నన్ను ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఒక కంపెనీ యజమాని తన ఆంతరాంగిక సహాయకురాలతో(personal assistant) వివిధ ప్రదేశాలకు చేరవేయవలసిన కొరియర్‌ల గురించి చర్చిస్తూ వుంటాడు. అందులో చాలా కొరియర్‌లు  దూర ప్రదేశాలకు, విదేశాలకు చేరవేయవలసి వుంటుంది. కాని, ఒకటి మాత్రం ఏదో కుగ్రామంకు చేరవేయవలసి వుంటుంది. అప్పుడు ఆ యజమాని తన ఆ.స.(P.A.)తో ఈ కొరియర్ తన గమ్యం చేర్చటం కుదరదు కదా అని అంటే, దానికామె మనము వాడే కొరియర్ సర్వీసు ఎక్కడికైనా మన వస్తువులను చేరవేయగలదు సార్ అని చెప్తుంది.

అవును కదూ, ఇప్పుడు మన సాధించిన పురోగతి మరియు సమాచార విప్లవాల వలన, మనోళ్ళు ఎక్కడ ఉన్నా , వాళ్ల స్థితిగతులు చాలా సులువుగా తెలుసుకోగలుగుతున్నాము మరియు  వారితో‌ సంభాషించగలుగుతున్నాము. ఇంకా అంతర్జాలం(internet) పుణ్యామా అని క్రొత్త మిత్రులను సంపాదించుకోగలుగుతున్నాము. ఉన్న చోటనే దేశ, విదేశ వార్తలను తెలుసుకుంటున్నాము. ఏవైనా సంఘటనలు జరిగితే, దాన్ని చిటికలో అందరికి చేరవేయగలుగుతున్నాము. దీని ద్వారా ఈ ప్రపంచం రోజురోజుకు చాలా చిన్నదౌతూవస్తున్నది.

ఇది సంతోషించ దగ్గ పరిణామమే కదా!! కాని, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు, దగ్గరను దూరంచేసుకుంటున్నాము. ప్రస్తుత సమాజంలో మనిషి తన పరిసరాలను పట్టించుకోవటం లేదు. తన పొరుగువారి బాగోగులు చూడటంలేదు. పోని, కనీసం తన నివాస పరిసరాలలో ఎవరుంటున్నారన్నది కూడా తెలుసుకోలేకున్నాడు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. దూరము దగ్గరైతే మంచిదే. కాని, అందుకు దగ్గరను దూరము చేసుకోవటం ద్వారా మూల్యం చెల్లించటం ఎంత వరకు సమంజసం?!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...