మిస్టర్. అంతరాత్మ

Posted on జూన్ 24, 2012. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , |

నా తెలుగు బ్లాగుపై నాకు మక్కువ ఎక్కువ. ఈ బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో, వదలకుండా టపాలు ప్రచురించాలని తలచేవాడిని. కాని అలా జరగలేదు. అనుకున్నదొక్కటి, జరిగినదొక్కటి. అలా అని చింతిస్తూ కూర్చుంటే మటుకు ఏది జరగదు గనక, సరదాగా ఓ టపా వ్రాయాలని అనుకున్నాను. మంచి ఆలోచనే. కాని దేని గురించి వ్రాయాలి?నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. నా అంతరాత్మ నేను జరిపిన సంభాషణ గురించి వ్రాద్దామని నిశ్చయించుకున్నాను.

నేను సరాసరి ఐ.టి. ఉద్యోగిగా మారిపోయాను. అందులోనూ నేను ఎంతగానో ఎదురు చూసిన పదోన్నతి, జీతంలో హెచ్చు రెండింటినీ పొందలేదని కాస్త మనస్తాపానికి లోనయాక, ఏంటి నా జీవితం, నాకు ఏమి జరుగుతున్నది అని ఆలోచిస్తున్న ఒకానొక తరుణంలో, నా అంతరాత్మ నా ఎదుట ప్రత్యక్షమై ‘ ఒరేయ్. ఓ.యస్. గా .. తెగ ఫీలవకు.. ఏదో లోకంలో నీకొకడికే అన్నీ కష్టాలు వున్నటు. ఈ భవసాగరాన్ని నీవొకడివే ఒంటరింగా ఈదుతున్నట్టు, మిగిలినవాలందరు కష్టమంటే తెలియకుండా దర్జాగా కాళ్ల మీద కాలేసుకొని జీవిస్తున్నటు అనుకోకు… ఈ సినిమా కష్టాలు, నిజంగా అసలు కాష్టాలే కావు. ముందు లేచి నిలబడు. బాగా శ్వాస తీసుకో. రోజు త్వరగా నిదురలేచి, కాసంత కసరత్తు చేసి, మూడేళ్లలో నీవు చాలా శ్రద్దగా పెంచిన బొజ్జను తగ్గించు. మంచి సాహిత్యం చదువు. సంగీతాన్ని ఆస్వాదించు. వీలైతే సినిమాలు చూడడం తగ్గించు… బాగు పడతావు’ అని చెప్పింది.

‘అన్నయ్య’ చిత్రంలో చిరంజీవికి అతని అంతరాత్మ సూచనలు ఇచ్చినట్టు, నా అంతరాత్మ కూడా నాకు ఎంతో ప్రేమగా సూచనలు ఇస్తే నేను వాటిని పాటించకుండా వుంటానా చెప్పండి. మీకు కూడా మీ అంతరాత్మతో కలిసి మాట్లాడే అవకాశం దొరకాలని కోరుతున్నాను. మీ అంతరాత్మ కలిస్టే గనక, మీ ముచ్చట్ల విశేషాలు నాతో ఇక్కడ తప్పక పంచుకోండి.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( 6 వ్యాఖ్యలు )

తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ

Posted on ఆగస్ట్ 24, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , |

అసెంబ్లీ

కనీ వినీ ఎరుగని రీతిలో మన ఆంధ్ర ప్రజల సంతోషం కొరకు, భారి బడ్జెట్‌తో మన ప్రభుత్వం మనకు సమర్పిస్తున్న మెగా సిరియల్……

పేరు : అసెంబ్లీ

ప్రసారం : అన్నీ వార్తా ఛానళ్లు (live & exclusive)
అన్నీ తెలుగు ఛానళ్లు(exclusive)
దిన పత్రికలు

సమయం :‌ కచ్చితముగా చెప్పలేము ( ఒకవేళ మొదలైనా నిరసనలు మరియు వాకౌట్‌ల వల్ల  ఆగిపోవచ్చు)

నిర్మాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దర్శకుడు : గౌ॥స్పీకరు గారు

తారాగాణం :
హీరో : డా॥వై.యస్.రాజశేఖర్ రెడ్ది
విలన్ : నారా చంద్రబాబు నాయుడు
(గమనిక: హిరో మరియు విలన్ ప్రతీ ఐదు సంవత్సరములకు ఒకమారు  మారుతూవుండవచ్చు.)
సైడ్ హీరో/విలన్ : మెగాస్టార్ చిరంజీవి
ముఖ్య పాత్రధారులు : మంత్రులు, ప్రతి పక్ష నాయకులు మరియు లోకసత్తా వ్యవస్థాపకులు డా॥జే.పి గారు
అతిథి పాత్రలలో : మంత్రి పదవి రాని MLAలు మరియు ప్రతి పక్షంలో కొందరు.

కథ:
మొత్తం కథను ఇక్కడ ప్రస్తావించడం చాలా కష్టం. సర్వర్లలలో స్థలభావం చోటుచేసుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఎన్నికలలో ఓటు వేసి ఎన్నుకున్నవారు, అసెంబ్లీలో WWFలో మాదిరి కుమ్ముకోవటం(వాళ్లలో వాళ్లను కుమ్ముకోవటం కావచ్చు, లేక వారికి అనుకూలముగా బిళ్లులను పాస్ చేసి, చట్టాలను రూపొందించి  ప్రజల డబ్బును కుమ్మటం కావచ్చు).

కృతజ్ఞతలు:
రాష్ట్ర ప్రజలు – ఈ  తానా తందానాలను; గానా భజానాలను రూపొందిచడానికి పన్ను రూపంలో డబ్బులిచ్చి సహకరిస్తునందుకు, ఓట్లు వేసి మరి తారాగాణాన్ని ఎన్నుకున్నందుకు, అతి ముఖ్యముగా ఇంత కర్చుచేసి కూడా ఈ సీరియల్‌ను వీక్షించనందుకు.

ఇది

మన రాష్ట్ర ప్రజల సౌజన్యముతో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి  సమర్పణ

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 14 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...