వై.యస్. రైతు బాంధవుడా?! బహుశా కావచ్చేమో

Posted on సెప్టెంబర్ 8, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , |


ysr

నేను ఇదివరకే నా బ్లాగులో వై.యస్. ఇక లేరు అని ఒక టపా వ్రాసి, అందులో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరాను. వై.యస్. ఎలాంటి వారు అనేదానిని ప్రక్కన బెడితే, ఒక ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రమాదం జరిగిందని నేను విచారించాను.

ఆయన చనిపోయినప్పుడు, మీడియా అంతా ఆయనను రైతు బాంధవుడని, పుడమి తల్లి కన్న రత్నమని చెప్పారు. ఒకవేళ మాహాత్ముడు కూడా ఇన్నాళ్లు బ్రతికి వుండి, వై.యస్. మరణించిన రోజే గనక గతించివుంటే, ఆయనకు వై.యస్.కు లభించిన ఆదరణ లభించకపోవచ్చని అనుకుంటాను.

రైతు పక్షపాతి, స్వర్ణాంధ్ర రూపకర్త, జల ధాత, ఆరోగ్య శ్రీ ప్రదాత అని పలువిధాలుగా మన మీడియా ఆయనను అందలాలకు ఎక్కించింది. వై.యస్. చనిపోయిన నాడు, నా మిత్రులు పలువురు దుఃఖంలో కూరుకుపోయారు. ఆయనను ఒక మాహాత్ముడని భావించారు.నాకది చాలా బాధ కలిగించింది. ఈ నేపథ్యంలో  నాలాగే ఆలోచించే కొందరు మిత్రులు నాకు ఈ క్రింది లంకె(link)లను నాకు అందించారు. వాటిలో వై.యస్. యొక్క నిజ జీవిత చరిత్ర, ఆయన ఈ స్థాయికి ఎదిగిన తీరు చాలా చక్కగా వివరించారు. సమయభావం చేత వాటిని తెనుగీకరించడం కుదరలేదు. ఈ మహనీయుడి దివ్య గాధను చదవండి, చదివించండి.

Democracy as mafia warfare

Andhra Pradesh: Beyond Media Images

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

5 వ్యాఖ్యలు to “వై.యస్. రైతు బాంధవుడా?! బహుశా కావచ్చేమో”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

dear friend, sorry to say about you may put your headding as question may it positve or negitive. after reading of your links ithink so you may be in negitive way. every man has so many good and bad’s. and one more thing else that articale raised in june 2004 from balagopal. can you take what is the present opnion of balagopal. gandhi also have many shades. but i canot compare and give position like gandhi to ysr. his greatest things are 1) jalayganam- you may knows how much of the waste land in ap and how much of public inwithout work. 2)fee reemberence _ chandrababu said that BA, Bcom etc are to be closed. now many poor persons can running their study with the help of this. arogysri is also best program rest of all are political like rice, pension. one more best scheme is 25paise interst scheme it tooks large chnage in rural. what ever it may be ysr had many dark shade in previous of padyatra. all of that cleaned by his programs. more to say about ysr . what ever it may be this is my opnion

మీరు పాదయాత్ర ముందు వై.యస్. కు ఎన్ని రంగులు వున్నా, అవి ఆయన తలపెట్టిన సంక్షేమ పథకాల వలన తొలిగి పవిత్రుడై పోయాడని అంటున్నారు. అంటే ఆయన చేసిన హత్యలు, దోపిడీలు, సంపాదించిన ఆస్తులు, చేజిచ్చుకున్న కాంట్రాక్టులు వాస్తవమే అని మీరు ఒప్పుకున్నట్లే కదా! ఇప్పుడు మాత్రం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల సంక్షేమం కొరకని అనుకుంటున్నారేమో? కాదు. అవి ఎలుకను పట్టుకోవడానికి మనం బోనులో వేసిని ఎర వంటిది. మన ప్రజలు అల్పసంతోషులు. మన రూపాయి తీసుకొని అందులో 1 పైసా మనకిచ్చి, 99 పైసలు కాజేస్తుంటే. మన సంక్షేమం కొరకు 1 పైసా ఇచ్చిన మాహాత్ముడని అందలానికి ఎక్కిస్తున్నాము. అతని దగ్గర ఇంకా మన సొమ్ము వుందని గ్రహించడంలేదు. అసలు ఈ‌ పథకాలన్ని వారి బంధుగణ సంక్షేమం కొరకే. ఇది ప్రజాస్వామ్య సమాజం కాబట్టి, వాళ్ల లాభం కొరకు తలపెట్టే కార్యక్రమాలలో మన సొమ్ము వాడుతున్నారు కాబట్టి మనకు ఎదో క్రొద్ది మేలు కలుగుతున్నది. అంతమాత్రాన ఆయన మనలను బాగుపరచడం లేదు. ఇంతకు ఆ పథకాలకు మన పన్ను డబ్బులు ఉపయోగిస్తున్నారు. ఆయన కొల్లగొట్టి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని ఉపయోగించడం లేదని, ఇంకా వీటి ద్వారా ఆయన ఖజానాకు ఇంకా సొమ్ము వచ్చి చేరుతున్నదని మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

అసలు గ్రూపులను కట్టి కాంగ్రస్ లో ఏకైక రాజుగా నిలచిన వై.యస్., 2004 న జరిగిన ఎన్నికలలో గెలుపొందటానికి వాడిన అస్త్రం ప్రజల అమాయకత్వం. దానికి సాయంగా ఆయన మీడియాను వాడుకున్నాడు. ఆయన పాదయాత్ర చేసినంత మాత్రన ప్రజల బాగుపడి పోలేదు. ఆ పాదయాత్ర అతని కుటుంబ వ్యాపారానికి ఒక పెట్టుబడి అని మీరు గ్రహించాలి.

ఎటువంటి వారికైనా దారుణమైన, దుర్భలమైన చావు రాకూడదని కోరుకునే వాడు భారతీయుడు. అందరిని ఆదరించి, అందరి సుఖాన్ని ఆకాంక్షించే వాడు భారతీయుడు. అందుకే నేను కూడా ఆయన చావుపై నా సానుభూతిని వ్యక్తం చేసాను. అంతమాత్రాన ఆయన చేసిన అరచాకాలను, ఆయన వలన ధన, మన ,ప్రాణాల పోగొట్టుకున్న వారిని మనం మరవకూడదు. మీడియా చేస్తున్న ఆర్భాటానికి లొంగిపోకూడదు. నిజమేమిటో గ్రహించాలి. మనం ఇంతకాలం మోసపోయినది చాలు. ఇక మీదట జాగురూకులుగా మెలిగి, మన భవితను, ఈ దేశ పురోగతికి తోడ్పటు అందించడానికి సిద్ధం కావాలి. జై హింద్.

our constitution gives us the right to express our opinion (to blog), may be they are stupid, biased, hatred, incredible or hoaxes

ముందుగా నా బ్లాగు పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. మీరు ఏమి చెప్పదలచారో, కాస్త విసదీకరించి చెప్పగలరని నా మనవి.

I agree with the author of this article.
Britishers who ruled India did good things also, they started railways, post offices, and built several dams, It does not mean that they served this country. They did all those things for their favor only, Now what YSR did (in fact lot of politicians) also same, how can we say they are ‘mahatmas’.
They are the people who invest money to get elected and they take twice may be more in return once they get into power.
They are making politics as business.
if you see the assembly discussions then you can realize how much they are interested in public issues.
For example take latest bills govt tried to pass, AP societies amendment bill, dalit christian reservation issue, Do you think they are in public interest??
One more foolish thing is pressurizing congress high command to make Jagan as CM.. Is cheif minister post is YSR property to give it to Jagan?? It is about state and its development issue. How come son can become CM if his father dies? what kind of theory is this?? this what democracy says??


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: