దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది

Posted on సెప్టెంబర్ 2, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |


ఒకానొక తమిళ ఛానలును నేను వీక్షిస్తుండగా, ఒక కొరియర్ సర్వీసు ప్రకటన నన్ను ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఒక కంపెనీ యజమాని తన ఆంతరాంగిక సహాయకురాలతో(personal assistant) వివిధ ప్రదేశాలకు చేరవేయవలసిన కొరియర్‌ల గురించి చర్చిస్తూ వుంటాడు. అందులో చాలా కొరియర్‌లు  దూర ప్రదేశాలకు, విదేశాలకు చేరవేయవలసి వుంటుంది. కాని, ఒకటి మాత్రం ఏదో కుగ్రామంకు చేరవేయవలసి వుంటుంది. అప్పుడు ఆ యజమాని తన ఆ.స.(P.A.)తో ఈ కొరియర్ తన గమ్యం చేర్చటం కుదరదు కదా అని అంటే, దానికామె మనము వాడే కొరియర్ సర్వీసు ఎక్కడికైనా మన వస్తువులను చేరవేయగలదు సార్ అని చెప్తుంది.

అవును కదూ, ఇప్పుడు మన సాధించిన పురోగతి మరియు సమాచార విప్లవాల వలన, మనోళ్ళు ఎక్కడ ఉన్నా , వాళ్ల స్థితిగతులు చాలా సులువుగా తెలుసుకోగలుగుతున్నాము మరియు  వారితో‌ సంభాషించగలుగుతున్నాము. ఇంకా అంతర్జాలం(internet) పుణ్యామా అని క్రొత్త మిత్రులను సంపాదించుకోగలుగుతున్నాము. ఉన్న చోటనే దేశ, విదేశ వార్తలను తెలుసుకుంటున్నాము. ఏవైనా సంఘటనలు జరిగితే, దాన్ని చిటికలో అందరికి చేరవేయగలుగుతున్నాము. దీని ద్వారా ఈ ప్రపంచం రోజురోజుకు చాలా చిన్నదౌతూవస్తున్నది.

ఇది సంతోషించ దగ్గ పరిణామమే కదా!! కాని, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు, దగ్గరను దూరంచేసుకుంటున్నాము. ప్రస్తుత సమాజంలో మనిషి తన పరిసరాలను పట్టించుకోవటం లేదు. తన పొరుగువారి బాగోగులు చూడటంలేదు. పోని, కనీసం తన నివాస పరిసరాలలో ఎవరుంటున్నారన్నది కూడా తెలుసుకోలేకున్నాడు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. దూరము దగ్గరైతే మంచిదే. కాని, అందుకు దగ్గరను దూరము చేసుకోవటం ద్వారా మూల్యం చెల్లించటం ఎంత వరకు సమంజసం?!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

what you said is true. good observation

ధన్యవాదములు. మొన్న నా మిత్రుడొకడు ఊరెళ్ళుతుంటే, అతనిని నేను వెళ్ళి కలవలేకపోయాను. మరి అతనిని మరల ఎప్పుడు కలుస్తానో తెలియదు. నేను తప్పు చేసాననే భావన నుంచి వచ్చినదే ఈ‌ ఆలోచన.

నిజమే ప్రవీణ్ గారు. మన చుట్టూ జరుగుతున్నా పరిణామాలను అబ్సర్వ్ చేయకుండా గదిలో కూచోని వ్యాక్యానించడం అలవాటుగా మారి మనిషి ఒంటరి వాడవుతున్నాడు. లేని లోకాన్ని సృష్టించుకొని ఆత్మవంచనకు గురిఅగుతున్నాడు. చెంప చెల్లుమనిపిమ్చినందుకు ధన్యవాదాలు

అయ్యో! నేను మీ చెంప చెల్లుమనిపించలేదండి. నాకు నేనే ఒక మొట్టికాయ వేసుకున్నాక, ఈ టపా వ్రాసాను.

అవునండీ.. నాది అదే పరిస్థితి ;(

chala baga vrasaru sir…


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: