నాస్తికవాదులారా! మీకో విజ్ఞప్తి

Posted on సెప్టెంబర్ 16, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |


ప్రపంచాన్ని మనం చూసే కోణాన్నిబట్టే అది మనకు కనిపిస్తుంది. మనసు చంచలమైనది. రాగద్వేషాలకు నిలయం. అనుకూలతలను, వ్యతిరేకతలను సృష్టిస్తూ ఉంటుంది. సిద్ధాంతాలు చాలా ప్రమాదకరమైనవి. అవి అహంకారానికి ప్రతిరూపాలు. ‘నా సిద్ధాంతమే గొప్పది’ అనేవారు ఇతరుల మనోభావాలను గౌరవించలేరు, వ్యతిరేకతను సృష్టించుకుంటారు. అదే మానవ మేథస్సునందలి బలహీనత, పక్షపాతవైఖరి ఉన్నంతవరకు సత్యదర్శనం కాదు.

సైన్సు కేవలం ప్రాథమికమైనది, పరిమితమైనది. తెలుసుకొనడానికి అవసరమేకాని సాధనకు అవరోధమే. అందుకే Where Science ends there philosophy starts, where philosophy ends there religion starts, where religion ends there spirituality starts అన్నారు. సైన్సు మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే ఆత్మహత్యా సదృశమే. ఆధ్యాత్మికతకు సైన్సు జోడించకపోతే అసంపూర్ణం. రెండూ కలిస్తేనే పరిపూర్ణం.

భగవంతుని ఉనికిని విస్మరించి స్వశక్తిమీద ఆధారపడడం ముర్ఖత్వం, భగవంతునిమీదనే ఆధారపడి స్వశక్తిని మరచిపోవడం బానిసత్వం. రెండూ అసంపూర్ణాలు, ద్వందాలే. ముందు స్వశక్తి ఉంటే ఆ తదుపరి దైవశక్తి తోడవుతుంది, అదే సమగ్రం, సంపూర్ణం మరియు పరిపక్వతకు చిహ్నం. ఆస్తికవాదం లేకుండా నాస్తికవాదానికి తావేలేదు. ఆస్తికుని కన్నా నాస్తికుడే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుని వ్యతిరేకించడంలోనే ఆరాధన ఉందనే నగ్నసత్యాన్ని విస్మరిస్తున్నారు. ఊగిసలాడే ఆస్తికవాదికన్నా వ్యతిరేకించే నాస్తికవాదే భగవంతునికి త్వరగా దగ్గరవుతాడు. కష్టాలు రానంతవరకు భగవంతుని ఉనికి గుర్తుకురాదు, అవి మొదలైతే భగవంతునికొరకు అన్వేషణ ప్రారంభమవుతుంది.

మానవజన్మ లభించడం వరం. అందునా భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతం. ఈ పవిత్రభూమిలో జన్మించి సనాతన ఋషి సాంప్రదాయంలోనికి ప్రవేశించలేకపోవడం దురదృష్టకరం. ఎవరైతే ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించి, దానిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలుగుతారో వారు మనసును కరిగించుకొని, ఆత్మస్థితికి చేరి విశ్వవ్యాపితభావనలో జీవిస్తూ, “నేనే భగవంతుణ్ణి” అనే స్థాయికి చేరి సర్వత్రా భగవంతుణ్ణే దర్శించగలుగుతారు.

