Archive for అక్టోబర్, 2009

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 1వ భాగం

Posted on అక్టోబర్ 30, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, లోక జ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ  ప్రశ్న నా మదిలో చాల్రోజులుగా (వాస్తవానికి ఓ మూడు సంవత్సరాలుగా) మెదులుతూనే ఉన్నది. అప్పటి నుండి మైత్రి, మిత్రులు అనే అంశాలపైన పలు కోణాల్లో ఆలోచిస్తూ వచ్చాను. వాటిని క్రమబద్దీకరించే ప్రయత్నం చేశాను. ఈ అంశాన్ని ఒక టపాలో వ్రాయలేకున్నాను. అందుకే పలు భాగాలలో ప్రస్తావించాలని నిశ్చయించాను.

‘మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు?’ అనేది ఈ టపా యొక్క శీర్షిక. ఈ వైపు ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎదురైన మొదటి ప్రశ్న
అసలు ఎన్నుకోవడం ఏంటి? అసలు ఎన్నుకోని మరి స్నేహం చేస్తే, వారిని మిత్రులని అంటారా?
మనము అన్నీ విషయాలు, భావాలను అన్నీ వేళలా మన తల్లిదండ్రులతో/తోబుట్టువులు /రక్త సంబంధీకులు/బంధు గణాలతో పంచుకోలేము. కాని, ఎటువంటి విషయానైనా చాలా సునాయాసంగా ఒక మంచి మిత్రునితో పంచుకోగలము. ఇది జగమెరిగిన సత్యం. కొందరు ఈ వాదన తప్పు, మేము అన్నీ విషయాలను మా తల్లిదండులు/తోబుట్టువులు/రక్త సంబంధీకులు/బంధు గణాలతో పంచుకోగలము అని భావించవచ్చు. ఈ విధంగా భావించేవారికి, వారి భావాలను పంచుకునే సన్నిహితులకు గొప్ప స్నేహ బంధం లేకున్న పక్షాన, ఇది సాధ్యం కాదు. ఆ చోట వారి మధ్య కచ్చితంగా స్నేహం వుంటున్నది.
మనం స్నేహితులను ఏ విధంగా పొందుతాము? ఇరుగు పొరుగున వున్నవారు, ఒకే పాఠశాలలో/కక్షలో చదివినవారు, కుటుంబ సన్నిహితులు…. ఈ విధంగా పలు మార్గాలనుండి మనము స్నేహితులను పొందుతాము. కాని, మానసిక పరిపక్వత వచ్చిన నాటి నుంచి ఒక వ్యక్తి తన మిత్రులను తాను ఆలోచించి మరి ఎన్నుకుంటాడు. మరి, ఈ విధంగా చేయటం సరైనదేనా అని నేను ఎప్పుడూ చింతించేవాడిని. ఈ చింతన రజనీకాంత్ నటించిన కథానాయకుడు చిత్రం చూసినప్పటి నుంచి మరింత ముదిరి, నన్ను చాలా ఇబ్బంది పెట్టసాగింది.

బాల్యంలో మనకు పాఠశాలలో ఉన్న మిత్రులే అసలైన మిత్రులు
కథానాయకుడు చిత్రంలో రజనీకాంత్ పాఠశాల విద్యార్థులను ఉద్దేశిస్తూ , వారి పాఠశాలలోని తోటి విద్యార్థుల నుండే వారి మిత్రులను ఎన్నుకోమంటారు. ఎందుకంటే ఆ పసి ప్రాయంలో మనతో స్నేహం చేసే వారు మన నుంచి ఏమి ఆశించకుండా, మన నిజమైన స్నేహితులవుతారు. రేపు మనము ఏ స్థాయికి వెళ్ళినా, మన స్థాయిని చూడకుండా మనకు అండగా నిలచి, మన మంచి చెడులను చూసుకుంటారు. ఇక్కడ మీరు ఆ వీడియోను చూడవచ్చు. ఈ వీడియోలో రజనీకాంత్ పాఠశాలలో పిల్లలకు చెప్పిన మాటలను తప్పకుండా చూసిన తర్వాతనే, నేను ఇక మీదట ప్రస్తావించబోయో విషయాలను  చదవాలని నా మనవి.

నాకు కూడా కొందరు బాల్య మిత్రులు ఉన్నారు. వారు నిజంగా నాకు దేవుడు ఇచ్చిన వరం. వాళ్లు నా నిజమైన మిత్రులు. కాని, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టిన ఆలోచన – ” బాల్యంలో ఉన్న మిత్రులు కాకుండా, తర్వాతి కాలంలో మనకు దొరికే స్నేహితులు నిజమైన వారు కారా?” నాకు ఇంటర్ మరియు ఇంజనీరింగులో కొందరు నిజ స్నేహితులున్నారు. బహుశా వారిలో‌ చాలామందితో నేను ఎదో ఒకటి ఆశించే మొదట స్నేహం చేయటం ఆరంభించి వుండవచ్చు. కాని, తర్వాతి కాలంలో వారితో నేను నిజాయితీతోనే మెలుగుతున్నాను. వారితో నేను కష్ట సుఖాలను పంచుకున్నాను, అవసరమైన సమయాలలో ఒకరికొకరు సాయం అందించుకున్నాము కూడా.  మరి వారితో నాకున్న స్నేహబంధం నిజమైనది కాదా? వారు నా నిజమైన స్నేహితులు కారా?

ఈ‌ చింతన ఇంకా కొనసాగుతుంది.

 

మీరు మిత్రులను ఎలా ఎన్నుకుంటారు? 2వ భాగం

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...