తండ్రి మనస్సు

Posted on నవంబర్ 24, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , |


మా నాన్నగారు వంశపార్యంపరంగా వస్తున్న మా చిల్లర అంగడి ( దీనినే కొన్ని చోట్ల కిరాణా కొట్టు అనో లేక శెట్టంగడి అనో లేక ఉత్తిగా కిరాణా అనో పిలుస్తుంటారు ) నిర్వహిస్తున్నారు. మా జీవనాధారం, ఊపిరి అంతా అదే. మాకు అన్నం పెట్టే దైవమది. నా ఇంజనీరింగు ఈ ఏడాదే పూర్తయ్యింది. నాకు ఉద్యోగవకాశం ఇచ్చిన సంస్థ వారు, వచ్చే నెల నన్ను ఉద్యగంలోకి తీసుకోనున్నారు. మరి ఈ కాలీ సమయాన్ని ఎలా తోసిబుచ్చాలని నేను అప్పట్లో ఆలోచించాను. కాని, ఆలోచించేలోపు సమయంతా దాదాపు గడిచిపోయింది. ఇన్ని రోజులు మా అమ్మమ్మ, నాన్నమ్మ, మేన మామ , బాబాయి ఇలా దాదాపు అందరి బంధువుల ఇళ్లకు వెళ్ళివచ్చాను. ఓ కంప్యూటరు కోర్సుకు కూడా వెళ్ళాను( కాలం వెళ్ళబుచ్చడానికే ఈ కోర్సు. ఏదో దంచేద్దామనో, చించేద్దామనో కాదు). ఈ బ్లాగును కూడా మొదలెటాను.

కార్తీక మాసంలో అంగట్లో వ్యాపారం చేయడానికి మా నాన్నకు, నా అవసరం వుంటున్నది. నేను లేకున్నా ఏదో విధంగా ఆ భగవంతుని కృపతో నెట్టుకు రాగలరు. నేను కూడా మా అంగట్లో అప్పుడప్పుడు వెళ్తూ మా నాన్నకు సాయం చేస్తుంటాను. అందులో నాకు ఏమి ఇబ్బంది కూడా లేదు. కాని, కొన్ని రోజులుగా మా నాన్న నా గురించి బాధపడుతున్నారని తెలిసింది. మా నాన్న ప్రోద్బలంతోనే నేను ఇంజనీరింగు చేశాను. మరి నేనిప్పుడు ఇంట్లోనే వున్నాను కదా, మా నాన్న పిలిచినా పిలవకున్నా అప్పుడప్పుడు మా అంగడికి వెళ్ళి పని చేస్తుంటాను. ఇంజనీరింగు చదవి, ఒక బహుళజాతి సంస్థలో త్వరలో ఉద్యోగంలో చేరునున్న తన కొడుకు ఈ విధంగా అంగట్లో పని చేస్తున్నా,పని చేయవద్దు అని కూడా అనలేకున్నాను అని మా అమ్మతో మా నాన్నగారు తన బాధను వ్యక్తపరిచారంటా.

ఈ విషయం తెలుసుకున్న మొదట్లో నాకు ఎలా ప్రవర్తించాలో  తెలియరాలేదు. మా అంగడి గిరాకిలలో(customers) కొందరితో మాకు మంచి స్నేహ బంధం ఏర్పడింది. అటువంటి గిరాకి ఐన  ఒకతని బాగా చదువుకున్న కొడుకు, తన కాలీ సమయాలలో వాళ్ల పొలంలో, పసువుల పెంపకంలో బాగా పని చేస్తాడని, ఓ మారు మా నాన్న చాలా గొప్పగా ఆ గిరాకి యొక్క కొడుకు గూర్చి చెప్పడం గుర్తు. మరి నాదగ్గర ఆ చదువుకున్న అబ్బాయి గురించి గొప్పగా పొగిడిన మా నాన్న, నా విషయం వచ్చేసరికి బాధపడడం నాకు సబుబని అనిపించలేదు. కాని ఏమి చేద్దాం, ఏ తండ్రైనా, తన పిల్లలు కష్ట పడడం సహించలేడు కదా?! అప్పుడప్పుడు కాస్త కష్టంగా తోచినా, మన పనులు మనము చేయడంలో తప్పులేదు గనక, నేను మా అంగట్లో పని చేస్తుంటాను. ఎంతైనా నేను ఈ రోజు అనుభవిస్తున్న సుఖాలకు కారణం మా అంగడే గనక, దాంట్లో పని చేయడం నాకు చాలా సంతోషమే. మన గతాన్ని మనం ఎన్నటికి మరవకూడదన్నది నేను నమ్ముతాను. మంచి మనసు కలిగిన తండ్రి నాకు వున్నందుకు ఆ భగవంతుడికి నా శత కోటి ప్రణామములు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “తండ్రి మనస్సు”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

బాగా రాశారు..మీరు పాజిటివ్ గా తీసుకోవట౦ బాగు౦ది.
మూలాలు మరువని వారు జీవిత౦ లో పైకి వస్తారు.
ఐ విష్ యు ఆల్ ది బెస్ట్..

మంచిపని చేస్తున్నారు.

తండ్రి మనసు అర్ధం చేసుకొని , జీవనోపాధినిచ్చే కొట్టుని దైవంగా భావిస్తున్న మీరు నిజంగా అభినందనీయులు !

నిజమే మన మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. అది ఎలాంటి వృత్తి అయినా సరే. నువ్వెంత స్థాయిలో ఉన్నాసరే…

@ సుభద్ర, విజయ మోహన్, పరిమళం, రవి చంద్ర
మీకందరికి నా నెనర్లు. మన గతాన్ని ఎన్నటికి మరవకూడదన్న విషయాన్ని మీరు గుర్తించడం నాకు చాలా సంతోషమేస్తున్నది.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: