Archive for జూన్, 2011

గర్వ భంగం

Posted on జూన్ 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , |

ఒక్క విజయం దరి చేరేసరికే విర్రవీగిపోవడం సబబు కాదు. ఈ నీతి ఎప్పుడో మన పెద్దలు చెప్పినను, దాన్ని పట్టించుకోకపోవడంతో, ఒకే రోజులో రెండు మార్లు మొట్టికాయలు వేయించుకొని మరీ తెలిసుకోవలసిన పరిస్థితి నాకు కలిగింది.

ఇది నా ఒక్కడి సమస్య మాత్రమే కాదనుకుంటాను. పలువురు ఒక విజయం దక్కగానే, కళ్లు నెత్తికి ఎక్కించేసుకొనేస్తుంటారు. మరి దాని వల్ల కలిగే ప్రయోజనాలలోకి తొంగి చూస్తే గనక, అక్కడ మనకు ఏమి కనిపించదు. ఎందుకంటే, దాని వల్ల క్షణికమైన ఆనందం కలిగినను, తర్వాత అన్నీ నష్టాలే చోటుచేసుకుంటాయి. విజయం వలన వినమ్రత అలవడాలే గాని, మనలో గర్వం చోటుచేసుకోరాదు.

కలి యుగంలో, మన తప్పులకు శిక్ష వెంటనే విధించబడుతాయని ఎవరో చెప్పారు. నా విషయంలో అది ముమ్మాటికీ నిజం. ఆట పూర్తి కాకుండానే, నేను అందరికన్నా ముందు వున్నానని ప్రగల్భాలు పలికాను, చివరికి వచ్చేసరికి అందరికన్నా వెనుకబడ్డాను. గర్వంతో నాకు నేనే గోతులు తవ్వుకొని అందులో పడ్డాను. గర్వ భంగం జరిగింది.

ఇలా జరగడం వలన నేను చింతించడం లేదు, సంతోష పడుతున్నను. ఒక పాఠం, గుణపాఠం నేర్చుకున్నాను. ఈ రోజు చేసిన తప్పు, ఇంకెప్పుడూ చెయ్యను. ఈ రోజైతే వుత్త మొట్టికాయలతో సరిపోయింది. ఈ గుణపాఠం గుర్తుకు వుంచుకోకుంటే, ముందు ముందు ఏ విధంగా గర్వ భంగం జరుగుతుందో వూహిస్తే దడ పుడుతోంది.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

వింత జీవితం

Posted on జూన్ 29, 2011. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , |

అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి… ఇది ఎప్పుడూ ఉన్నటువంటి తంతేగా?! మీరు అవునని అన్నా, కాదని అన్నా, ఇది అంతే. జీవితం ఒక వింత.

మన చిన్ని గుండెకు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. కాని అన్నీ నెరవేరవు కదా. అది తెలియక చాలా మంది పేక మేడలు కట్టేస్తుంటారు. ఆ మేడ కూలడం ఖాయమని తెలిసినను, ఆ ప్రయత్నం విరమించుకోరు. తీరా, అది కూలిన తర్వాత నిరుత్సాహ పడటం తప్పటంలేదు. ఇది ఒక ఛత్రము వంటిది. ఇటువంటి ఛత్రాలు కోకొల్లలు. ఇది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితముగా అందరికీ జరుగుతూనే ఉంటున్నది. ‘ఎలా’, ‘ఎందుకు’ అనే వివరాలలోకి నేను వెళ్ళుటకు సాహచించను. కొన్నింటిని అలా వదలివేయటం మంచిది.

అనుకోకుండా కొందరిని కలుసుకుంటుంటాం; కొన్ని క్రొత్త అలవాట్లు చేసుకుంటుంటాం. మన ఇష్టాలతో పనిలేకుండా, మన ఆశలతో పొంతనలేకుండా, పలు సంగతులు మన జీవితంలో జరిగిపోతుంటాయి. అసలు ఎందుకలా జరుతుందని ఆలోచిస్తే సమాధానాలు దొరకవనే అనుకుంటున్నను.

మానవ జీవితంలో ఇన్ని వింతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో తెలియటం లేదు. కాని సమాధానము కోసం దేశాటనం చేయటం, దట్టమైన అరణ్యాలలో వణ్య మృగముల మధ్య కూర్చొని ధ్యానం చేయటం, పెళ్లి చేసుకోకుండా భోగ భాగ్యాలకు దూరంగా వుంటూ సాధన చేయటం నాకు చేతకాని పని. నాకు తెలిసినదంతా ఒక్కటే.. ఈ జీవితం చాలా వింతది. ఆ వింత ఎందుకని ఆరా తీసేవాడిని ఈ లోకం వింతగా చూస్తుంది. మరి మీరేమంటారు?!

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

Liked it here?
Why not try sites on the blogroll...