సూక్తి రత్నావలి

మౌనానందం

Posted on నవంబర్ 5, 2009. Filed under: ఆధ్యాత్మికం, సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో  శ్రీ సత్య సాయి  బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను.

మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఆ పసిముఖంలో ఆనందం పెరిగి పెద్దదైనాక లోపిస్తుంది. పెరిగినకొద్దీ ప్రపంచంలో ఉన్న సొత్తంతా నా ఒక్కడిదే అనే మోహంతో కూరుకుపోతున్నారు. మీలోని కోరిక కొండంత పెరిగేసరికి మీలోని ఆనందం తగ్గుతూ అహంకారం పెరుగుతుంది. పుట్టగానే కంటిముందున్న తల్లి నా స్వంతమనుకొని అహంకరించడం మొదలు పెడతాడు. తర్వాత ఇల్లు నా సొంతమనుకుంటాడు, తర్వాత పెళ్ళాం, పిల్లలు, ప్రపంచం అంతా నాదే అనే‌ అహంకారం పెంచుకుంటూ పోతాడు. ఇవన్నీ ఇతన్ని చీత్కరించి దూరమైతే అప్పుడు అంతర్ముఖమై వాటినన్నింటిని వదిలించుకొని తనలోనే దాగొని ఉన్న అంతర్యామే తన సొంతమని గుర్తించి దానినుండి అంతటి మహత్తర ఆనందాన్ని పొందుతూ కేరింతలు కొట్టగలుగుతున్నారు. ప్రపంచం మిద మోహాలు పెంచుకోకుంటే మీరూ అట్టి ఆనందాన్నే పొందగల్గుతారు. మీ జన్మను వ్యర్థపు సంచిలా తయారు చేస్తున్నారు. పనికిరాని చెత్తంతా నింపి, అసలు పనికివచ్చేదాన్ని అడుగున పెట్టేస్తున్నారు. అందుకై మౌనంగా ఉండి మీలో నింపిన వ్యర్థపదర్థాలనన్నింటినీ బయటకు నెట్టేయండి. దీనిద్వారా మహత్తరమైన ఆత్మశక్తి మీకు అందుతూ అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అందుకే పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువలై పొంగుతూ ఉంటుంది. ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని చవిచూస్తూ మీలోని దైవాన్ని కనుగొనండి.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

చిత్తశాంతికి సులువైన మార్గం

Posted on ఆగస్ట్ 20, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , |

పట్టుపురుగు తనలోని దారముతో పసిడికాయ నల్లును. తుదకదియే దానికి గోరీ యగును. అట్లే, మనుజుడును తన మనసులోని వాంఛలనెడి దృఢ పాశములతో బోను నిర్మించుకొని, అందు బంధితుడై, తప్పించుకొని దారి తెలియక బాధపడుచుండును. కాని, అందుకొక మార్గమున్నది. ఆ మార్గమును గురువు ఉపదేశించును.లేదా, నీలోనున్న దైవమే నీకు స్ఫురింపజేయవచ్చును. నీవు చేసిన ప్రతి చెడ్ద పనిని నీ దినచర్యలో వ్రాసి పెట్టూకొను మనియు, ఆ వ్రాతను పలుమారు చదువుకొనుచు నిన్ను నీవే సంస్కరించుకొనుటకు నిశ్చయించుకొనుమనియు ఉపదేశించు గురువులు కొందరుందురు. వారు నిజముగా నిన్నుద్ధరించు గురువులు. వెనుకటి తప్పులను వేమారు మనసుకు తెచ్చుకొనుటవలన, ఇకపై అట్టి తపులు చేయరాదన్న నిశ్చయమేర్పడి నిన్ను చక్కదిద్దును; దుర్భావములను, దుర్వర్తనమును దూరము చేసి సద్భావములను, సద్వర్తనమును దూరము చేసి సద్భావములను, సద్వర్తనమును నీకు సమకూర్చి పెట్టును. అది సులువైన తత్త్వ సాధన. చిత్తశాంతిని సాధించుటకు అదియే మంచి మార్గము.

మూలము: శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య వాఖ్య విభూతులు.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

మృదు మధుర భాషణ

Posted on ఆగస్ట్ 5, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

నాలుక

భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు. దానితో మనం రెండు పనులు చేసుకోవచ్చు. ఒకటి రుచి చూడడం. రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాము. తియ్యగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకమే మన వశమవుతుంది.

కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం. కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కోకిల చేసిన పుణ్యమేమి? కాకి చేసిన పాపమేమి? వాటి నోటి నుంచి వచ్చిన ధ్యనిలో ఆ భేదం ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చెప్తారు. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు. కాని కొంత ఊరటగా మాట్లాడవచ్చు. దానివలన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.

మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మనకు అన్నీ సుఖాలను తెస్తుంది. చడ్దదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి.

ఒకప్పుడు ఒక రాజు మంచివస్తువులన్నిటికీ ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేకమంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువు పరీక్షగా చూస్తూ వస్తున్నాడు. హఠాతుగా ఒకచోట ఆగి ఆశ్చర్యంలతో చూచాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను కోసి ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటని అడిగాడు. ఆ వ్యక్తి “ప్రభూ! నాలుకను మించిన మంచి వస్తువు లేదు. నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు” అని చెప్పాడు. రాజు ఆనందించి నాలుకకు ప్రధమ బహుమతి ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత రాజు చెడ్డవస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. దానిలో అనేక చెడ్డ వస్తువులు ప్రదర్శించ బడ్డాయి. అందులో కూడా అంతకు ముందు బహుమతి పొందిన వ్యక్తి ఒక నాలుకకు కోసి ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యపడి ప్రశ్నిచాడు. ఆ వ్యక్తి “ప్రభూ! నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డదైతే అందరి కోపానికి గురు అవుతాము” అని చెప్పడు. రాజు ఆ నాలుకకు మళ్ళీ ప్రధమ బహుమతి ఇచ్చాడు.

నేను ఇదివరకే నా బ్లాగులో సందర్భానికి తగినట్లుగా మాట్లాటడం ఎలా అని టంగ్ ఫూ – మాటే పంచ్ లో తెలిపాను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

సంకల్పాలు

Posted on ఆగస్ట్ 2, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం, సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , |

విత్తనం ఏ రీతిగా వృక్షమై ఫలాల నందిస్తుందో, సంకల్పాలు కూడా అదే విధంగా క్రియారూపం ధరించి ఫలరూపంగా మారిపోతాయి. దుష్టభావనలు మనస్సులో ఉన్నంత వరకూ దుష్టప్రవర్తన తోటే జీవితం అంతమొందుతూ వుంటుంది. సద్భావాలు హృదయంలో ఆవిర్భవించినపుడు అవి సత్-చింతనగా శుభదృష్టిగా రూపొందుతాయి. కనుక సాధ్యమైనంత వరకు మన సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండేటట్టు ప్రయత్నపూర్వకంగా మనం సాధన సాగించాలి. సంకల్పాలు ఒక సంకల్పం నుండి మరో సంకల్పానికి పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సంకల్పం అనేక సంకల్పాలకు కారణం అవుతుంది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

జిహ్వా బహుపరాక్!!!

Posted on జూలై 15, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , |

ఓ నాలుకా! తిండి తినే విషయంలో, తిన్నగా మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండు. తిండి ఎక్కువగా తిన్నా, మాటలు ఎక్కువగా మాట్లాడినా ప్రాణహాని కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకో!

పంచేంద్రియాల్లో నాలుక ప్రధానమైనది. భాషకు పర్యాయపదంగా నాలుక ప్రయోగించబడుతుంది.’వాడు నోట్లో నాలుక లేనివాడు’ అంటే సరిగా మాట్లాడలేనివాడు, అమాయకుడు అనే అర్థాలు వస్తాయి. వాక్కును ఉత్పత్తిచేసే ప్రధాన సాధనాల్లో నాలుక ఒకటి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తిండి తినటానికి కూడా నాలుక అవసరం ఎంతో ఉన్నదనే విషయాన్ని మనం మరవకూడడు. నోట్లో వేసుకున్న ఆహారం లోపలికి పోవాలంటే నాలుక కదలాల్సిందే. నలుక కదులుతున్నది కదా అని ఎక్కువ తింటే ప్రాణహాని కలుగుతుంది. మితాహారం, హితాహారం, మితభాషణం, హితభాషణం ముఖ్యమనే విషయాన్ని మనం గుర్తించాలి.

శరీరాన్ని నిలుపుకోవటానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. అందుకే మహర్షులు తమ పిడికిలిలో పట్టినంత ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు, కాబట్టే వారిని ‘ముష్టింపచులు’ అన్నారు.

నాలుక మంచిని పలుకుతుంది, చెడును ఉచ్చరిస్తుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పరహితాన్ని కోరే ప్రియవాక్కులు పలకాలి. వాక్కు బాణం కంటే పదునైంది. కఠినమైన వాక్కు కలకాలం బాధపెడుతుంది. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోటిదురుసుగా మాట్లాడి శిశుపలుడు ప్రాణాలకే ముప్పుతెచ్చుకున్నాడనే విషయాన్ని మనం మరవకూడదు. అందుకే మితంగా తిందాం! హితంగా మాట్లాడుదాం!!

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

మన చరిత్ర – మన భవిష్యత్తు

Posted on జూన్ 15, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, , |

ఏ జాతికీ తన చరిత్రను గురుంచిన వాస్తవికమైన జ్ఞానము ఉండదో ఆ జాతికి భవిష్యత్తు కూడా ఉండదు. అయితే ఆ సత్యంతోబాటు మరో‌మహా సత్యం కూడా ఉంది. ఏ జాతి అయినా తన గౌరవ పూర్ణ గత చరిత్రతో తన్మయత్వం పొందితే సరిపోదు, తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడంలో‌ గత చరిత్రను ఉపయోగించుకొనే క్షమత సంపాదించుకోవడం కూడా అత్యంత అవశ్యకం. “మా తాతలు నేతులు త్రాగేరు, కావాలంటే మా మూతులు వాసన చూడండి” అని గొప్పలు చెప్పుకోరాదు. మన పూర్వికుల గొప్పలు చెప్పటం మాత్రమే చేయకుండా మన చేతల ద్వారా భావితరాల వారికి ఆదర్శంగా నిలవాలి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

మిత్ర లాభం

Posted on జూన్ 12, 2009. Filed under: సూక్తి రత్నావలి | ట్యాగులు:, |

మానవుడు సంఘజీవి . నిత్యమూ ఇతరులతో కలిసి మాత్లాడకపోతే జీవనం సాగదు. అంటే సమాజంలోని ఇతరులతో  తప్పనిసరిగా  సంబంధం పెట్టుకోక తప్పదు. అందుకే తోటివారితో మిత్రభావంతో మెలగాలి. స్నేహంగా ప్రవర్తించాలి. ఎదుటివారినుంచి నువ్వు ఏది ఆశిస్తావో దాన్ని నువ్వు కూడా ఎదుటివారికి చేస్తే స్నేహం పదికాలాలపాటు మనగలుగుతుంది. స్నేహం పలుసందర్భాల్లో ఏర్పడవచ్చు. పరిసరాలవల్ల, విద్యాభ్యాసం చేసేటప్పుడు, ఉద్యోగ నిర్వహణలో, ప్రయాణాల్లో  స్నేహాలు కలుగవచ్చు. అయితే కొన్ని స్నేహాలు తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించి ఆ తర్వాత కొనసాగపోవచ్చు. మరికొన్ని స్నేహాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. కేవలం ప్రయోజనం కోసం  స్నేహం చేయ్యటం మంచిదికాదు.

స్నేహం వల్ల ప్రయోజనాలు కలిగినప్పుడు వాటిని అనుభవించటంలో తప్పులేదు. తెలివిగలిగిన స్నేహితుదు దొరికితే మన మనస్సు కూడా పదునెక్కుతుంది. మిత్రుడు శబ్దాలను చక్కగా ఉచ్చరించగలిగేవాడైతే మన ఉచ్చారణని మార్చుకొని సుశబ్ద ఉచ్చారణ చెయ్యగలుగుతాము. మంచివారితో స్నేహం చేస్తే వారిలాగే  పుణ్యకారాలను చెయ్యగలుగుతాము. మంచి మిత్రుడు మనకుంటే సమాజంలో మన గౌరవమూ పెరుగుతుంది. శ్రీకృష్ణుడులాంటి మిత్రుడు లభించటం వల్ల పేదవాడైన కుచేలుడు పురాణపురుషుడయ్యాడు. నవంతుడయ్యడు, కీర్తివంతుడయ్యడు. అవసరమైన సమయంలో దుర్యోధనుడులాంటి మిత్రుడు లభించటంతో కర్ణుని ప్రతిష్ఠ పెరిగింది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాడు. అయితే అతడు సాధుమిత్రుడు కాకపోవటంతో కర్ణుడు పతనమయ్యడు. అందుకే సాధుజనుల చెలిమిని మాత్రమే కోరుకోవాలి. చెడ్డజనుల చెలిమి తాత్కాలిక ప్రయోజనాన్ని చేకూర్చినా శాశ్వత దుష్కీర్తి మిగులుతుంది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

సేవ ఎందుకంటే

Posted on జూన్ 9, 2009. Filed under: సేవ | ట్యాగులు:, |

మన జీవితములో అనేక వేలమంది సహాయ సహకారములు పొందుతున్నము. ఇతరులకు ఎల్లవేళలా సహాయపడుతూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. ఇతరులకు సహాయపడాలన్న కోరికతో వీలైనంత సేవచేయటములో ఆత్మానందం లభిస్తుంది. ఈ సేవలు ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో చేసినప్పుడే దైవప్రీతిని పొందగలము. అసలైన సంఘసేవకు కావలసిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం అప్పుడే లభిస్తాయి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

సేవలోనే ఆనందం

Posted on జూన్ 8, 2009. Filed under: సేవ | ట్యాగులు: |

మీచే సేవలందుకొనే వారిని మీ నిజస్నేహితులుగా భావించు. అదే నిన్ను భవష్యత్తులో వెలుగులోనికి తీసుకొని పోతుంది. దర్పాన్ని, అహంకారాన్ని, అధికారాన్ని, అసూయను, అనుమానాన్ని సేవాలో ప్రవేశపెట్టరాదు. వ్యక్విగత సేవలకంటే సామాజిక సేవలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ప్రతివారూ సేవలో పాల్గొనాలి. సేవకుడే నాయకుడైననాడు ప్రపంచం అభివృధ్ది    చెందుతుంది.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...