దిగజారిన ప్రవర్తన

Posted on డిసెంబర్ 16, 2009. Filed under: తెలుగు, Uncategorized | ట్యాగులు:, , , , , , , , , , , , , , |


కాంగ్రెస్ హై కమాండ్ రాత్రికి రాత్రి తెలంగాణ అంశమై ఒక తీర్మానం చేయడం కొందరికి ఆగ్రహం తెప్పించింది. ఆ నిర్ణయాన్ని చిదంబరం వెలువరించారు. ఇక్కడ తప్పొప్పులు గూర్చి నేను చర్చించ దలచలేదు. కాని, నిరసనలను తెలిపాల్సిన విధమే బాగో లేదు. కొందరు తమిళులు తెలంగాణపై మాట్లాడారని, పొట్టి శ్రీ రాములు వారి నెల్లూరు జిల్లాలో కొందరు ఉద్యమకారులు, చెన్నై నగరానికి దాహార్తి తీర్చే తెలుగు గంగ నీటిని ఆపివేసారు. చెన్నై నగర వాసులు వీరికి ఏమి అపకారం తలపెట్టారని, వీళ్లు ఈ పని చేయాలి? మేము మాత్రం ఏమైనా తక్కువ తిన్నామా అనే భావంతో వారు ఈ రోజు ఆంధ్ర నుంచి వచ్చే వహనాలను త్రిప్పి పంపివేస్తున్నారు.

మన ఆర్.టీ.సీ బస్సులను తగలబెడితే ఏమి వస్తుండండి?! మనము నవ నాగరిక సమాజంలో వున్నామన్నది మరుస్తున్నామెందుకు? రేపు బస్సు యాజ్యమాన్యం నష్టాన్ని పూరించడానికి, బస్సు ధరలను పెంచితే, ఇబ్బంది పడేడి ప్రయాణించే మనమే కదా!! ఈ విషయాలు, దాడిచేస్తున్నప్పుడు  ఉద్యమకారుల(దుండగలు) మదిలో మెదలదా? మెదలకేమి కాదు. వారిలోని రాక్షసానందాన్ని తీర్చుకోవడానికి, వారు అన్నీ వాస్తవాలు తెలిసినా, ఆగ్రహావేశాలకు లోనై, ఆ తప్పుడు పనులు చేస్తున్నారు. ఉద్యమం పేరుతో, ఆంధ్ర ప్రజలు మానవతా విలువలను విస్మరిస్తున్నారు. మానవీయ దృష్టిని కోల్పోతున్నారు. కొత్త రాష్ట్రాల గొడవలో, వున్న రాష్ట్రాన్ని నరకప్రయం చేయడం ఏ విధంగా సమంజసం.

మసను, బుద్ధి రెండింటిని వీలైనంత మేరకు వాడి, క్రోదావేశాలకు లోనుకాకుండా, ఆలోచించి పరిష్కారం సాధించాలి. అంతే గాని పనులు మానివేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా కాదు. మన ప్రవర్తనను దిగజార్చుకొనే విధంగా కాదు.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

7 వ్యాఖ్యలు to “దిగజారిన ప్రవర్తన”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

నెల్లూరుకు నీళ్ళు ఆపితే మా కోలనీ కి వచ్చే నష్టం లేదు. సామాన్య ప్రజలకు ఇవ్వాళా ప్రత్యేక రాష్ట్రం కావాలి. నా మటుకు నేను బిసినెస్ లో బిసీ గా ఉండడం వల్ల బస్సులు తగలబెట్టడంకుదరడం లేదు

moorkhatvapu mania aavarimchi umdi janaanni

They r just trying to get noticed … I too condemn this type of anti-social activities …

కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

meeru asa padithe kudharadhu..andra lo kalipiveste mee malladi krishna rao ki nastam. otu bank debbathinadha..??? vamsi tailors gaa start chesina mee malladi , ee rooju kotlu sampadinchindhi vediga undadam valle kadha..?? mandhu meeda revenue potundhi kadha. akramarkudu mandhu smaggler vasireddy srinu emi pothadu…contrators majesti subbarao kudukulu , suryanaraya raju …vagaira …vagaira emiyi potharu.??vallu alochinchukini vaddu antunnaru…

vebkatbalu
యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది.మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా అడ్డుపడతారు అంటే ఎలా?ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.

అర్థవంతమైన, ఆర్థపూరితమైన మీ విశ్లేషణ బాగుంది. రాజకీయనాయకులు హత్యకు గురయ్యారనో, లేక వారికి సీటు రాలేదన్న అక్కసుతోనో వందలాది ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం ఫ్యాషన్ అయ్యింది. ఇప్పుడు విభజన పేరుతో ఇలా చేస్తున్నారు. దీని పట్ల సరైన చైతన్యం ప్రజలనుంచే రావాలి, తమను ఇబ్బందులకు గురిచేసే వారిని అడ్డుకోవాలి.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: