ఎందరో మహానుభావులు

రెహమాన్ – ఓ మంచి మనిషి

Posted on నవంబర్ 11, 2014. Filed under: ఎందరో మహానుభావులు, సంగీతం | ట్యాగులు:, , , , |

A.R. Rahman : If one door closes, seven other doors open.

Simi Garewal: It happened with you

A.R. Rahman : It happens to anybody, if they believe.

నమ్రత, స్పష్టమైన ఆలోచనా ధోరణి, అకుంఠిత దైవ భక్తి వంటి ఉత్తమమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అల్లా రఖా రెహమాన్. అతని మొదటి చిత్రం రోజా నుండే నేను అతనిని అభిమానించడం మొదలుపెట్టాను. అతని సంగీతానికి మంత్ర ముగ్దున్ని అయ్యాను. చాలా గొప్ప సంగీతాన్ని అందించేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలిసినప్పుడు, రెహమాన్ కు మరింత ఆకర్షితుడయ్యాను. rahman

బ్రిటన్ రాణిని మీరు కలిసినప్పుడు, ఆవిడ మీతో ఏమన్నారు అన్న ప్రశ్నకు, రెహ్మాన్ నాకు సరిగ్గా గుర్తుకులేదు అని చెప్తున్నపుడు, అతని చిరునవ్వు ఒక చిన్న పిల్లాడిని తలిపిస్తుంది. అతను పాల్గొన్న పలు ముఖా ముఖి సమావేశాలలో ఇది చూడడానికి కుదురుతుంది. ఏమైనా తెలియనప్పుడు, అనవసర ఢాంభికాలకు పోకుండా, సూటిగా, సుత్తిమెత్తగా సమాధానాలు అందించే లక్షణం కలిగినవాడు అతను.

దుఃఖం, ద్వేషం, కోపం వంటివి ప్రక్కకు నెట్టి, ప్రేమ, కరుణ వంటి భావాలను తన జీవితంలోనూ, తన సంగీతంలోనూ నింపుతూ వచ్చాడు రెహమాన్. ఒకానొక ప్రశ్నకు సమాధానంగా, తన సంగీతం తన తోటి జనులకు శాంతిని అందించగలగాలని, గాయపడ్డ హృదయాలను నయం చేయగలగాలని చెప్పాడు. ఇంతటి మహోన్నతమైన భావాలు కలిగిన అతను, గొప్ప సంగీతకారుడు మాత్రమే కాదు, ఒక మంచి మనిషి కూడాను.

నాకు పరమత సహనం, గౌరవం వున్నను, రెహమాన్ మత మార్పిడి మాత్రం ఒక కొరకరాని కొయ్యగా మిగిలింది. సిమి గారేవాల్ తో రెహమాన్, నేను ఆ ఘట్టాన్ని మతమార్పిడిగా కాకుండా, ఒక  అధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తాను మరియు అది హఠాతుగా జరిగినది కాదు అన్న సమాధానం నాకు నచ్చింది. రెహమాన్ ను నేను ఎప్పుడన్నా తలచుకోగా, అతని సంగీతం మరియు సంగీత సంభందించిన విషయాలు మాత్రమే కాకుండా, అతని వ్యక్తిత్వం గురించి కూడా  తలుచుకుంటాను.

రెహమాన్ ఎల్లప్పుడు అతని సంగీతంతో నన్ను అలరిస్తూ, అతని వ్యక్తిత్వంతో నన్ను ప్రోత్సహిస్తూ వుండాలని కోరుకుంటున్నాను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

అందరూ యాచకులే

Posted on ఆగస్ట్ 28, 2009. Filed under: ఎందరో మహానుభావులు | ట్యాగులు:, , , , |

అక్బరు బాదుషా

ఓ మారు ఒక యాచకుడు అక్బరు బాదుషా గొప్ప దాత అని తెలుసుకొని, అతని దగ్గర యాచించడానికి వస్తాడు. ఆ యాచకుడు రాజ దర్బారుకు వచ్చినప్పుడు, అక్బరు బాదుషా అక్కడ వుండరు. భటుడి ద్వారా అక్బరు దేవుని ప్రార్థనలో  నిమగ్నమై వున్నారని తెలుసుకుంటాడు. కాసేపు నిరీక్షించిన తర్వాత అతడు వెనుదిరుగుతుండగా, అక్బరు బాదుషా వచ్చి ఆ యాచకుడితో తన ఆలస్యానికి మన్నించమని మరియు తనకి ఏమి కావలెనో అడగమని చెప్తారు. అందుకు ఆ యాచకుడు బాదుషావారిని యాచించక పోగా గట్టిగా నవ్వాడు. బాదుషా యాచకుడి ఆ విచిత్ర ప్రవర్తనకు వివరణ కోరగా, ఆ యాచకుడు “బాదుషా, నేను ఓ యాచకుడిని. నువ్వు  శ్రీమంతుడని, నీకు సర్వాధికారాలు ఉన్నవని, నేను నీ దగ్గర యాచించడానికి వస్తే, నీవు ఆ భగవంతుడి ధ్యానములో నిమగ్నుడై ఆ పరమాత్ముడిని యాచించడం గమనించాను. ఒక యాచకుడు మరో యాచకుడిని దగ్గర యాచించడం కన్నా, అందరి కోరికలు తీర్చే ఆ భగవంతుడిని యాచించడం మేలు కదా!! ఆ భగవంతుడి సమక్షాన అందరూ యాచకులే” అని వివరించాడు.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

అరవిందం

Posted on ఆగస్ట్ 9, 2009. Filed under: ఎందరో మహానుభావులు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |

అరవిందులు

ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే రోజులలో వారు “ఐ.సి.యస్” అనే ఉన్నత పరీక్షను నిర్వహించేవారు. దానిలో కృతార్ధులైనవాళ్ళకు జిల్లా కలెక్టరు, ప్రభుత్వ కార్యదర్శి లాంటి పదవులు లభించేవి. ఈ పరీక్షలు లండన్‌లో జరిగేవి. ఆ పరీక్ష చదవడానికి భారతీయ యువకులు లండన్ వెళ్ళేవారు.

భారతదేశంలో ఉంటే సరైన విద్యరాదని భావించి తన కొడుకును 1884 లండన్ పంపించాడు ఒకాయన. విద్యనంతా లండన్‌లోనే పూర్తి చేసుకొని అక్కడే తన కొడుకు స్థిరపడాలని కోరిక. బాగా చదివి పరీక్షలన్నీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. తండ్రి కోరిక మేరకు ‘ఐ.సి.యస్’ కూడా చదివాడు. మంచి మార్కులతో పాసయ్యాడు. కాని అతడికి ఆంగ్లేయుల వద్ద పనిచేయడం ఇష్టం లేదు. మనస్సులో ఒక పథకం రచించుకున్నాడు.

‘ఐ.సి.యస్’ కు  గుర్రపుస్వారీ కూడా తప్పక రావాలి. దానిని ఆ యువకుడు నేర్చుకోలేదు. నాకు గుర్రపుస్వారీ అసలు రాదని పరీక్షాధికారులకు తెలిపాడు. ఎలాగైనా సరే నేర్చుకొని రమ్మన్నారు. అతనికి ఇష్టం లేదు. స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామి కావాలని ఆకాంక్ష. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను ఘాటుగా విమర్శించాడు. దానితో అతనికి ‘ఐ.సి.యస్’ డిగ్రీ ఇవ్వడానికి ఆంగ్లేయులు నిరాకరించారు. భారతదేశం వచ్చి కొంతకాలం స్వాతంత్ర్య సమరయోధునిగా పోరాడాడు.

స్వాతంత్ర్య వీరునిగా కొంత కాలం జైలులో ఉన్నాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుని దర్శనం లభించింది. పాండిచ్చేరి వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక సాధనలో అగ్రశ్రేణిలో నిలిచారు. ఆంగ్లంలో ఎన్నో గ్రంథాలను రచించారు. ఆయనే అరవింద మహర్షి.

పంద్రాగష్టు మనకు స్వాతంత్ర్య దినోత్సవమనే తెలుసు. ఆ రోజే అరవిందులు కూడా జన్మించారు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

హజారీ – సార్థక నామధేయుడు

Posted on జూలై 18, 2009. Filed under: ఎందరో మహానుభావులు | ట్యాగులు:, , , , , , , , , , , |

హజారీబాగ్

హజారీ అనే పేరు గల ఒక రైతు ఉండేవాడు. ఆయన తన పొలం గట్లపై మామిడి మొక్కలను నాటాడు. ఆయన ఎంతో శ్రమపడి వాటికి ఎరువు, నీరు అందించి పశువుల నుండి రక్షణ కల్పించాడు. కొన్ని సంవత్సరాలకు మామిడి చెట్లు ఏపుగా పెరిగాయి. పశు పక్ష్యాదులు చెట్లనీడలో కూర్చోవడం మొదలు పెట్టాయి. కొన్ని పక్షులు గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. పక్షుల కిలకిలరావాలు అందరికి నచ్చాయి. వేసవి కాలంలో చెట్ల నీడలో మంచం వేసుకొని విశ్రాంతి తీసుకోవడం ద్వారా హజారీ ఎంతో ఆనందం పొందేవాడు. మామిడి చెట్లపై పూత వచ్చినప్పుడు కోయిల కుహు కుహు రాగాలతో చుట్టూ ఉండే వాతావరణం మరింత ఆహ్లాదకరమయ్యేది. హజారీకి తను చేసిన పని వల్ల సంతృప్తి కలిగింది. అంతేగాక చుట్టుప్రక్కల ఉన్న రైతులు పొలాల గట్లపై కూడా ఇదే విధంగా మామిడిచెట్లను పెంచితే ఆ ఊరంతా పచ్చదనంతో, మంచి వాతావరణంలో అలరారుతుందని అనిపించింది. ఇంకేముంది! ఆ పనిలో ఆయన నిమగ్నమయ్యాడు.

ఆయన తన పొలంలో మామిడి మొక్కలను పెంచే నర్సరీని ఏర్పాటు చేసాడు. గ్రామగ్రామాన తిరిగి మామిడి మొక్కలను నాటడానికి రైతులకు ప్రేరణనిచ్చాడు. స్వయంగా తానే రైతుల పొలాల గట్లపై మామిడి మొక్కలను నాటడం ప్రారంభించాడు. వాటికి సంబంధించిన వ్యవస్థ కూడా తయారు చేసాడు.

కొన్ని సంవత్సరములు గడిచేటప్పటికి హజారీ ఆలోచన, ప్రయత్నాలకు ఫలితం కనిపించింది. ప్రజల ప్రవృత్తి, హజారీ ఉత్సాహం నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా హజారీ తన జీవితకాలంలో మొత్తం ఆ ప్రాంతమంతా వేయికి పైగా తోటలను రూపొందించి తన పేరును సార్థకం చేసుకొన్నాడు. ఈ కారణంగానే ఆ ప్రాంతం “హజారీబాగ్” అనే పేరుతో పిలువబడింది. ఈ ప్రదేశం జార్ఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లా అయ్యింది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

Liked it here?
Why not try sites on the blogroll...