వ్యక్తిత్వ వికాసం

అర్జునుడు.. మిస్టర్ డేనీ ఓషన్..

Posted on ఆగస్ట్ 31, 2013. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , |

మహా భారతంలోని మన అర్జునుడికి, హాలివుడ్ చలన చిత్రం Ocean’s Eleven లోని డేనీ ఓషన్, వీరిరువురికి ఒక సమానత వున్నది. అది లక్ష్యంపై చెదరని దృష్టి.

గురువు చెట్టుపై వేలాడదీసిన పక్షి బొమ్మ యొక్క కన్ను లక్ష్యమని చెప్పి, దాన్ని బాణంతో ఛేదించమంటే, శిష్యులందరిలో ఒక్కొకరికి ఆ పక్షి కన్నుతో పాటు పక్షి శరీరం, చెట్టు కొమ్మలు, ఆకాశం ఇంకా ఎన్నెన్నో కనిపించాయి. కానీ అర్జునుడికి మాత్రం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించింది. అతని దృష్టి పక్షి కన్నుపై కాకుండా, మరే దాని మీదకు మారలేదు. గురువు సెలవిచ్చిన లక్ష్యాన్ని ఛేదించగలిగాడు.

Ocean’s Eleven లోని ఒక సన్నివేశం. బెనిడిక్ట్ ను దోచుకోవాలని నిశ్చయించుకున్న ఓషన్, అతని ప్రతి కదలికను అనుసరిస్తూ వుంటాడు. బెనిడిక్ట్ లాస్ వేగాస్ లోని తనకు చెందిన ఒక పాత హోటల్ భవంతిని కూల్చి, దాని స్థలంలో ఒక క్రొత్త భవంతిని కట్టడానికి నిర్ణయించి, దాన్నిబాంబులతో కూల్చేటప్పుడు, భవంతి ఎదుట ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాడు. బెనిడిక్ట్ ఆ సభలో రంగస్తలంపై నిల్చోని వుంటాడు. ఆ సభలో ఓషన్ మరియు, ఓషన్ కదలికలను మర్మంగా కనిపెడుతున్న అతని బృంద సభ్యుడు లినస్ కూడా వుంటారు. బాంబును పేల్చడానికి ట్రిగర్ ను నొక్కిన క్షణంలో, సభలోని అందరూ కూలుతున్న భవంతిని చూడడానికి వెన్నకి తలలు తిప్పుతారు, కానీ ఓషన్ మరియు లినస్ ల చూపులు మాత్రం మరలదు. ఓషన్ చూపు బెనిడిక్ట్ పై మరియు లినస్ చూపు ఓషన్ పై అలాగే వుంటుంది. చలించని దృష్టి అంటే అది. చిత్రం చివర సన్నివేశంలో ఓషన్ మరియు బృందం బెనిడిక్ట్ ను నిలువునా దోచుకుంటారు.

లక్ష్యం పైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించాక కలిగే తృప్తి మరియు ఆనందం, మరెందులోనూ పొందలేమనే నా భావన. కొన్ని కచ్చితమైన లక్ష్యాలను ప్రస్తుతం వుంచుకొని దాని వైపు కృషి సల్పుతున్న వారు మరియు గతంలో లక్ష్యం నెరవేర్చుకున్న వారు, నా భావనతో ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…

Posted on జనవరి 20, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |

ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని, వాటితో కొనసాగడం మంచిది. బాధ, ఒత్తిడి, చింత, ఆవేశం వంటి మనోస్థితుల వలన మనకు నష్టం వాటిల్లే ఆస్కారమున్నది. ఆ నష్టాన్ని ఆపగలగడం కాస్త కష్టతరం కావచ్చు. సాధారణంగా కొందరు పైన పేర్కొనబడిన మనోస్థితులను తట్టుకోవడానికి వ్యసనాలకు దగ్గరవుతుంటారు. ఈ వ్యసనాలు కాస్త విశ్రాంతి, ఓదార్పును కలగచేసినా మరో రకాలుగా నష్టం వాటిల్లజేస్తుంది

ఈ విధమైన నష్టాన్ని అరికట్టాలంటే వ్యసనాన్ని వీడి, వ్యాపకాన్ని అలవరచుకోవాలి. వేధనకు గురి చేసే మనోస్థితులను వెలియబుచ్చకుండా లోపలే వుంచేసుకున్నట్లైతే, అది మనలను దెబ్బతీస్తుంది. స్యయం కృషి చలన చిత్రములో ఒకానొక సన్నివేశములో కథానాయకుడు, తను కోపానికి గురైనప్పుడు, అతని కార్యాలయములోని ఒక గదిలోనికి వెళ్ళి, తలుపులు కట్టేసుకొని, ఒంటరిగా చెప్పులు తయారుచేస్తాడు. ఆ విధముగా తన కోపాన్ని ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో వెలియబుచ్చుతాడు. వేధనకు గురి కాకుండా తనను తాను కూడా కాపాడుకుంటాడు. చెప్పులు కుట్టడం అనే వ్యాపకంతో మనఃశాంతిని పొందాడు. ఇంకా ఒక జత చెప్పులు కుడా తయారయ్యాయి.

వ్యాపకం మరియు వ్యసనానికి తేడా ఏంటి? నా ప్రకారమైతే… క్రొన్ని కారణాల రీత్యా కలుగుతున్న వేధనలను దూరం కావించుకోడానికి, మనము క్రొన్ని అలవాట్లను అలవరచుకుంటాము. అలా పుట్టుకొవచ్చిన అలవాట్లకు మనము బానిసలమైతే అది వ్యసనం. అదే ఆ అలవాట్లు మనకు బానిసలలైతే దాన్ని వ్యాపకంగా పరిగణించవచ్చు.

అందుచేత మనకు కీడు తలపెటే వ్యసనానికి దూరంగా… మనకు మేలు తలపెటే వ్యాపకానికి దగ్గరగా వుండడం శ్రేయస్కరం.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా

Posted on నవంబర్ 27, 2009. Filed under: ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

శీర్షిక పేరు చదివి ఇదేదో సినిమా లేదా సీరియల్ కథ అని పొరబడే అవకాశం ఉన్నది. కాని ఇక్కడ చర్చించబోయో విషయాలు వాస్తవాలు. ప్రేమతో ఏమి సాధించవచ్చు అనే  విషయాన్ని చర్చించబోతున్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమదే జయం. ఈ జగమెరిగిన సత్యాన్ని కొందరు గుర్తించవచ్చు, కొందరు గుర్తించకపోవచ్చు. గుర్తించినవారు అప్పుడప్పుడు మరుస్తూవుంటారు కూడా.

మొదటిగా ప్రేమ అంటే దాదాపు అందరి మదిలో మొదిలే దృశ్యం నాయక నాయికల మధ్య చోటుచేసుకునే రసాయినిక చర్య లేక యుక్త వయసులో ఉన్న వారికి కలిగే భావనలు. వాస్తవానికి దానిని నిజమైన ప్రేమ అని చెప్పలేము. అది కేవలం ప్రేమ యొక్క ఒక రూపం మాత్రమే. ప్రేమ పలు రూపాలు కలిగిన ఒక క్లిష్టమైన అనుభూతి. ఓ తల్లికి తన బిడ్డపై వున్న ప్రేమ ‘వాత్సల్యము’. భార్యా భర్తల మధ్య వుండు ప్రేమ ‘అనురాగము’, మిత్రుల మధ్య వుండే ప్రేమ ‘స్నేహము’. భగవంతుడికి భక్తునికి మధ్య వున్నదే నిజమైన ప్రేమ. అదే అన్నింటికన్నా ఉత్తమమైనది.

నిన్నటితో ముంబాయిలో తీవ్రవాదులు మారణకాండ సృష్టించి ఒక సంవత్సరకాలం అవుతున్నది. వారిలో నిజంగా సమస్త మానవాళిపై ప్రేమ గనక వుంటే, ఈ పని చేసేవారు కారు. వారి మనసులో ప్రేమ లోపిస్తుంది గనక, కరుడు కట్టి వుంటున్నది. అదే వారి మనసులో ప్రేమ గనక ఉండి వుంటే, వారు భీబత్సాన్ని సృష్టించి వుండరు.

హిందూ ధర్మము ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని దర్శించమని సూచిస్తున్నది. అలా గనక మనము చేయగలిగితే, అందరిలో వున్న భగవంతుడి ప్రేమించే అవకాశం వుంటున్నది. తద్వారా మనము సమస్త జీవకోటిని ప్రేమించే వారము అవుతాము. అప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా, ప్రేమతో అది సులువుగా పరిష్కరించబడుతుంది. ప్రతి వొక్కరిని ప్రేమించడానికి, మీరు హిందువో/ఆస్తికవాదో కానవసరం లేదు. మన జాతి మానవజాతి. మన కులం ప్రేమ కులం. ఈ విషయాలను గుర్తిస్తే చాలు. కనీసం మనము ఒకరికి మేలు చేయకున్నా, వారికి కీడు తలపెట్టకూడదు. అందరిని ప్రేమించే మనసు మనకు ఉన్నప్పుడు, దీనిని మనము చాలా సులువుగా ఆచరించవచ్చును.

కేవలం తీవ్రవాదినికే కాదు, ప్రపంచంలో నెలకొని వున్న అన్నీ నైతికమైన సమస్యలకు, మానవుని భావోద్వేగాలతో‌ ముడిపడివున్న అన్నీ సమస్యలకు, కేవలం ప్రేమ యొక్కటే పరిష్కారము. ప్రేమ ఎక్కడవుంటే అక్కడ సత్య, ధర్మ, శాంతి, అహింసలు నెలకొనివుంటాయి.

ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, మౌనంలోనే దేవుని మనము దర్శించవచ్చు. ఆ మౌనంలో మనలోని దైవత్యం మేలుకుంటుంది. అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే, తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా దొరికే పరిష్కారం అందరికి ఆమోద్య యోగ్యమే అవుతుంది. అందరిని సంతోషపెట్టేదిగా వుంటుంది.

రండి అందరూ కలిసికట్టుగా ఈ ప్రపంచాన్ని ప్రేమమయం చేద్దాం. తద్వారా శాంతియుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని సృష్టిద్దాం. ప్రేమదే జయం…. ఎప్పుడైనా, ఎక్కడైనా.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 3 వ్యాఖ్యలు )

అంతస్సారం

Posted on నవంబర్ 3, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , |

రాజ్యాధిపతులు కావడానికీ ఉన్నత పదవుల్లోకి వెళ్లడానికీ పెద్ద తేడా లేదు. ఈనాటి యువత చిన్నప్పటి నుండీ స్పర్ధాస్ఫూర్తితో ఉన్నత పదవులను ఆశిస్తూ విద్యాకృషి చేస్తున్నారు. అది మంచిదే. కానీ ఉన్నత పదవులను కోరేవారు ఎలాంటి అంతస్సారాన్ని అలవర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇందుకు భగీరథ చక్రవర్తి జీవితంలో ఒక సన్నివేశం ఉపయోగపడుతుంది.

గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని కథ అందరికీ‌ తెల్సినదే. ఈ భగరథుడు అయోధ్యానగరానికి రాజు, చక్రవర్తిగా చక్కని పరిపాలన చేశాడు. ఆయనలో ఉన్న అసలైన అంతస్సారం తెలియాలంటే గంగావతారణానికి తరువాత జరిగిన  కథ ఒకటి తెలుసుకోవాలి. ఆ చక్రవర్తి రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరమాత్మను గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకొని తన ఆలోచనలన్నీ తన గురువుకు తెలిపాడు.

గురువు సలహామేరకు ఆ రాజు ఒక యజ్ఞం చేసి, తనకు గల సంపదనంతా ప్రజలందరికి దానం చేశాడు. కానీ, ఒక్క చక్రవర్తిత్వం మాత్రం మిగిలిపోయింది. దానిని కూడా తీసుకోమని భగీరథుడు చాలామందిని అడిగి చూశాడు. కానీ వారెవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆయన తన పొరుగురాజును ఆహ్వానించాడు. అసలు విషయం తెలియగానే ఆ రాజు భయపడి, “ఓ మహారాజా! మీరు ధర్మప్రభువులు మీ స్థానానికి నేను తగను” అని తప్పించుకోబోయాడు. భగీరథుడు అతనికి మంచిమాటలు చెప్పి ఎలాగోలా తన రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో మారువేషం ధరించి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఎవరూ గుర్తుపట్టకుండా, పగటిపూట రహస్యంగా ఉండేవాడు. రాత్రిపూట మాత్రం భిక్షమెత్తుతూ, బిచ్చగాడిలా జీవిస్తూ ఉండేవాడు.

ఇలా కొంతకాలం జరిగిన తర్వాత, తన మనస్సులో అహంకారం నశించిందనే నమ్మకం ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన పగటి పూటకూడా భిక్షమెత్తుకోసాగాడు. కొన్నిరోజులకు తన స్వరాజ్యమైన అయోధ్యకు చేరి, అక్కడకూడా భిక్షమెత్తసాగాడు. అయోధ్యలో ఎవరూ ఆయనను గుర్తించలేకపోయారు. అందువల్ల ఆయన సరాసరి రాజు వద్దకే వెళ్ళి భిక్షవేయమని అడిగాడు. ఇంతలో అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఒకడు పోలికలను బట్టి, కంఠస్వరం బట్టి భగీరథ మహారాజును గుర్తించి ప్రస్తుత రాజుకు చెప్పేశాడు. ఆ రాజు భగిరథునికి వినయంగా ప్రణమిల్లి “రాజ్యం  స్వీకరించండి” అని ప్రార్థించాడు. భగీరథుడు అందుకు ఇష్టపడక, “అయ్యా! పెట్టదలచుకుంటే నాకు భిక్షం పెట్టు, లేకపోతే లేదు” అని మొండికెత్తాడు. పాపం ఆ రాజు మారు మాట్లాడలేక భిక్షం పెట్టాడు. భగీరథుడు ఎంతో సంతోషంతో ఆ భిక్ష తీసుకొని వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి అయోధ్యను పాలిస్తున్న రాజు గతించాడు. అతనికి వారసులు లేరు. అందువల్ల ప్రజలందరూ వెతికి వెతికి భగీరథుడి వద్దకు వచ్చి “మా భిక్షగా మీరీ రజ్యం స్వీకరించక తప్పదు” అని గట్టిగా పట్టుబట్టారు. అప్పటికి పరమాత్మ దర్శనం పొందివున్న భగీరథుడు ప్రజల కోరికను అంగీకరించాడు.

నాడు, అప్పటిరాజు రాజ్యాన్ని స్వీకరించమన్నపుడు ఆ ప్రలోభానికి భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందు వల్ల, భగీరథుడు లొంగలేదు. ఆత్మనిష్ఠ కలిగినందువల్ల, భగీరథుడికి ఇప్పుడు రాజ్యం ప్రతిబంధకంగా తోచలేదు. ఇట్టి ఉదాత్తస్థితికి చేరగల మహనీయుడు కనుకనే, భగీరథ చక్రవర్తి సమస్తలోకాల హితం కోసం గంగాదేవిని భూమికి తేగలిగాడు.

ఈనాడు ఉన్నతోన్నత పదవులకు అందుకోవాలని కృషి చేసే యువకులు భగీరథ చక్రవర్తి వంటి అంతస్సారాన్ని, పరోపకార దీక్షను నేర్చుకోవాలి. అప్పుడే వారు మెచ్చుకోదగ్గ భారత యువకులవుతారు.

 

ములాధారం: ధ్యానమాలిక – సామాజిక ఆధ్యాత్మిక సశాస్త్రీయ మాసపత్రిక

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

సంకల్పాలు

Posted on ఆగస్ట్ 2, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం, సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , |

విత్తనం ఏ రీతిగా వృక్షమై ఫలాల నందిస్తుందో, సంకల్పాలు కూడా అదే విధంగా క్రియారూపం ధరించి ఫలరూపంగా మారిపోతాయి. దుష్టభావనలు మనస్సులో ఉన్నంత వరకూ దుష్టప్రవర్తన తోటే జీవితం అంతమొందుతూ వుంటుంది. సద్భావాలు హృదయంలో ఆవిర్భవించినపుడు అవి సత్-చింతనగా శుభదృష్టిగా రూపొందుతాయి. కనుక సాధ్యమైనంత వరకు మన సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండేటట్టు ప్రయత్నపూర్వకంగా మనం సాధన సాగించాలి. సంకల్పాలు ఒక సంకల్పం నుండి మరో సంకల్పానికి పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సంకల్పం అనేక సంకల్పాలకు కారణం అవుతుంది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!

Posted on జూన్ 19, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |

Self Reliance is not about being independent, but interdependent.

రవీంద్రనాథ్ ఠాగూర్ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.

జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.

సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!


అలాంటి మనస్తత్వం మీలో‌ఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.

Being independent is not enough, be interdependent.

మీ గురుంచి కొన్ని విషయాలు:

౧. మీ గురుంచి మీరు బాగా  తెలుసుకోవడమన్నది జీవితానికి చాలా ఉపయోగపడే అంశంగా గుర్తించండి.
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 9 వ్యాఖ్యలు )

వాదోపవాదాల కాలక్షేపం వద్దు

Posted on జూన్ 17, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , |

వాదోపవాదాలు-గొడవలుచాలా మామూలు సంభాషణతో మొదలయి, వాదనగా మారి .. చివరికి గొడవగా పరిణమించే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవైకవేద్యమే. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులమధ్యనో, స్నేహితులమధ్యనో బయటిప్రపంచం వ్యక్తులతోనో అనుభవంలోకి రావచ్చు.

వాదోవవాదాలు లేకుండా ఉంటాయా?

మాట నేర్చిన మనిషి ఎంత కాదనుకున్నా ఈ ‘వాదోపవాదాల’ సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అతను ఉపయోగించాల్సిందల్లా గొడవదాకా దారితీయకుండా చూసుకునే తనదైన ‘విద్వత్తు’ను.

సంభాషణ నుంచి వాదనకు మన మాటతీరు ఎలా మారింది? అన్నది మనం జాగ్రతగా గమనించాల్సి వుంటుంది. ఈ రెండోదశలో సాధ్యమయినంతవరకూ ఆగిపోవాలి. అంతేకాదు వాదనలో‌ గెలుపు, ఓటమి అనే మాటల మీద పెద్ద పట్టింపును కూడా చూపవద్దు.

ఇంగ్లీషులో ఒక మంచి మాట ఉంది…ఆ మాట అర్థం “వాదనలో గెలిచే ప్రతిసారీ నువ్వో మిత్రుణ్ణి పోగొట్టుకుంటున్నావని గుర్తుంచుకో”. ఆ మాటా వాదనలో గెలుపు, ఓటమి అనే మాటలు ఎంత నిరర్థకమైనవో చెప్పకనే చెప్పింది కదూ?!

గొడవలతోనూ, వాదనలతోనూ సాధించేది ఎప్పుడూ తక్కువే

మన స్థాయిని, మన భవిష్యత్ లక్ష్యాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే మన ఇతరులతో వాదోపవాదాలకో, గొడవలకో తలపడితే బావుంటుంది. పెద్ద నష్టం ఉండదు కూడా. అలా చేసిన మీకే నష్టం రాదనితెలిసినా మీరు గొడవలకు, వివాదాలకు మీ సమయాన్ని వెచ్చించకపోతే మరింత గొప్పజీవితానికి, ఉన్నత లక్ష్యాలకు చేరువ కావచ్చుకూడా.

గొడవలకు దారిచూపేది ఎప్పుడూ అహంభావమే

ఇతురులకన్నా అధిక్యులమన్న భావనవల్లనో, లేదా మనదైన ఉనికికి ప్రత్యేకత కావాలని కోరుకోవడంతోనో ‘గొడవ’ అనే విషవృక్షానికి బీజం పడుతుంది. ఎలాగంటారా? పై విధంగా ఆలోచించే మనిషి తన ఆలోచనలకు భిన్నంగా కనిపించిన దేన్నీ సహించలేడు. వాదానికి దిగుతాడు. తనను తాను నిరూపించుకోవడం  కోసం గొడవకు సైతం సిధ్దపడతాడు.

అహంభావాన్ని త్యజించమని చెప్పడం సన్యాసి మాటలాగా ధ్యనించవచ్చేమో కానీ, మిమ్మల్ని అపరిణతమనస్కులుగా బయటి ప్రపంచానికి చూపే మీ అహానికి సరైన సమయంలో, సరైన రీతిలో కళ్లేలు బిగిస్తుండండి అనడం మటుకు చాలా సాధ్యమయ్యే పనే.

కొన్ని చిట్కాలు

౧. అనవసర వాదనలకు ఎప్పుడూ దిగకండి. వాదనలో గెలవడం చెప్పుకోదగ్గ ‘విద్వత్తు’ ఏమీ కాదు.

౨. ఎవరితో వాదిస్తున్నారో బాగా గుర్తుంచుకోండి. ఆత్మీయులతోనూ, మంచిమిత్రుడితోనూ అయితే మరింత జాగ్రత్తగా మాటలను ఉపయోగించండి. మీరు వాదనలో గెలిచే ప్రతిసారీ ఒక మిత్రుణ్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.

౩. అల్పవిషయాల కోసం, అసంగతమైన కోరికల వెంపర్లాటతోనూ ‘గొడవ’ పడుతూ అందమైన జీవితాన్ని వికృతంగా మార్చుకోకండి.

౪. మీరు వాదోపవాదాలకు దిగరు. తార్కికంగానే ఆలోచిస్తారు. అయినా ఎదుటివాళ్లు అలా లేనప్పుడు గొడవలు వస్తాయి కదా…. అప్పుడు ఏం చేయాలంటారు? ఈ ప్రశ్నకు అబ్రహం లింకన్ జవాబిది… “ఎదురుగా వచ్చే శునకానికి మీరే దారి ఇవ్వండి. అంతేగానీ అదే పక్కకు తొలిగిపోవాలని ఆశించవద్దు”.

౫. అనవసరమైన వాదనల వల్ల, గొడవల వల్ల సమయం వృధా అవుతుంది. మానసికంగా కుంగిపోయే ప్రమాదం వుంటుంది. శారీరకంగా జబ్బులబారిన పడవచ్చు. అవన్నీ ఒక ఎత్తు. అందివచ్చే అవకాశాలను గుర్తించలేని అంధత్వంతో జీవితంలో మనం చాలా పోగొట్టుకునేవారమూ కావచ్చు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

సర్దుబాటు మనస్తత్వం కీలకం!

Posted on జూన్ 16, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, |

ఆధునిక జీవితంలో మనిషి సంతోషంగా జీవించాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇంకొన్ని సామాజిక పరమైన సమస్యలు, మరికొన్ని వృత్తిపరమైన సమస్యలు. అనేకమైన సవాళ్ళు, సమస్యలు ఎదురయ్యే  సమాజంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అనుకున్నట్లు మనచుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు ఉండవు. వాటికి తగ్గట్టుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. ‘Ability is something but test is everything’ అన్నారు. test అంటే మోసం కాదు. నైపుణ్యత, ఇతరులతో ఏ విషయం, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగి మన పని చేసుకోగలగడం. ప్రతి చిన్నదానికి కోపం, విచారం రాకుండా మనల్ని మనం కాపాడుకోగలగడం.

ఎన్ని సమస్యలు వున్నా సంతోషంగా జీవించాలని అనుకునేవారు కొన్ని పద్దతులు పాటించాలి.

* మంచి అలవాట్లు చేర్చుకోవడం, చెడ్డ అలవాట్లు మానుకోవడం
* స్వయం అభివృధ్ది  కోసం నిరంతరంగా కృషిచేయడం.
* మితంగా మాట్లాడడం, తినటం.
* అనవసర వత్తిళ్ళు తగ్గించుకోడానికి ప్రయత్నించడం
* స్వతంత్రంగా నిర్ణయాలు చేయగలగడం, ఆచరించడం
* పరిపక్వంగా ఆలోచించగలగడం, ఆచరించడం
*‌ పిల్లలను సక్రమంగా పెంచగలగడం
* తగినంత విరామం, వినోదం పొందడానికి ప్రయత్నించడం
* ఏదైనా టైం ప్రకారం ఒక పధ్దతిలో చేయగలగడం
* ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు గడపగలగడం
* ఏ సమస్యనైనా తేలికగా తీసుకోగల  మనస్తత్వం ఏర్పరచుకోగలగడం
* రోజూ కొంచెం  సేపు మౌనంతో ప్రార్థన చేసుకోగలగడం

ఇటువంటి రకరకాల పధ్దతులు పాటించడం వలన సంతోషంగా జివించగలగటానికి అవకాశం చాలా ఎక్కువ.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

పట్టుదల ముఖ్యం

Posted on జూన్ 11, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , |

swami_vivekananda_portrait

ఓ సరస్సు ఒడ్డున కొంతమంది  విదేశీ యువకులు నిలబడి తమ చేతిలో ఉన్న తుపాకులతో నీటిమీద తేలుతున్న కోడిగుడ్డు డొల్లలను గురిచూసి కాల్చసాగారు. కాని వారి గురి తప్పుతోంది. ఆ దోవనే వెళుతున్న ఓ కాషాయ వస్త్రధారి అది గమనించి ఓ యువకుడి వద్ద నుండి తుపాకి తీసుకుని వరుసపెట్టి కోడిగుడ్డు డొల్లలను కాల్చాడు. ఆశ్చర్యం! ఒక్కటి కూడా గురి తప్పలేదు. అప్పుడు ఆ విదేశీ యువకులంతా కాషాయ వస్త్రధారితో  “షూటింగ్ లో మీకు  గొప్ప అనుభవం ఉండి ఉండాలి అవునా?”‌అనడిగారట. దాని కాయన నవ్వుతూ “లేదు! నాకు షూటింగ్ లో  అనుభవం లేదు. అసలు తుపాకీ చేతపట్టుకుంది ఇప్పుడే, ఇదే తొలిసారి. కానీ‌ మీకు నాకు ఒక్కటే తేడా. నేను తుపాకీ చేతపట్టగానే కాల్చగలను అని నాకు నేనే ధైర్యం చెప్పకున్నాను. గురి చూసేటప్పుడు సాధించాలి అనే పట్టుదలను నా చూపుడు వేలిలో ఉంచి, మనస్సును ఏకాగ్రతతో నా లక్ష్యం వైపు గురిచూసాను. నా సర్వశక్తులనూ దాని మీదే కేంద్రీకరించాను. అంతే! సాచించగలిగాను” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడట ఆయన. విదేశీ యువకులంతా తమకంత దృడనిశ్చయం లేనందుకు సిగ్గుపడుతూ అక్కడి నిండి వెళ్ళిపోయారట. ఇంతకూ ఆ కాషాయ వస్త్రధారి ఎవరో తెలుసా? స్వామి వివేకానంద.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

అంతరాలున్నవి అధిగమించడానికే

Posted on జూన్ 8, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు: |

నిత్యజీవితంలో ప్రతీ మనిషీ కాస్త అటుఇటుగా తనకు ఎదురయ్యే అవాంతరాలకు నిరాశతో ఉసూరుమనడం సహజాతిసహజం. కాని ఈ నిరాశకాలం ఎంత తక్కువయితే  మనిషికి అంతమంచిది, అలాకాదని నిరంతరం పైవిధంగా చింతిస్తూపోతే, ఇలాంటి ‘చింతన’నే ఆలోచనల్లో  ప్రధనభాగం చేసుకుంటే అతను కానీ ఆమె కానీ జీవితంలో చాలా కోల్పోవలసివస్తుంది. మనకు అవాంతరాలు ఎదురయ్యాయంటే మనం ఒక పనిని మొదలెట్టామని అర్థం. ఏదో ఒకపని మొదలు పెట్టడమన్నది ఎప్పుడూ మంచిదే. అలా మొదటి అడుగు మంచిది అయినప్పుడు ఇక మనం చింతించాల్సిందల్లా  ముందుకు  అడుగెయ్యటమే. లక్ష్యసాధన దిశగా సూటిగా సాగిపోవటమే. ఈ  ప్రయాణంలో మనకు అవాంతరాలు ఎదురవ్వడం అన్నది తప్పించుకోలేని భాగం. అవాంతరాలను అధిగమిస్తూ ముందుకు సాగడమే చేయాల్సిన పని.

హర్డిల్స్   పోటీలో పల్గొనే క్రీడాకాతుడికైతే శారీరకదారుఢ్యం, సునిశితదృష్టి , సంయమనం, నిరంతరకృషి  అతను  లక్ష్యాన్ని  చేరుకునేందుకు ఉపయోగపడతాయి. మరి జీవితంలోని హర్డిల్స్     దాటడానికి మనకెలాంటి లక్షణాలు ఉండాలనుకుంటారు?
“ఇంత  సృష్టిని వదిలి దృష్టిని ఎక్కడో పారేసుకోకోయ్  ఒరసి చూస్తే పదును బుధ్ధికి గిరులు లోయలు అడ్డుకావోయ్” – అంటూ ఒక తెలుగుకవి చాలా చక్కటి మాటల్లో  చెప్పరు. మన అవాంతరాలు గిరులు లోయలు అనుకుందాం. వాటిని అధిగమించడమే మన తక్షణ కర్తవ్యం అవుతుంది. మరి ఎదురుగా కనిపించే అవాంతరాలను అధిగమించడం మినహా మనకు మరో కాలక్షేపం పనివద్దు. దృష్టిమాంద్యం కూడా వద్దు. బుధ్ధికి పెట్టుకుందాం. అప్పుడు మనకు మన అవాంతరాలపట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది.అధిగమించేందుకు కావలసిన శక్తులును సమకూర్చుకోగలుగుతాం.

టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

« పాత ఎంట్రీలు

Liked it here?
Why not try sites on the blogroll...