అదే మానవ జీవితపరమార్థమంటే. అందుకే నాస్తికవాదులకు విజ్ఞప్తి ఏమిటంటే ఆస్తికత్వంలోని మూఢనమ్మకాలను చాదస్తాలను తప్పక వ్యతిరేకించండి లేకుంటే సత్యదర్శనం కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని, భగవంతుని యొక్క ఉనికిని వ్యతిరేకించకండి. ఎందరో దశాబ్దాల తరబడి పరుధులలో ఉండి, చివరకు ఈ‌మార్గానికి చేరి పరిపూర్ణత్వం పొందారు. చేతులు కాలాక ఆకులుపట్టుకున్న చందాన వయసు మళ్ళినతరువాత ఈ‌ మార్గానికి చేరినా శరీరం మనసు సహకరించక అసంతృప్తితో‌ జీవితాన్ని ముగించవలసి వస్తుంది. పరివర్తన పశ్చాత్తాపానికి మించిన దైవత్వం లేదు, సత్యాన్ని వ్యతిరేకించడంలో ఆత్మవంచన ఉంటుంది, దానిని స్వీకరించడంలో గొప్పదనముంటుంది. ప్రపంచ పరిస్థితులు మారి ఆదర్శ ప్రపంచం ఏర్పడాలంటే మేథావివర్గంలో మార్పు రావలసిందే. ఎందుకంటే వారే ప్రపంచాన్ని శాసించగలిగేది. వారంతా రజ్యాంగపు పరిధిలో, చట్టం ముసుగులో ప్రపంచాన్ని పతనం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, శాస్త్రవేత్తలు, విద్యా-వ్యాపార-పారిశ్రామికవేత్తలు ద్వారానే‌ ప్రపంచం నడుస్తుంది. వీరి సంఖ్య తక్కువే కాని, వీరి ద్వారా ప్రమాదం ఎక్కువ. వీరు మాయలోపడి అహంకారం పెంచుకొని ఆధిపత్యపు పోరులో మానసిక ఒత్తిళ్ళను పెంచుకొని తాము పతనమై ప్రపంచాన్ని కూడా పతనం చేస్తున్నారు. అందుకే అందరూ సనాతన ఋషిసాంప్రదాయపు ఔన్నత్యాన్ని గుర్తించి, ప్రపంచ భవితకు బంగారు బాటవేయాలని మనసా వాచా కర్మణా ఆ భగవంతుని వేడుకుంటున్నాను.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

19 వ్యాఖ్యలు to “నాస్తికవాదులారా! మీకో విజ్ఞప్తి”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

కరెక్ట్ గా చెప్పారు.. కామెంట్ల పరంపర కు సిద్ధం గా వుండండి అల్ ది బెస్ట్

అరే బలే చెప్పారండి. ఇప్పుడు నాకు చాలా కామెంట్లు వచ్చాయి. సమయభావం వలన వాటిని approve చెయ్యలేకున్నాను. బయటి వూరిని వెళ్తున్నాను. వీటిని approve చెయ్యడానికి ఓ 11 రోజులు పట్టవచ్చు.

You can’t convince a believer of anything; for their belief is not based on evidence, it’s based on a deep-seated need to believe – Carl Sagan

A belief which leaves no place for doubt is not a belief; it is a superstition – José Bergamín

“నాస్తికవాదులకు విజ్ఞప్తి ఏమిటంటే ఆస్తికత్వంలోని మూఢనమ్మకాలను చాదస్తాలను తప్పక వ్యతిరేకించండి”
ఏది మూఢనమ్మకమో ఇరోజు decide చెయ్యలేముకదా. దీన్ని పాటించడం వల్ల ఎంతోకొంత చెడు జరుగుతుంది అని తెలిసిన వారు వ్యతిరేకిస్తే క్రమంగా దాన్ని ఇతరులుకూడా వ్యతిరేకిస్తూ “మూఢనమ్మకం” tag తగిలిస్తారు. కాబట్టి దుష్టాచారాలాను వ్యతిరేకిస్తూనే వుండాలి. శిష్టాచారాలను ప్రచారంచేస్తూనే వుండాలి.

“ఆస్తికుని కన్నా నాస్తికుడే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, భగవంతుని వ్యతిరేకించడంలోనే ఆరాధన ఉందనే నగ్నసత్యాన్ని విస్మరిస్తున్నారు. ఊగిసలాడే ఆస్తికవాదికన్నా వ్యతిరేకించే నాస్తికవాదే భగవంతునికి త్వరగా దగ్గరవుతాడు.”
నాస్తికత్వం జిందాబాద్!!!! 🙂

వేదకాలానికి వెనక్కుపోతూ “ప్రపంచ భవితకు బంగారు బాటవేయాలని మనసా వాచా కర్మణా ఆ భగవంతుని వేడుకుంటున్నాను” అనుకోవడం confusing గా అనిపించట్లేదూ?

