దాగుడుమూత

Posted on నవంబర్ 7, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , |

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనము దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది…

జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నను లేకున్నను.. మనము ఆ ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవగలగడం, కోరిన వస్తువులను పొందగలగడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత…

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముతాటే ..

మధ్య వయస్కుడు తాను ఊహించిన విన శైలిలోనే బ్రతక గలగడం.. జీవితం మనతో ఆడే దాగుడుమూతే….

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక.. వారి మధ్య వుంటూ.. మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా.. జీవితం మనతో ఆడుకునే దాగుడుముట ఆటలోని భాగమే…

చిత్రకథనాలలో మలుపులు లేకుంటే, ఆ చిత్రము నీరసంగా ఎలా తయారవుతుందో.. జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితము మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, చక్కగా ఆడితే.. గెలుపు మనదే…

అయినా అన్నీ మనము తలచిన విధముగానే సాగితే.. జీవితములో కిక్ ఏముంటుంది చెప్పండి…

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

ప్రతి నరుడు – ఓ నటుడు

Posted on జూలై 30, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, నా విసుర్లు | ట్యాగులు:, , , , , |

రంగస్థలంపై నటించిన వారిని అందరు చూస్తారు. ఆ నటుల అభినయాన్ని అభిమానించేవారు వారు కొందరైతే, ఆరాధించేవారు కొందరు. వ్యాఖ్యానించేవారు కొందరైతే, ఆక్షేపణ తెలిపేవారు కొందరు. వెండితెర నటులుపై ఎన్నో రచనలు, బ్లాగులలో టపాలు వున్నాయి. వాటికి భిన్నంగా రోజూ మన చుట్టూ వుండే నిజ జీవిత నటుల గురించి ప్రస్తావించాలని నేను నిశ్చయించాను.

ఈ నిజ జీవిత నటులు ఎవరని అలోచిస్తున్నారా?! ఈ భువిపై నివసించే ప్రతి నరుడు, నటుడే. వెండితెరపై అందరు మెరవలేరు, కాని జీవితం అనే రంగస్థలంపై తమ అభినయ ఛాతుర్యాన్ని ప్రదర్శించి తళ్ళుక్కుమన్నవారు కోకొల్లలు. మన చుట్టూ వున్న వారు ఎలా నటిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక్క రోజు వెచ్చించండి. ఆ ఒక్క రోజు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించండి. అప్పుడు మీకు తెలిసిన వారు, మీతో కలియతిరుగుతున్న వారు ఎలా నటిస్తున్నారో, ఎందుకు నటిస్తున్నారో తెలుస్తుంది.

అందరూ ఎల్లాప్పుడు నటించరు. నా వుద్దేశంలో నటించడం అంటే, ఒక వ్యక్తి తను తానులా ప్రవర్తించక  కాస్త లేక పూర్తి భిన్నంగా ప్రవర్తిచడం. మనకు తెలిసో తెలియకో మనము కుడా ఇటువంటి పనిని ఎన్నో మార్లు చేసి వుంటాం. ఇటువంటి నటన సబబేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం ఎంతో కష్టము. ప్రతి వొకరికి, వారి కారణాలు అవసరాలు వుంటాయి. వాటిని తప్పుబట్టలేం, అలాగని ఎల్లప్పుడు స్వీకరించలేం. మనకు హాని కలగనంత వరకు, వాటిని అంగీకరిస్తాం. అలా కాని పక్షాణ, వాటికి తిరస్కరిస్తాం. మనుషుల పలు సహజమైన ప్రవర్తనలలో ఇదొకటి.

మీలోను ఒక నటుడు/నటి ఉన్న వాస్తవం మరవకండి. ఈ క్షణం నుండే మీ నటనా చాతుర్యాన్ని సానబెట్టండి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

వింత జీవితం

Posted on జూన్ 29, 2011. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , |

అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి… ఇది ఎప్పుడూ ఉన్నటువంటి తంతేగా?! మీరు అవునని అన్నా, కాదని అన్నా, ఇది అంతే. జీవితం ఒక వింత.

