అర్జునుడు.. మిస్టర్ డేనీ ఓషన్..

Posted on ఆగస్ట్ 31, 2013. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , |

మహా భారతంలోని మన అర్జునుడికి, హాలివుడ్ చలన చిత్రం Ocean’s Eleven లోని డేనీ ఓషన్, వీరిరువురికి ఒక సమానత వున్నది. అది లక్ష్యంపై చెదరని దృష్టి.

గురువు చెట్టుపై వేలాడదీసిన పక్షి బొమ్మ యొక్క కన్ను లక్ష్యమని చెప్పి, దాన్ని బాణంతో ఛేదించమంటే, శిష్యులందరిలో ఒక్కొకరికి ఆ పక్షి కన్నుతో పాటు పక్షి శరీరం, చెట్టు కొమ్మలు, ఆకాశం ఇంకా ఎన్నెన్నో కనిపించాయి. కానీ అర్జునుడికి మాత్రం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించింది. అతని దృష్టి పక్షి కన్నుపై కాకుండా, మరే దాని మీదకు మారలేదు. గురువు సెలవిచ్చిన లక్ష్యాన్ని ఛేదించగలిగాడు.

Ocean’s Eleven లోని ఒక సన్నివేశం. బెనిడిక్ట్ ను దోచుకోవాలని నిశ్చయించుకున్న ఓషన్, అతని ప్రతి కదలికను అనుసరిస్తూ వుంటాడు. బెనిడిక్ట్ లాస్ వేగాస్ లోని తనకు చెందిన ఒక పాత హోటల్ భవంతిని కూల్చి, దాని స్థలంలో ఒక క్రొత్త భవంతిని కట్టడానికి నిర్ణయించి, దాన్నిబాంబులతో కూల్చేటప్పుడు, భవంతి ఎదుట ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాడు. బెనిడిక్ట్ ఆ సభలో రంగస్తలంపై నిల్చోని వుంటాడు. ఆ సభలో ఓషన్ మరియు, ఓషన్ కదలికలను మర్మంగా కనిపెడుతున్న అతని బృంద సభ్యుడు లినస్ కూడా వుంటారు. బాంబును పేల్చడానికి ట్రిగర్ ను నొక్కిన క్షణంలో, సభలోని అందరూ కూలుతున్న భవంతిని చూడడానికి వెన్నకి తలలు తిప్పుతారు, కానీ ఓషన్ మరియు లినస్ ల చూపులు మాత్రం మరలదు. ఓషన్ చూపు బెనిడిక్ట్ పై మరియు లినస్ చూపు ఓషన్ పై అలాగే వుంటుంది. చలించని దృష్టి అంటే అది. చిత్రం చివర సన్నివేశంలో ఓషన్ మరియు బృందం బెనిడిక్ట్ ను నిలువునా దోచుకుంటారు.

లక్ష్యం పైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించాక కలిగే తృప్తి మరియు ఆనందం, మరెందులోనూ పొందలేమనే నా భావన. కొన్ని కచ్చితమైన లక్ష్యాలను ప్రస్తుతం వుంచుకొని దాని వైపు కృషి సల్పుతున్న వారు మరియు గతంలో లక్ష్యం నెరవేర్చుకున్న వారు, నా భావనతో ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

మౌనానందం

Posted on నవంబర్ 5, 2009. Filed under: ఆధ్యాత్మికం, సూక్తి రత్నావలి | ట్యాగులు:, , , , , , , , , , , , , , |

నేను మౌనం యొక్క గొప్పతనాన్ని నా వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొన్నీమధ్య నేను ఓ పుస్తకం చదువుతుండగా, అందులో  శ్రీ సత్య సాయి  బాబా వారు మౌనం వలన ఆనందం పొందగలుగుతామని వివరించు ఉపదేశం నాకు తారసపడింది. ఆ దివ్యోపదేశాన్ని మీతో పంచుకోదలచాను.

మౌనం మీ జన్మ హక్కు. దీనిలోనుండి మహత్తర శక్తిని, ఆనందాన్ని అనుభవించడం మీ జీవితాశయంగా మారాలి. పుట్టిన పిల్లాడు ఏం మాటలు మాట్లాడుతున్నాడని ఆనందంతో కేరింతలు కొట్టగలుగుతున్నాడు? అప్పటి ఆ స్థితిని చూస్తే మనకెంత ఆనందం కలుగుతుందో కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఆ పసిముఖంలో ఆనందం పెరిగి పెద్దదైనాక లోపిస్తుంది. పెరిగినకొద్దీ ప్రపంచంలో ఉన్న సొత్తంతా నా ఒక్కడిదే అనే మోహంతో కూరుకుపోతున్నారు. మీలోని కోరిక కొండంత పెరిగేసరికి మీలోని ఆనందం తగ్గుతూ అహంకారం పెరుగుతుంది. పుట్టగానే కంటిముందున్న తల్లి నా స్వంతమనుకొని అహంకరించడం మొదలు పెడతాడు. తర్వాత ఇల్లు నా సొంతమనుకుంటాడు, తర్వాత పెళ్ళాం, పిల్లలు, ప్రపంచం అంతా నాదే అనే‌ అహంకారం పెంచుకుంటూ పోతాడు. ఇవన్నీ ఇతన్ని చీత్కరించి దూరమైతే అప్పుడు అంతర్ముఖమై వాటినన్నింటిని వదిలించుకొని తనలోనే దాగొని ఉన్న అంతర్యామే తన సొంతమని గుర్తించి దానినుండి అంతటి మహత్తర ఆనందాన్ని పొందుతూ కేరింతలు కొట్టగలుగుతున్నారు. ప్రపంచం మిద మోహాలు పెంచుకోకుంటే మీరూ అట్టి ఆనందాన్నే పొందగల్గుతారు. మీ జన్మను వ్యర్థపు సంచిలా తయారు చేస్తున్నారు. పనికిరాని చెత్తంతా నింపి, అసలు పనికివచ్చేదాన్ని అడుగున పెట్టేస్తున్నారు. అందుకై మౌనంగా ఉండి మీలో నింపిన వ్యర్థపదర్థాలనన్నింటినీ బయటకు నెట్టేయండి. దీనిద్వారా మహత్తరమైన ఆత్మశక్తి మీకు అందుతూ అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అందుకే పసిపిల్లల మౌనంలో, మంచి సాధకుల మౌనంలో ఆనందం వెల్లువలై పొంగుతూ ఉంటుంది. ఇకనైనా మౌనంలోని ఆనందాన్ని చవిచూస్తూ మీలోని దైవాన్ని కనుగొనండి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!

Posted on ఆగస్ట్ 18, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |

క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను.

తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, సి.డి.లు తయారీకి అయ్యే ఖర్చులు ప్రవాసాంధ్రులు అందజేస్తారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెపుపుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్త చదివాక, ప్రవాసాంధ్రులకు మన మాతృభాష మీద ఉన్న మమకారాన్ని చూచి ఆనందించాలా లేక ఆంధ్ర రాష్ట్రంలోనే వుంటూ మన తెలుగు దినపత్రికలను కూడా చక్కగా చదవలేని నేటి తరాన్ని చూచి సిగ్గుపడాలా అనే సంధిగ్ధంలో పడ్డాను.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

జీవితం చాలా అందమైనది

Posted on జూలై 31, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యాను.ఆ సమయంలో నాకు ‘జీవితం చాలా అందమైనది’ అని అన్పించింది.

అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల  సమ్మేలనం:
ప్రాణంవెలకట్టలేనిది
భాందవ్యాలుమనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….

ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.

“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా   అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.

ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ‌ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 8 వ్యాఖ్యలు )

నిన్ను నీవు తెలుసుకో!

Posted on జూలై 17, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, , , , , , , , , |

ఈనాడు లోకములో ‘నాకన్నీ తెలుసున’ని విఱ్ఱవీగే  వెఱ్ఱివ్యక్తులు ఎందరో ఉన్నారు. కాని, వారిలో ఒక్కరైనా ఆనందమునకు నోచుకోలేకపోతున్నారు. అన్నీ తెలిసిన వారైతే ఆనందమునకు ఎందుకు దూరము కావలెను? పరమానందయ్య  శిష్యులలో ఎన్నిసార్లు లెక్కించినా ఒక్కడు తక్కువగా ఉన్నాడనే కథను మనము వినే ఉంటాము. ఆ‌ఒకడు ఎవడంటే తనను తాను మరచినవాడే. మానవుడు తన నిజతత్త్వమును తాను గుర్తించక అన్నీ తెలుసుకొన్నవాడుగా తయారైతే ఫలితము లేదు. మొదట తనను తాను గుర్తించుకొనే ప్రయత్నము పూనుకోవలెను. దీనికే ఆధ్యాత్మిక మార్గమని పేరు. దేనిని మరచి పోవలెనో దానిని మరచినప్పుడే ఆనందము ప్రాప్తిస్తుంది. అంతవరకు ఈ ప్రకృతిలో ఎన్ని రకముల కర్తవ్య కర్మల నాచరించిననూ ఆనందము ప్రాప్తించదు. మనము మరచిపోవలసినదేమిటి? చేరవలసిననది దేనిని? ‘అసతో మా సద్గమయ’, ‘తమసో మా జ్యోతిర్గమయ’, ‘మృత్యోర్మా అమృతంగమయ’ అని ప్రాచీన ఋషులు ప్రార్థించినారు. ‘అసత్తు’ అయిన జగత్తును మరచిపోవలెను. ‘తమస్సు’ అయిన అహంభావమును వదలవలెను. బ్రహ్మతత్త్వమైన అమృతత్వమును చేరవలెను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 10 వ్యాఖ్యలు )

వాదోపవాదాల కాలక్షేపం వద్దు

Posted on జూన్ 17, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , |

వాదోపవాదాలు-గొడవలుచాలా మామూలు సంభాషణతో మొదలయి, వాదనగా మారి .. చివరికి గొడవగా పరిణమించే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవైకవేద్యమే. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులమధ్యనో, స్నేహితులమధ్యనో బయటిప్రపంచం వ్యక్తులతోనో అనుభవంలోకి రావచ్చు.

వాదోవవాదాలు లేకుండా ఉంటాయా?

మాట నేర్చిన మనిషి ఎంత కాదనుకున్నా ఈ ‘వాదోపవాదాల’ సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అతను ఉపయోగించాల్సిందల్లా గొడవదాకా దారితీయకుండా చూసుకునే తనదైన ‘విద్వత్తు’ను.

సంభాషణ నుంచి వాదనకు మన మాటతీరు ఎలా మారింది? అన్నది మనం జాగ్రతగా గమనించాల్సి వుంటుంది. ఈ రెండోదశలో సాధ్యమయినంతవరకూ ఆగిపోవాలి. అంతేకాదు వాదనలో‌ గెలుపు, ఓటమి అనే మాటల మీద పెద్ద పట్టింపును కూడా చూపవద్దు.

ఇంగ్లీషులో ఒక మంచి మాట ఉంది…ఆ మాట అర్థం “వాదనలో గెలిచే ప్రతిసారీ నువ్వో మిత్రుణ్ణి పోగొట్టుకుంటున్నావని గుర్తుంచుకో”. ఆ మాటా వాదనలో గెలుపు, ఓటమి అనే మాటలు ఎంత నిరర్థకమైనవో చెప్పకనే చెప్పింది కదూ?!

గొడవలతోనూ, వాదనలతోనూ సాధించేది ఎప్పుడూ తక్కువే

మన స్థాయిని, మన భవిష్యత్ లక్ష్యాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే మన ఇతరులతో వాదోపవాదాలకో, గొడవలకో తలపడితే బావుంటుంది. పెద్ద నష్టం ఉండదు కూడా. అలా చేసిన మీకే నష్టం రాదనితెలిసినా మీరు గొడవలకు, వివాదాలకు మీ సమయాన్ని వెచ్చించకపోతే మరింత గొప్పజీవితానికి, ఉన్నత లక్ష్యాలకు చేరువ కావచ్చుకూడా.

గొడవలకు దారిచూపేది ఎప్పుడూ అహంభావమే

ఇతురులకన్నా అధిక్యులమన్న భావనవల్లనో, లేదా మనదైన ఉనికికి ప్రత్యేకత కావాలని కోరుకోవడంతోనో ‘గొడవ’ అనే విషవృక్షానికి బీజం పడుతుంది. ఎలాగంటారా? పై విధంగా ఆలోచించే మనిషి తన ఆలోచనలకు భిన్నంగా కనిపించిన దేన్నీ సహించలేడు. వాదానికి దిగుతాడు. తనను తాను నిరూపించుకోవడం  కోసం గొడవకు సైతం సిధ్దపడతాడు.

అహంభావాన్ని త్యజించమని చెప్పడం సన్యాసి మాటలాగా ధ్యనించవచ్చేమో కానీ, మిమ్మల్ని అపరిణతమనస్కులుగా బయటి ప్రపంచానికి చూపే మీ అహానికి సరైన సమయంలో, సరైన రీతిలో కళ్లేలు బిగిస్తుండండి అనడం మటుకు చాలా సాధ్యమయ్యే పనే.

కొన్ని చిట్కాలు

౧. అనవసర వాదనలకు ఎప్పుడూ దిగకండి. వాదనలో గెలవడం చెప్పుకోదగ్గ ‘విద్వత్తు’ ఏమీ కాదు.

౨. ఎవరితో వాదిస్తున్నారో బాగా గుర్తుంచుకోండి. ఆత్మీయులతోనూ, మంచిమిత్రుడితోనూ అయితే మరింత జాగ్రత్తగా మాటలను ఉపయోగించండి. మీరు వాదనలో గెలిచే ప్రతిసారీ ఒక మిత్రుణ్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.

౩. అల్పవిషయాల కోసం, అసంగతమైన కోరికల వెంపర్లాటతోనూ ‘గొడవ’ పడుతూ అందమైన జీవితాన్ని వికృతంగా మార్చుకోకండి.

౪. మీరు వాదోపవాదాలకు దిగరు. తార్కికంగానే ఆలోచిస్తారు. అయినా ఎదుటివాళ్లు అలా లేనప్పుడు గొడవలు వస్తాయి కదా…. అప్పుడు ఏం చేయాలంటారు? ఈ ప్రశ్నకు అబ్రహం లింకన్ జవాబిది… “ఎదురుగా వచ్చే శునకానికి మీరే దారి ఇవ్వండి. అంతేగానీ అదే పక్కకు తొలిగిపోవాలని ఆశించవద్దు”.

౫. అనవసరమైన వాదనల వల్ల, గొడవల వల్ల సమయం వృధా అవుతుంది. మానసికంగా కుంగిపోయే ప్రమాదం వుంటుంది. శారీరకంగా జబ్బులబారిన పడవచ్చు. అవన్నీ ఒక ఎత్తు. అందివచ్చే అవకాశాలను గుర్తించలేని అంధత్వంతో జీవితంలో మనం చాలా పోగొట్టుకునేవారమూ కావచ్చు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

ఆనందో బ్రహ్మ

Posted on జూన్ 8, 2009. Filed under: ఆధ్యాత్మికం | ట్యాగులు:, |

పుట్టపర్తి  సత్యసాయిబాబాను వేలాదిగా, లక్షలాదిగా జనం ఆయన చుట్టూ ఒక తన్మయీభావంతో తేలిపోతూ ఉంటారు. వారిని ఆయన చిరునవ్వుతోనూ, ‘బంగారూ ‘ అన్న  పలకరింపుతోనూ  పరామర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. ఈ మొత్తం క్రమంలో ఎక్కడలేని నింపాదితనం, ప్రశాంతత, ఆనందం, ఆయన మొహంలో కనిపిస్తుంటుంది. ఆయన ఒకానొక పుట్టినరోజున లక్షాలాదిమంది భక్తులు ఒక్కసారి  ‘హాపీ బర్తడే బాబా’ అంటూ విషెస్ చెప్పారు. తెల్లరినప్పటి నుంచి ఇదే తంతు జరుగుతోందని ఆయన సభలో చెబుతూ “ఈ రోజు ప్రత్యేకించి ‘హాపీ’ ఏంటి? ఐ యాం ఆల్వేస్ హాపీ. నేనెప్పూడు సంతోషంగానే ఉంటాను. ప్రత్యేకించి ఫలానా రోజునో, ఫలానాది సాధించిన రోజునో సంతోషంగా ఉండటమన్నది నాకు తెలియని విషయయం” అన్నరు. అదే ఉపన్యాసంలో మనిషి ఏడుపుగొట్టుతనాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. “అసలు మనమెందుకు పుట్టాం. ఏడుపుకోసం  పుట్టామా? పుట్టినప్పుడు ఏడుపులు. చచ్చినప్పుడు ఏడుపులు . బతుకుతూ ఏడుపులు. ఏడుపుల కోసం ఏడుపులు. చిత్తన్ని ఒక విషయం మీద ఏకాగ్రతతో నింపి చూడండి. మీకు ‘ఆనందోబ్రహ్మా ‘ అనుభవంలోకి వస్తుంది . ఎప్పుడూ సంతోషంగా ఉండటమన్నది అందరికీ సాధ్యమే. బాహ్యవిషయాలేవీ మనల్ని ప్రభావితం చెయ్యలేవు. బాహ్యవిషయాలపట్ల అతి స్పందనే మనల్ని విచారంలోకి, కోపంలోకి, బాధలోకి నెడుతుంటుంది. ప్రశాంతంగా ఉండండి. ప్రేమ భావనలకు మనసులో చోటివ్వండి. సాటిమనిషికి సేవచేయాలనే ధ్యేయన్ని కలిగివుండండి. ప్రపంచంలోని ఏ ఏ మూలల్నుంచోనాదగ్గరకు నస్తుంటారు. నేను అందరికీ చెప్పేదొకటే ఆనందం, ప్రశాంతత మనసులోనే ఉంటుంది . వాటిని వెదికి పట్టుకోండి. వ్యర్థప్రయాసలు పడకండి” అంటూ ఆ పుట్టినరోజు సత్యసాయి తనప్రసంగాన్ని కొనసాగించారు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

Liked it here?
Why not try sites on the blogroll...