మిస్టర్. అంతరాత్మ

Posted on జూన్ 24, 2012. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , |

నా తెలుగు బ్లాగుపై నాకు మక్కువ ఎక్కువ. ఈ బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో, వదలకుండా టపాలు ప్రచురించాలని తలచేవాడిని. కాని అలా జరగలేదు. అనుకున్నదొక్కటి, జరిగినదొక్కటి. అలా అని చింతిస్తూ కూర్చుంటే మటుకు ఏది జరగదు గనక, సరదాగా ఓ టపా వ్రాయాలని అనుకున్నాను. మంచి ఆలోచనే. కాని దేని గురించి వ్రాయాలి?నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. నా అంతరాత్మ నేను జరిపిన సంభాషణ గురించి వ్రాద్దామని నిశ్చయించుకున్నాను.

నేను సరాసరి ఐ.టి. ఉద్యోగిగా మారిపోయాను. అందులోనూ నేను ఎంతగానో ఎదురు చూసిన పదోన్నతి, జీతంలో హెచ్చు రెండింటినీ పొందలేదని కాస్త మనస్తాపానికి లోనయాక, ఏంటి నా జీవితం, నాకు ఏమి జరుగుతున్నది అని ఆలోచిస్తున్న ఒకానొక తరుణంలో, నా అంతరాత్మ నా ఎదుట ప్రత్యక్షమై ‘ ఒరేయ్. ఓ.యస్. గా .. తెగ ఫీలవకు.. ఏదో లోకంలో నీకొకడికే అన్నీ కష్టాలు వున్నటు. ఈ భవసాగరాన్ని నీవొకడివే ఒంటరింగా ఈదుతున్నట్టు, మిగిలినవాలందరు కష్టమంటే తెలియకుండా దర్జాగా కాళ్ల మీద కాలేసుకొని జీవిస్తున్నటు అనుకోకు… ఈ సినిమా కష్టాలు, నిజంగా అసలు కాష్టాలే కావు. ముందు లేచి నిలబడు. బాగా శ్వాస తీసుకో. రోజు త్వరగా నిదురలేచి, కాసంత కసరత్తు చేసి, మూడేళ్లలో నీవు చాలా శ్రద్దగా పెంచిన బొజ్జను తగ్గించు. మంచి సాహిత్యం చదువు. సంగీతాన్ని ఆస్వాదించు. వీలైతే సినిమాలు చూడడం తగ్గించు… బాగు పడతావు’ అని చెప్పింది.

‘అన్నయ్య’ చిత్రంలో చిరంజీవికి అతని అంతరాత్మ సూచనలు ఇచ్చినట్టు, నా అంతరాత్మ కూడా నాకు ఎంతో ప్రేమగా సూచనలు ఇస్తే నేను వాటిని పాటించకుండా వుంటానా చెప్పండి. మీకు కూడా మీ అంతరాత్మతో కలిసి మాట్లాడే అవకాశం దొరకాలని కోరుతున్నాను. మీ అంతరాత్మ కలిస్టే గనక, మీ ముచ్చట్ల విశేషాలు నాతో ఇక్కడ తప్పక పంచుకోండి.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...