మన చిన్ని గుండెకు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. కాని అన్నీ నెరవేరవు కదా. అది తెలియక చాలా మంది పేక మేడలు కట్టేస్తుంటారు. ఆ మేడ కూలడం ఖాయమని తెలిసినను, ఆ ప్రయత్నం విరమించుకోరు. తీరా, అది కూలిన తర్వాత నిరుత్సాహ పడటం తప్పటంలేదు. ఇది ఒక ఛత్రము వంటిది. ఇటువంటి ఛత్రాలు కోకొల్లలు. ఇది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితముగా అందరికీ జరుగుతూనే ఉంటున్నది. ‘ఎలా’, ‘ఎందుకు’ అనే వివరాలలోకి నేను వెళ్ళుటకు సాహచించను. కొన్నింటిని అలా వదలివేయటం మంచిది.

అనుకోకుండా కొందరిని కలుసుకుంటుంటాం; కొన్ని క్రొత్త అలవాట్లు చేసుకుంటుంటాం. మన ఇష్టాలతో పనిలేకుండా, మన ఆశలతో పొంతనలేకుండా, పలు సంగతులు మన జీవితంలో జరిగిపోతుంటాయి. అసలు ఎందుకలా జరుతుందని ఆలోచిస్తే సమాధానాలు దొరకవనే అనుకుంటున్నను.

మానవ జీవితంలో ఇన్ని వింతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో తెలియటం లేదు. కాని సమాధానము కోసం దేశాటనం చేయటం, దట్టమైన అరణ్యాలలో వణ్య మృగముల మధ్య కూర్చొని ధ్యానం చేయటం, పెళ్లి చేసుకోకుండా భోగ భాగ్యాలకు దూరంగా వుంటూ సాధన చేయటం నాకు చేతకాని పని. నాకు తెలిసినదంతా ఒక్కటే.. ఈ జీవితం చాలా వింతది. ఆ వింత ఎందుకని ఆరా తీసేవాడిని ఈ లోకం వింతగా చూస్తుంది. మరి మీరేమంటారు?!

టపా మొత్తం చదవండి | Make a Comment ( 1 so far )

బాల్యం returns (నా మదిలో….)

Posted on నవంబర్ 16, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

నా బాల్యము గడిచిపోయినదని మొన్న నాకు మరోమారు గుర్తుకువచ్చినది. మొన్న, నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా నేను చదివిన పాఠశాలకు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకు వెళ్ళాలన్న ఉద్దేశ్యం కూడా ఉన్నది కాదు. నా మిత్రుడు విద్యా సాగర్‌కు ఎంతైనా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉన్నది. అతనే నన్ను మా పాఠశాలకు తీసుకువెళ్ళాడు.

ఆ రోజు నాకు చాలా గుర్తుండిపోతుంది. నేను మా పాఠశాలలో‌ 10 సంవత్సరాల కాలం చదువుకున్నాను. ఇప్పుడు ఆ సంతోషకరమైన, నా జీవితంలో చాలా ఉపయోగకరంగా గడిపిన రోజులు గడచి సుమారు 7 సంవత్సరాలు కావస్తున్నది. అక్కడ బాలల దినోత్సవ సందర్బంగా జరుగుతున్న కార్యక్రమాలను చూస్తుంటే నా బాల్యం గుర్తుకువచ్చేసింది. మా కరస్పాండెంట్ మహేష్ రెడ్డి గారు నన్ను ఓ‌ మూలన నిల్చుని వుండగా గుర్తుంచి, ఎంతో ఆప్యాయంగా పలకరించి, నువ్వు ఇక్కడ వచ్చినది నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఇంకా మా అమ్మ ఎలా ఉన్నారని కూడా అడిగి తెలుసుకున్నారు. అంత పెద్ద సంస్థకు అధిపతి, క్షణం తీరికలేకుండా ఎప్పుడు ఏదో పనిగా వుండే ఆయన, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకొని నాతో మాట్లాడిన ఆ క్షణం నాకు క్రొత్తగా రెక్కలు మొలచి గాలిలో తేలినట్టు అనిపించినది.

