మిస్టర్. అంతరాత్మ

Posted on జూన్ 24, 2012. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , |


నా తెలుగు బ్లాగుపై నాకు మక్కువ ఎక్కువ. ఈ బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో, వదలకుండా టపాలు ప్రచురించాలని తలచేవాడిని. కాని అలా జరగలేదు. అనుకున్నదొక్కటి, జరిగినదొక్కటి. అలా అని చింతిస్తూ కూర్చుంటే మటుకు ఏది జరగదు గనక, సరదాగా ఓ టపా వ్రాయాలని అనుకున్నాను. మంచి ఆలోచనే. కాని దేని గురించి వ్రాయాలి?నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. నా అంతరాత్మ నేను జరిపిన సంభాషణ గురించి వ్రాద్దామని నిశ్చయించుకున్నాను.

నేను సరాసరి ఐ.టి. ఉద్యోగిగా మారిపోయాను. అందులోనూ నేను ఎంతగానో ఎదురు చూసిన పదోన్నతి, జీతంలో హెచ్చు రెండింటినీ పొందలేదని కాస్త మనస్తాపానికి లోనయాక, ఏంటి నా జీవితం, నాకు ఏమి జరుగుతున్నది అని ఆలోచిస్తున్న ఒకానొక తరుణంలో, నా అంతరాత్మ నా ఎదుట ప్రత్యక్షమై ‘ ఒరేయ్. ఓ.యస్. గా .. తెగ ఫీలవకు.. ఏదో లోకంలో నీకొకడికే అన్నీ కష్టాలు వున్నటు. ఈ భవసాగరాన్ని నీవొకడివే ఒంటరింగా ఈదుతున్నట్టు, మిగిలినవాలందరు కష్టమంటే తెలియకుండా దర్జాగా కాళ్ల మీద కాలేసుకొని జీవిస్తున్నటు అనుకోకు… ఈ సినిమా కష్టాలు, నిజంగా అసలు కాష్టాలే కావు. ముందు లేచి నిలబడు. బాగా శ్వాస తీసుకో. రోజు త్వరగా నిదురలేచి, కాసంత కసరత్తు చేసి, మూడేళ్లలో నీవు చాలా శ్రద్దగా పెంచిన బొజ్జను తగ్గించు. మంచి సాహిత్యం చదువు. సంగీతాన్ని ఆస్వాదించు. వీలైతే సినిమాలు చూడడం తగ్గించు… బాగు పడతావు’ అని చెప్పింది.

‘అన్నయ్య’ చిత్రంలో చిరంజీవికి అతని అంతరాత్మ సూచనలు ఇచ్చినట్టు, నా అంతరాత్మ కూడా నాకు ఎంతో ప్రేమగా సూచనలు ఇస్తే నేను వాటిని పాటించకుండా వుంటానా చెప్పండి. మీకు కూడా మీ అంతరాత్మతో కలిసి మాట్లాడే అవకాశం దొరకాలని కోరుతున్నాను. మీ అంతరాత్మ కలిస్టే గనక, మీ ముచ్చట్ల విశేషాలు నాతో ఇక్కడ తప్పక పంచుకోండి.

ప్రకటనలు

Make a Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

6 వ్యాఖ్యలు to “మిస్టర్. అంతరాత్మ”

RSS Feed for తేజస్వి Comments RSS Feed

antha baagane undhi kani, ‘వీలైతే సినిమాలు చూడడం తగ్గించు… బాగు పడతావు’ ane vaakya sarainadhi kadhu ani na bhavana. kudhirithe naa ee vakyanni ne antharaatma ku theliyacheyi.

సినిమాలు చూడడం తగ్గిస్తే బాగుపడడం నాకు మాత్రమే వర్తిస్తుందని నా భావన. ఏదైనా మోతాదు మించితే మంచిది కాదు కదా.. నా విషయంలో సినిమా మోతాదు మించి చూస్తాను.. అందుకే తగ్గించాలని అనుకుంటున్నా..

Great post buddy. 🙂 Telugulo vrayatam ela ane oka tapa pettu. Na laanti agnanulaku upayogapaduthundi. 🙂

కచ్చితంగా మిత్రమా.. కానీ, నువ్వు అజ్ణాని మాత్రం కాదు…

etlaano blogs chadavaku, raayaku analedu kada, nice, keep writing.

🙂 అలా ఎందుకు చెప్తాను చెప్పండి. బ్లాగు లోకానికి చాలా రోజులుగా దూరమయ్యానని బాధ పడ్డావాడిని మరి నేను.


Where's The Comment Form?

Liked it here?
Why not try sites on the blogroll...

%d bloggers like this: