మన విజ్ఞానం

యజ్ఞం

Posted on జూలై 2, 2009. Filed under: మన విజ్ఞానం | ట్యాగులు:, , , , , , , , , , |

యాగంవర్షాలు కురవడానికి వరుణ యాగం, ప్రపంచ సుఖ శాంతుల కొరకు విశ్వ శాంతి యాగం, ఇంకా అతిరుద్రమహా యజ్ఞం , ఇంకా మరెన్నో…… తి.తి.దే, సాయి బాబా, ఇంకా మరిన్ని ధార్మిక సంస్థలు ఇటువంటి యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. ఇటువంటి యజ్ఞ-యాగది-హోమ కృతువులు మన పూర్వీకుల కాలం నాటి నుంచి మనం ఆచరిస్తున్నదే.

‘అయినా ఓ యాగం చే(సే)సినంత మాత్రాన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయా? మేం నమ్మం’ అని లౌకిక వాదం మనకి వినిపిస్తూ ఉంటుంది.

నిజమే. ఆలోచించాల్సిన ప్రశ్నేగా ఇది! యాగంలో ఏముంటాయి? మంత్రాలు. ‘రక్షించగల శక్తి కలిగిన మాటల్నే మంత్రాలు‘ అంది వేదం. తప్పు చేస్తున్న పిల్లవాణ్ణి ‘కూడదు‘ అన్నట్టుగా తల అడ్దంగా ఆడించగానే వాడు ఆ పనిని మానేస్తున్నాడు. ఎందుచేత అంటే అక్కడ ఆ పిల్లవాణ్ణి మన చేష్ట ఆ పనిని చేయకుండా అపేసిందన్నమాట.ఇక్కడ వాక్కులోని శక్తి ఆ పని నుంచి ఆ పిల్లవాణ్ణి ఆపేసింది.

ఈ విధంగా నేను యజ్ఞం గురుంచి వర్ణించదలుచుకున్నాను. బాబా చిత్రంలో రజనికాంత్ చెప్పినట్టు “తెలిసింది గోరంత, తెలుసుకోవలసినది కొండంత“. మరి నేను యాగం గురుంచి ఇంకా చాలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. ఎలా అంటారా …. మరి మీకు తెలిసినదంతా దయచేసి నాకు తెలయపరిచండి.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?

Posted on జూన్ 14, 2009. Filed under: మన విజ్ఞానం | ట్యాగులు:, , , , , |

ఆర్యభట్టుమన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం.

సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో‌ వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో‌నిలచి ఉన్నది అని అర్థం.

ఆర్యభట్టు క్రీ..శ 476 ప్రాంతం వాడు. ఈయన భూగోలఃసర్వతో వృత్తః అని ఆర్యభట్టీయం అనే గ్రంధంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శోకంలో తెల్పేను. భూమి వృత్తాకారంలో‌అన్నివైపులా ఉన్నదని అర్థం. పంచ మహాభూతమయస్తారాగణపంజరే మహీ గోళః(13-1)

పంచసిధ్దాంతిక అనే గ్రంథంలో కీ..శ 505 సంవత్సరానికి చెందిన వరాహమిహురుడు “పంచభూతాత్మికమైన గుండ్రని భూమి, పంజమురలో వేలాడే  ఇనుప బంతిలాగా, ఖగోళంలో‌ఉన్నది” అని వ్రాసారు.

లీలావతి అడిగిన ప్రశ్నకు – భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు నీవు చూసేదంతా నిజం కాదు. భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు పెద్ద వృత్తం(circle) గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖ(straight line) లాగ కనిపిస్తున్నది. కాని అది నిజానికి వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.(లీలావతి అనే గ్రంథంలో‌ కలదు)

ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ నభూచ్ఛాయా” సూర్యుడిని చంద్రుడు కప్పినప్పుడు నీడా భూమి మీదకు సూర్యగ్రహణంగాను, చంద్రుడు భూమిని కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను కనిపిస్తుందని ఆర్యభట్టీయంలోని 37 శ్లోకంలో ఆర్యభట్టు వివరించాడు. భూమి తన కక్ష్యలో‌తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు అని ఆర్యభట్టు స్పష్టంగా వ్రాసారు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 26 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...