నా పాఠశాల రూపురేకులు ఈ గడిచిన ఏళ్లలో‌ ఎంతో‌ మారిపోయింది. కాని, నేను చదివిన కక్షల గదులు నాకు ఇంకా గుర్తుకున్నది. మేము ఆటలాడుకున్న ఆ మైదానం ఇంకా నా మదిలో పదిలంగా ఉన్నది. అక్కడి టెంకాయ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడ నేను గడిపిన ఎన్నో మధుర స్మృతులను  జ్ఞప్తికి తీసుకువచ్చాయి. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు పలువురు ఇప్పుడు ఆ పాఠశాలలో లేరు. అయినా, వారు నాకు అందించిన పాఠాలు, నేర్పిన విలువలు, నాలో బాగా పాతుకుపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు నన్ను చూసి చాలా మురిసిపోయారు. నేను ఏమి చేస్తున్నానో అడిగి తెలుసుకున్నారు. నా ఉద్యోగ జీవితం బాగుండాలని, నేను బాగా వృద్ధి చెందాలని దీవించారు. ఓ టీచరమ్మైతే  “ఓరేయ్! చిన్న చిన్న లిల్లీపుట్ల లాగా ఉండేవారు మీరు, ఇప్పుడు నేను తలపైకెత్తి చూస్తేగాని మిమ్ములను పూర్తిగా చూడలేకున్నాను” అని అన్నారు. వారు మమ్ములను కేవలం శిష్యులలాగా కాక, తమ సొంత బిడ్డలుగా చూచేవారు. వారు నన్ను వారి బిడ్డలాగా చుసుకునేవారని కృషి చేస్తే ఏంటట టపాలో ఒక ఉదాహరణతో  వివరించాను. పదవ తరగతిలో‌ వున్నప్పుడు, మా పాఠశాలను మేము ఇక వదలి వెళ్ళాలనే విషయం జ్ఞప్తికి వచ్చినప్పుడంతా నాకు మిక్కిలి బాధేసేది. నా పాఠశాలను అంతగా ప్రేమించేవడిని నేను. నా ప్రస్తుత స్థితికి, నా పాఠశాల ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా పదేళ్లు అక్కడ గడిపాను. ఎంతో నేర్చుకున్నాను. దెబ్బలు తిన్నా అది నా బాగు కోసమే అని తెలుసుకున్నాను. నా వ్యక్తిత్వం చాలా వరకు రూపుదిద్దుకున్నది అక్కడే. అది నాకు దేవాలయంతో‌ సమానం. నా పాఠశాల గురించి ఒక ముక్కలో‌ ఆంగ్లంలో‌ చెప్పాలంటే “My school is my second home”.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు

Posted on నవంబర్ 9, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , |

నా గడిచిన జీవిత కాలంలో, నేను డబ్బుతో ముడిపడివున్న ఎన్నో సంఘటనలను గమనించాను. వాస్తవానికి మనకు తెలిసో తెలియకో మన జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ‌ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని.

ఈ‌ సత్యం జీర్ణించుకోవటానికి కాస్త కష్టంగానే ఉన్నా, నిత్య జీవిత ఘటనలను నిశిధంగా పరిశీలిస్తే ఇది బాగా అర్థమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము.

మనిషి కొరకు డబ్బు కావాలి, అంతే కాని డబ్బు కోసం మనిషి కాదు.
ఈ ప్రస్తుత జగత్తులో‌ డబ్బు మనిషిని శాసిస్తున్నదనే సత్యమును బాగా అర్థం చేసుకున్నప్పుడే, మనము డబ్బును శాసించగలుగుతాము. అంటే, మనము ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించగలమని కాదు. డబ్బును కాకుండా, ఆనందాన్ని మన జీవిత లక్ష్యంగా చేసుకొనుటలో కృతార్తులవుతాము.మన జీవితం మీద పూర్తి అదుపు, మన చేతులలోకి వస్తుంది.