“అందునా భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతం.”????
Please explain me why? (16 Marks)

“భగవంతుని ఉనికిని విస్మరించి స్వశక్తిమీద ఆధారపడడం ముర్ఖత్వం”???
కర్మ అంటే ఏమిటి? దాని విశిష్టాత ఏమిటి? (16 Marks)

భగవంతుడూ లేడు, గాడిద గుడ్డూ లేదు. ఒక మనిషి ఇంకొక మనిషి మీద, ఒక వర్గం ఇంకొక వర్గం మీద ఆధిపత్యం చలాయించడానికి ఉపయోగపడే ఒక దుర్మార్గపు జన హనన ఆయుధమే ఈ భగవంతుడు అనే ఈ అబద్ధపు భావన. అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని గాలికి వదిలి భగవంతుడు అనే చెక్క భజన లో మునిగిపోయే పనికిమాలిన జనాలు, ఆ దృష్టి మిగతా విషయాల మీద చూపిస్తే ఇల్లు, ఊరు , రాష్ట్రం, దేశం, ప్రపంచం, విశ్వం ఎప్పుడో బాగుపడతాయి ! ఒకర్ని ఒకరు చ౦పుకోడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాదు ఈ ఆస్తిక తత్త్వం.

@ నాస్థికుడు @ మహేష్ @ Cinderella
ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ప్రస్తుతం వేరే పనిమీద బయటకు వళ్లవలసి వస్తున్నది. మీకు సమాధానం నేను ఓ‌ 11 రోజుల తర్వాత ఇస్తాను. అంతవరకు అందరి వీక్షణానికి ఈ కామెంట్లను approve చేస్తున్నాను. నెనర్లు.

మంచి విషయం ముందుకు తెచ్చారు. అయితే ఎప్పటిలానే దీర్ఘంగా చర్చించక పోవటంతో మీరు రాసిన 20 లైన్ల టపాలో

“ఆధ్యాత్మికతకు సైన్సు జోడించకపోతే అసంపూర్ణం.
భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతం.
సనాతన ఋషి సాంప్రదాయంలోనికి ప్రవేశించలేకపోవడం దురదృష్టకరం.
భగవంతుని యొక్క ఉనికిని వ్యతిరేకించకండి.”

వంటి సత్యాలకు జస్టిఫికేషన్ లేక మీరు నమ్మిన సిధ్ధాంతాల రూపంలో మాత్రమే గోచరించాయి.

మునపటి వలే నాకు బ్లాగు నిర్వహించడానికి సమయం దొరకడం లేదు. అందుకే జస్టిఫికేషన్ జోలికి నేను వెళ్ళడం లేదు. నా భావాలతో‌ ఏకీభవించే వారు గనక జస్టిఫికేషన్ అందిస్తే, నాకు సాయ పడిన వారవుతారు. ఇంకా ఈ‌ భావజాలాన్ని ఆమోదించే వారవుతారు.

మీరు మరల మీ రథ చక్రాలను వెనక్కి తిప్పినట్టున్నారు. నాస్తిక వాదులే ఎక్కువ ఆలోచిస్తారన్నది నిజమే. సమాజం ముధనమ్మకాలనుమ్ది విముక్తి పొందడానికి ఆలోచించడంలో తప్పేముంది. వారు చేరేడి మీరు చేరేది ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. శాస్త్రీయ దృష్టి కోరవదేట్టు చేస్తుంది మతం. మానసిక ప్రశాంతత కొరకు మతం అవసరం లేదు. ఆ సాకుతో ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మఠాలు, గురువులు ఎలా దోపిడీ చేస్తున్నారో చూస్తున్నారుగా. కాస్తా హేతువాద దృష్టితో మరొకమారు ఆలోచించండి. మెజారిటీని మెప్పిమ్చేదిగా రాయడం వలన ప్రయోజనం లేదు.

వర్మ గారు, తప్పుడు వ్యక్తులు ఎక్కడ లేరు?! తప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వగైరా లేరా?! ఇటువంటి వారు ఉన్నంత మాత్రాన, ఆ ఇంజనీరు, డాక్టరు, లాయరు వృత్తి మొత్తాన్ని తప్పు పడతామా? మతం అనే‌ విషయంలో కూడా అదే జరుగుతున్నది. అయినా మతం శాస్తీయ దృకోణాన్ని సమర్థించదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? క్రైస్తవం, ఇస్లాం మరియు ఇతర మతాలలో ఎలాగో నాకు తెలియదు గాని, హిందూ మతం వరకు వస్తే, అసలు హిందూ అనేది ఒక మతం కాదు, అది ఒక సాంప్రదాయం మాత్రమే. హిందూ భూబాగంగా పేర్కొనే స్థలంలో నివసించే వరంతా హిందువులే. మన పూర్వీకులు శాస్త్రీయకంగా బాగా పురోగతి సాధించినవారే. సున్నా ఎవరు కనుగొన్నారు? surgery లను ఎవరు ముందుగా చేశారు? astronomy లో మన పూర్వీకుల కృషి మీకు తెలియనిది కాదని అనుకుంటాను.

Father of Modern Economics అని ఎవరో యూరోపా వాసిని మనం పేర్కొంటాము. కాని, వాస్తవానికి చానుక్యుడు వాటిని కనుగొన్నాడు. ఇప్పటి ఆఫ్గనిస్తాన్ ప్రదేశంలో ఒకానప్పుడు ఉన్న తక్షసిలా విశ్వ విద్యాలయములో ఆయన economics మీద రచించిన అనేక గ్రంథములు కలవు. తురకులు చేసిన ఒకానొకి దండయాత్రలో ఆ విశ్వవిద్యాలయాన్ని 14 రోజులు 24 గంటలు కాల్చారట. ఆ దాడి నుంచి క్రొన్ని గ్రంథములు మాత్రమే తప్పించుకోగలిగాయి. ఇప్పుడు మనము వేరే authors రచించినట్టు చదువుకుంటున్నాము. మరి వీటి ఉదాహరణతో మీరు “శాస్త్రీయ దృష్టి కోరవదేట్టు చేస్తుంది మతం” అని భావిస్తారా? మతం మనిషిని అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటకు తీసుకువచ్చి వెలుగు చూపించేదే గాని, అందకారం లోనికి నెట్టేది కాదు. కొందరి దుష్ట ప్రవర్తన వలన మొత్తం మతాన్ని దూషించడం సరి కాదు.

ఇదేదో వ్రతంలాగా ఉందే……..పదకొండురోజులు అని నిక్కచ్చిగా చెబుతున్నారు…….

హ!హ!‌అవునండి. వ్రతమే. పుట్టపర్తిలో‌ దసరా పండుగ రోజులలో జరిగే గ్రామ సేవలో పాల్గొనడానికి వెళ్ళాను.

@ భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతం:

ఇది కామెడీగా వుంది.

ఏమిటండి, ఈ కర్మ భూమిలో జన్మించడం అదృష్టంగా మీరు భావించడం లేదా?!

హింధూత్వం అంటే సరియైన జీవన విధానాన్ని ఆచరించే మార్గం ఈమార్గాలను అనుసరించి జీవిస్తున్న జనసమూహం అభిమతం హిదూమతం ఈ జీవన విధానాన్ని అవలంబించడానికి ఏర్పరచుకున్న నియమ నిబంధనలు యుగాల తరబడి ఆచరిస్తున్న ఈ భారతావని లో జన్మించడం ఎంతైనా అదృష్టం ఇక మూఢనమ్మకాల విషయానికొస్తే నమ్మకమనేది జీవితానికి పునాది ,ఈనమ్మకాలను కాదని సమాజంలొ త్వరితగతిన అడ్డదారుల్లో ఎదగాలని ఉచ్చస్తితిలో ఉండాలని కోరుకొనేవారికి నమ్మకాలు కట్టుబాట్లు ఆటంకాలు గాబట్టి మేము ఆధునిక భావాలు కలవారమని అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు

రవి గారు, మీరు సరిగ్గా చెప్పారండి. నెనర్లు.

మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు
* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: