వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…

Posted on జనవరి 20, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |


ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని, వాటితో కొనసాగడం మంచిది. బాధ, ఒత్తిడి, చింత, ఆవేశం వంటి మనోస్థితుల వలన మనకు నష్టం వాటిల్లే ఆస్కారమున్నది. ఆ నష్టాన్ని ఆపగలగడం కాస్త కష్టతరం కావచ్చు. సాధారణంగా కొందరు పైన పేర్కొనబడిన మనోస్థితులను తట్టుకోవడానికి వ్యసనాలకు దగ్గరవుతుంటారు. ఈ వ్యసనాలు కాస్త విశ్రాంతి, ఓదార్పును కలగచేసినా మరో రకాలుగా నష్టం వాటిల్లజేస్తుంది

ఈ విధమైన నష్టాన్ని అరికట్టాలంటే వ్యసనాన్ని వీడి, వ్యాపకాన్ని అలవరచుకోవాలి. వేధనకు గురి చేసే మనోస్థితులను వెలియబుచ్చకుండా లోపలే వుంచేసుకున్నట్లైతే, అది మనలను దెబ్బతీస్తుంది. స్యయం కృషి చలన చిత్రములో ఒకానొక సన్నివేశములో కథానాయకుడు, తను కోపానికి గురైనప్పుడు, అతని కార్యాలయములోని ఒక గదిలోనికి వెళ్ళి, తలుపులు కట్టేసుకొని, ఒంటరిగా చెప్పులు తయారుచేస్తాడు. ఆ విధముగా తన కోపాన్ని ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో వెలియబుచ్చుతాడు. వేధనకు గురి కాకుండా తనను తాను కూడా కాపాడుకుంటాడు. చెప్పులు కుట్టడం అనే వ్యాపకంతో మనఃశాంతిని పొందాడు. ఇంకా ఒక జత చెప్పులు కుడా తయారయ్యాయి.

వ్యాపకం మరియు వ్యసనానికి తేడా ఏంటి? నా ప్రకారమైతే… క్రొన్ని కారణాల రీత్యా కలుగుతున్న వేధనలను దూరం కావించుకోడానికి, మనము క్రొన్ని అలవాట్లను అలవరచుకుంటాము. అలా పుట్టుకొవచ్చిన అలవాట్లకు మనము బానిసలమైతే అది వ్యసనం. అదే ఆ అలవాట్లు మనకు బానిసలలైతే దాన్ని వ్యాపకంగా పరిగణించవచ్చు.

అందుచేత మనకు కీడు తలపెటే వ్యసనానికి దూరంగా… మనకు మేలు తలపెటే వ్యాపకానికి దగ్గరగా వుండడం శ్రేయస్కరం.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

4 వ్యాఖ్యలు to “వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

so ikanunchi o s ku daggaragaa vuntaamu.mari meeru mee rachanaa vyaapakamutho ,mammulanu mee rachanalaku vyasanaparulugaa cheyyandi.

మహద్భాగ్యం…. నా వంతు ప్రయత్నం నేను కచ్చితంగా చేస్తానండి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను…

బాగుందండీ, కొత్త సం.లో పోజిటివ్ దృక్పథాన్ని పెంపొందించేటట్టు మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు…

నా ఆలోచనను చదివినందుకు గానూ…చదివి అర్థం చేసుకున్నందుకు గానూ.. మీకు నా నెనర్లు.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: