Archive for మే, 2011

limit దాటితే.. liver దెబ్బతింటుంది..

Posted on మే 31, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , , , , , , |

శ్రుతి మించడం ఎప్పటికి పనికి రాదని నేను చాలా బాగా గ్రహించాను. అతి సర్వత్రా వ్యర్జతే అని అన్నారు పెద్దలు. కొంత మంది చేసే కొన్ని చేష్టలు కాస్త రోజులకు అందరికి ఆమోదయోగ్యం కావచు. ఆ చేష్టలను అందరు ఆస్వాదించవచ్చు. కాని అవి శ్రుతి మించినప్పుడే ఇబ్బంది కలిగిస్తాయి.

మన చేష్టలు సాటి వారికి ఇబ్బందిగాను, నష్టాన్ని కలిగించే విధముగా వుండరాదు. శ్రుతి మించి ప్రవర్తించడం వలన, సాధు జీవులు కూడా బలంగా ఎదురుతిరగడం నేను గమనించాను. కళాశాలలో నాతో విద్య అభ్యసించిన విద్యార్థి ఒకతను, తన ముక్కు మీద వున్న వాత గురించి నాకు చెప్పాడు. అతను తన చిన్నప్పుడు, ఒక కుక్కను చాకే వాడు. ఆ కుక్క ఎంత మంచిదంటే,  అస్సలు మొరగదు, కాస్త కుడా కరవదు. ఒకానొక రోజు ఆ కుక్కను ఒక గదిలో తీసుకెళ్ళి, దాన్ని రెండు కాళ్ళను పట్టుకొని గిరుమ్మని బొంగరం వలె తిరిగాడు. అలా చేసాక, దాన్ని తన చెంతకు తీసుకొని మొహంలో మొహం పెట్టి ముద్దాడపోయాడు. అప్పుడు ఆ అమాయకపు కుక్క ఇతని ముక్కును గట్టిగా కరచి పారిపోయింది. ఇతను శ్రుతి మించడం వలన కుక్కా పోయె, మొహంలో గాటు మిగిలే.

ఆ అబ్బాయి కుక్కను పోగొట్టుకున్నాడు. కాని మన రోజువారి జీవితాలలో  కొందరు శ్రుతి మీరడం మరియు అతి చేయడం ద్వారా కొన్ని బంధాలను, బంధుత్వాలను పోగొట్టుకుంటున్నారు. కొందరికి అవి అర్థమవటము లేదు. అర్థమైన అవి ఎలా ఆపు చేయాలో వారికి తెలియటము లేదు.

మన చేష్టలు శ్రుతి మీరాయి అని ఎలా కనుగొనడం? శ్రుతి మించిన క్షణాన్ని గ్రహించడం పెద్ద కష్టమేమి కాదు. మన అంతర్వాణి మనలను హెచ్చరిస్తుంది. ఎదుటి వారి హావ భావలు కూడా వాటిని తెలుపుతాయి. తప్పు చేయడం సహజం. కాని ఆ తప్పును అంగీకరించిన వాడు మనిషి. ఆ తప్పును సరిదిద్దుకొనే వాడు మహర్షి. శ్రుతి మీరుతున్నాము లేక శ్రుతి మీరాము అని గ్రహించిన వెంటనే, అ చర్యను/చేష్టను అంతటితో ఆపు చేయడం ఉత్తమం, అందరికీ శ్రేయస్కరం.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

నిజం కావాలా ?!

Posted on మే 8, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , |

నిజాన్ని దాయటానికి, నిజం చెప్పకపోవటానికి గల వ్యత్యాస్యం కనుగొనడం నా తరమా? ‘నిజం’ – మన జీవితాలతో బాగా పెనవేసుకుపోయిన ఒక ముఖ్యమైన వస్తువు/విలువ. నిజం మాత్రమే పలకడం కొందరి వైనం; నిజాన్ని అస్సలు బయటపెట్టక పోవటం కొందరి నైజం.

‘ అతడు ‘ చిత్రములో కథానాయకుదు ఇలా అంటాడు.. ‘ నిజం చెప్పకపొవటం అబద్దం; అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. దీననుసారం, నిజం దాయటం ఎమని అనిపించుకుంటుంది. నానుండి నిజాన్ని దాచే ప్రయత్నం చేసారు, అసలు విషయాన్ని వక్రీకరించారు.  మెల్లగా అసలు విషయమేమిటో బయటపడసాగింది. ఇటువంటి పనిని సమర్థించుకోవడమే కాకుండా, నాతో కుడా ఈ నీచమైన (నా అనుసారం) పనికి ఒడిగట్టమని ఆదేశించారు కూడా.

కొన్నిమార్లు నిజం చెప్పకపోవటం మంచి చేస్తుందంటారు. ఇతరులకు అది మేలు చేస్తుంది అని అనుకున్నప్పుడు అబద్దమాడటంలో తప్పులేదని అంటారు. స్వలాభం కోసం అదే పని చేసేవారిని ఏమనాలి. ఎంత విచిత్రమైన పద్దతులు మనవి. సందర్భానుసారంగా విలువలను కూడా మార్చేస్తాం. ప్రాధమిక విలువలకే, వెలువలేకుండా పోతున్నది.

‘ నాకు నిజం కావాలి. నిజం మాత్రమే కావాలి ‘, అని ఆడగటం మూర్ఖత్వంగా భావింపబడుతున్న ఈ రోజులలో, అలా కోరేవారు చాలా తక్కువ, కోరినా వాటిని పొందిన వారు అతి తక్కువ. ఆ దేవుడే మనలను రక్షించు గాక.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...