మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు

Posted on నవంబర్ 9, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |


నా గడిచిన జీవిత కాలంలో, నేను డబ్బుతో ముడిపడివున్న ఎన్నో సంఘటనలను గమనించాను. వాస్తవానికి మనకు తెలిసో తెలియకో మన జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ‌ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని.

ఈ‌ సత్యం జీర్ణించుకోవటానికి కాస్త కష్టంగానే ఉన్నా, నిత్య జీవిత ఘటనలను నిశిధంగా పరిశీలిస్తే ఇది బాగా అర్థమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము.

మనిషి కొరకు డబ్బు కావాలి, అంతే కాని డబ్బు కోసం మనిషి కాదు.
ఈ ప్రస్తుత జగత్తులో‌ డబ్బు మనిషిని శాసిస్తున్నదనే సత్యమును బాగా అర్థం చేసుకున్నప్పుడే, మనము డబ్బును శాసించగలుగుతాము. అంటే, మనము ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించగలమని కాదు. డబ్బును కాకుండా, ఆనందాన్ని మన జీవిత లక్ష్యంగా చేసుకొనుటలో కృతార్తులవుతాము.మన జీవితం మీద పూర్తి అదుపు, మన చేతులలోకి వస్తుంది.

ఈ సత్యం తెలియనంత వరకు, మన పరిస్థితి మన జీవితములో మనము దేనికోసము వెతుకుతున్నామో తెలియకుండా, నిరంతరం వెతుకుతుండదం వంటిది. మన లక్ష్యం ఏమని తెలియకపోతే మనము దానిని ఎలా పొందగలము. మీరు అనవచ్చు, ‘లేదయ్యా! నాకు జీవిత లక్ష్యం/లక్ష్యాలు లేదని ఎందుకు అనుకుంటావు?’ అని. అవి ఇల్లు కట్టడమో, సమాజంలో హోదా/పదవులు పొందడమో, సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించడమో, ఆస్తిని సంపదను కూడగట్టటమో, సమాజ సేవ కుడా కావచ్చు. మరి ఈ లక్ష్యాలను సాధించాలని మనము ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకంటే, వాటిని సాధిస్తే సంతృప్తి, సంతోషాలు కలుగుతాయని.

అంటే మనము తెలిసి/తెలియక ఏమి చేసినా, ఎన్ని చేసినా అదంతా మన  సంతోషం కోసమే. ఇది గనక మనము బాగా గుర్తుకుంచుకున్న పక్షాన వాటికి కావలసిన డబ్బును సంపాదిస్తాము. కాని, దాదాపు అందరూ ఆ డబ్బును సంపాదించే ప్రక్రియలో డబ్బుకు దాసులు అవుతున్నాము. మన అసలైన లక్ష్యమును మరచి, డబ్బే మన లక్ష్యంగా చేసుకుంటున్నాము. ఇదే మనలను తప్పుడు దారులకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నది, నేరములు చేయడానికి ప్రేరేపిస్తున్నది, అపకీర్తి పాలుచేస్తున్నది, మనలను బలహీనులను చేస్తున్నది, మన విచక్షణా జ్ఞానాన్ని హరింపజేస్తున్నది, ఆకరకు మన జీవితంలో సంతోషాన్నే లేకుండా చేస్తున్నది.

డబ్బు బాగా సంపాదించినా, ఏదో వెలితి, అసంతృప్తికి కారణము కూడా ఇదే. అందుకే ఈ‌ సత్యాన్ని బాగా అవగతం చేసుకుని, మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ‌ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము. ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

9 వ్యాఖ్యలు to “మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

మంచి విషయం వ్రాసారు !!

@ వీరుభొట్ల వెంకట గణేష్ @ pani
ధన్యవాదములు.

ఇదే మరోవిధంగా చెప్పాలంటే
“బతకడం కోసం సంపాదించాలి కాని సంపాదించడం కోసం బతకకూడదు.”

సరిగ్గా చెప్పారు. నేను చెప్పదలచినది కూడా అదే. నెనర్లు.

nice topic.

మీ వ్యూను అర్ధం చేసుకుంటూ నా వ్యూతో రిలేట్ చేసుకోవడానికి రెండు మూడు సార్లు చదవలసిన పోస్ట్ ఇది .

thanks for sharing !

చాలా రోజుల తర్వాత మీరు నా బ్లాగును సందర్శించారు. నెనర్లు.

Ya … We should never work for money … It should work for us … T C …


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: