ఆరోగ్యం

విజయానికి తొందరపనికిరాదు

Posted on జూన్ 18, 2009. Filed under: ఆరోగ్యం | ట్యాగులు:, , , |

విజయంఅనేకులు తొందరగా విజయాన్ని  సాధించాలనే ఉద్దేశ్యంతో విపరీతమైన మానసిక వత్తిడికి లోనవుతుంటారు. విజయాన్ని సాధించడానికి మెదడులోని కణాలు తమలో తాము సంప్రదించుకొని అనుకూలమైన రసాయనాలను ఉత్పత్తి చేయాలి. ఆలోచనల నాణ్యతను బట్టి మెదడులోని కణాల స్పందన వుంటుంది. ఆలోచనలు మెదడులోని కణాలను కంపింపచేసి వాటిలో నిక్షిప్తమైన సమాచారాన్ని బహిర్గతం చేయ్యడానికి తోడ్పడుతాయి. సవ్యంగా ఆలోహించుతున్నప్పుడు విజయానికి తోడ్పడే రసాయనాలు ఉత్పత్తవుతాయి. ఆపనసవ్యంగా ఆలోచించుతున్నప్పుడు పనిని వాయిదా వేయడానికో లేక పనిని ఎగ్గొట్టడానికో ప్రేరణలను కలుగజేసే రసాయనాలు ఉత్పత్తవుతాయి.

డిప్రెషన్ఆలోచనలకు అవినాభావ సంబంధం వుంది. అందువల్లే మనస్సును అదుపు చేసుకోగలిగిన వారు విజయాలను సాధించగలుగుతారు. మనస్సును విచ్చలవిడిగా వ్యవహరించనిచ్చినప్పుడు పరాజయ పరంపరలను ఎదుర్కోవాల్సివస్తుంది. విజయాన్ని సాధించడానికి ఆలోచించుతున్నప్పుడు మెదడులోని కణాల మధ్య మమాచారాన్ని మార్పిడి చెయ్యడానికి సెరోటోనిన్ అనే రసాయనం అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. అపసవ్యంగా ఆలోచించుతున్నప్పుడు ‘సెరోటోనిన్‘ తగిన మోతాదులో ముఖ్యంగా సాధించలేని లక్ష్యాలను నిర్ణయించుకొని, వైఫల్యాలను ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో, మానసిక ఒత్తడిని పెంపొందించుకొంటే ‘సెరోటోనిన్‘ తగిన మోతాదులో ఉత్పత్తి కాదు. తత్ఫలితంగా డిప్రెషన్ లాంటి జబ్బులు సంక్రమిస్తాయి. విజయానికి బదులు పరాజయం ఎదురౌతుంది. పరాజయం  పరంపరలో చిక్కుకొన్నప్పుడు, ఆలోచనలన్ని వక్ర మార్గాలలో ప్రసరిస్తాయి. తత్ఫలితంగా మెదడులో ఉత్పన్నమయ్యే రసాయనాల సమతుల్యం విచ్చినమౌతుంది.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

ఆకులో భోజనం ఎందుకుచేయాలి?

Posted on జూన్ 13, 2009. Filed under: ఆరోగ్యం, పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , |

అరటిఆకులో భోజనంభోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.

పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి. ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా అన్నిట్లోకి అరిటాకులో భోజనం చేయడం మిక్కిలి శ్రేష్టం. పచ్చటి అరిటాకులో వేడివేడి పదార్థాలను వేసుకొని తినడంవల్ల కఫవాతాలు(cold) తగ్గిపోతాయి. బలం చేకూరుతుంది.ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరానికి కాంతి వస్తుంది. ఆకలి పుడుతుంది. మోదుగ, మఱ్ఱి, రావి ఆకులను ఎండబెట్టి విస్తర్లను తయారుచేస్తారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు. పచ్చి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తిన్నడం శ్రేయస్కరం. పూర్వం భోజనానికి విస్తర్లు, నీళ్ళు తాగడానికి ఆకు దోనెలను ఉపయోగిస్తారు. అలాగే మోదుగ ఆకులతో‌కుట్టిన విస్తరిలో‌అన్నంతింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మర్రిచెట్టు విష్ణువు స్వరూపం. మర్రి ఆకులో అన్నంతింటే క్రిమిరోగ నివారణి, కళ్ళకు సంబంధించిన దోషాలు తొలిగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా అరటి, మోదుగ, మర్రి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే ప్రేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదంలో  చెప్పారు. కాలక్రమేణా ఈ అలవాట్లు మారిపోయాయి. చాలామందికి విస్తరిలో భోజనం చేయడం అపురూపమైంది. కాంక్రీట్ జంగిల్ గా పేరొందిన నగరాలలో కూడా పండుగలు, పర్వదినాలలో మార్కెట్లో అరటిఆకులు అమ్ముతున్నారు. వాటిని కొన్నుకొని ఆ రోజు వాటిలో భోజనం  చేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్నిప్రాంతల్లోని హోటళ్ళలో  ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 15 వ్యాఖ్యలు )

మూడ్

Posted on జూన్ 4, 2009. Filed under: ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, |

మంచిమూడ్ మన జీవితంలో చాలా అవసరం. పనిలోను, వ్యవహారల్లోనూ, సృజన శక్తులు పెంచుకోవడంలోను మంచి మూడ్స్ ( moods ) ఎప్పుడూ అవసరమే. మనసుకు బాధపడటం కూడా ఆనందాన్ని ఇస్తుందని అంటారు తాత్వికులు. అలా బాధపడటం అనేది అలవాటుగా చేస్తే మనం నీరసించిపోవటం మినహా సాదించేది ఏమీ ఉండదు.

మన మూడ్స్   మన మనసుకు కళ్లేల  వంటివి. కళ్లాలను చేపట్టి సమర్ధవంతంగా స్వారీచేయగలిగితేనే మనం మన గమ్యస్థానాలను చేరుకోగలం అన్నది సత్యం. ప్రశాంతంగా, నవ్వుతూ ఉండటమన్నది ఒక అలవాటుగా మార్చుకోండి. తేడాలు వస్తుంటాయి. వీలయినంత తొందరగా నెగటివ్ మూడ్స్   లోకి వచ్చేస్తుండండి. దానికి తగ్గ కసరత్తు మీ చేతుల్లో పనే.

కొన్ని సూచనలు:

౧. సంతోషం, విచారం, కోపం, శాంతం ఇవన్నీ మోములో వ్రతిఫలించే మూడ్స్ . మనస్సుపై తీవ్రప్రభావాన్ని చూపేవి కూడా ఇవే. వీటిపట్ల అప్రమత్తత తప్పనిసరి.

౨. మీ నెగెటివ్ మూడ్స్   కు ఎప్పుడూ లొంగిపోకండి. పాజిటివ్ ధోరనిలో వాటిని దూరం చేసుకోండి.

౩. మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు, శారీరిక ఆరోగ్యాన్ని సైతం శాసించేవి మీ మూడ్సే. మీ పరిస్థితిపట్ల మీ స్పందనకు ప్రతిరూపమే మీప్రవర్తన. ఎలాంటి పరిస్థితిలోనైనా సంయమనంతో కూడిన ప్రశాంతధోరణి, సంతోషకరమైన చిత్తం మీ భావోద్రేకాలను అదుపులో పెడతాయి. మీ ‘మూడ్స్  ‘ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా చూస్తాయి.

౪. మీ భావోద్వేగాల పట్ల అవగాహన తప్పనిసరి. అంతేకాదు విచారంలోంచి వీలయినంత తొందరగా బయటపడాలనే ప్రయత్నం, సాధ్యమయినంతవరకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలనే తపన, మోమును మబ్బుపటిన ఆకాశంలా కాకుండా, మెరుపుమేఘంలా ఉంచుకోవాలనే ఆకాంక్ష మీకుంటే నలుగురిలో మీ ఉనికిని స్పష్టంగా చాటే మార్గంలో మీరు పయనం మొదలుపెట్టినట్టే.

౫. చిన్నచిన్నపనులద్వారా మిమ్మల్ని నీరసించేలా, నిస్సత్తువతో పడిపోయేలా చేసే ‘మూడీ’ తనం నుంచి సులభంగా బయటపడవచ్చు అన్న నమ్మకంతో ఉండండి. నెగెటివ్ మూడ్స్   అంటే కోపం, విచారం, చిరాకుపరాకులు మన అపక్వతకు (immaturity) నిదర్శనాలు. వీటిని అల్పవిషయాలుగా భావించి దూరంగా ఉంచండి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

Liked it here?
Why not try sites on the blogroll...