ఈ సత్యం తెలియనంత వరకు, మన పరిస్థితి మన జీవితములో మనము దేనికోసము వెతుకుతున్నామో తెలియకుండా, నిరంతరం వెతుకుతుండదం వంటిది. మన లక్ష్యం ఏమని తెలియకపోతే మనము దానిని ఎలా పొందగలము. మీరు అనవచ్చు, ‘లేదయ్యా! నాకు జీవిత లక్ష్యం/లక్ష్యాలు లేదని ఎందుకు అనుకుంటావు?’ అని. అవి ఇల్లు కట్టడమో, సమాజంలో హోదా/పదవులు పొందడమో, సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించడమో, ఆస్తిని సంపదను కూడగట్టటమో, సమాజ సేవ కుడా కావచ్చు. మరి ఈ లక్ష్యాలను సాధించాలని మనము ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకంటే, వాటిని సాధిస్తే సంతృప్తి, సంతోషాలు కలుగుతాయని.

అంటే మనము తెలిసి/తెలియక ఏమి చేసినా, ఎన్ని చేసినా అదంతా మన  సంతోషం కోసమే. ఇది గనక మనము బాగా గుర్తుకుంచుకున్న పక్షాన వాటికి కావలసిన డబ్బును సంపాదిస్తాము. కాని, దాదాపు అందరూ ఆ డబ్బును సంపాదించే ప్రక్రియలో డబ్బుకు దాసులు అవుతున్నాము. మన అసలైన లక్ష్యమును మరచి, డబ్బే మన లక్ష్యంగా చేసుకుంటున్నాము. ఇదే మనలను తప్పుడు దారులకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నది, నేరములు చేయడానికి ప్రేరేపిస్తున్నది, అపకీర్తి పాలుచేస్తున్నది, మనలను బలహీనులను చేస్తున్నది, మన విచక్షణా జ్ఞానాన్ని హరింపజేస్తున్నది, ఆకరకు మన జీవితంలో సంతోషాన్నే లేకుండా చేస్తున్నది.

డబ్బు బాగా సంపాదించినా, ఏదో వెలితి, అసంతృప్తికి కారణము కూడా ఇదే. అందుకే ఈ‌ సత్యాన్ని బాగా అవగతం చేసుకుని, మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ‌ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము. ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 9 వ్యాఖ్యలు )

జీవితం చాలా అందమైనది

Posted on జూలై 31, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , |

ఈ రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతికి లోనయ్యాను.ఆ సమయంలో నాకు ‘జీవితం చాలా అందమైనది’ అని అన్పించింది.

అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల  సమ్మేలనం:
ప్రాణంవెలకట్టలేనిది
భాందవ్యాలుమనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….

ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.

“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా   అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.

ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ‌ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 8 వ్యాఖ్యలు )

మీ సత్తా గురుంచి మీకేపాటి ఎరుక?!

Posted on జూన్ 19, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |

Self Reliance is not about being independent, but interdependent.

రవీంద్రనాథ్ ఠాగూర్ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.

జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.

సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!


అలాంటి మనస్తత్వం మీలో‌ఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.

Being independent is not enough, be interdependent.

మీ గురుంచి కొన్ని విషయాలు:

౧. మీ గురుంచి మీరు బాగా  తెలుసుకోవడమన్నది జీవితానికి చాలా ఉపయోగపడే అంశంగా గుర్తించండి.
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 9 వ్యాఖ్యలు )

వాదోపవాదాల కాలక్షేపం వద్దు

Posted on జూన్ 17, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , |

వాదోపవాదాలు-గొడవలుచాలా మామూలు సంభాషణతో మొదలయి, వాదనగా మారి .. చివరికి గొడవగా పరిణమించే సందర్భాలు దాదాపు అందరికీ అనుభవైకవేద్యమే. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులమధ్యనో, స్నేహితులమధ్యనో బయటిప్రపంచం వ్యక్తులతోనో అనుభవంలోకి రావచ్చు.

వాదోవవాదాలు లేకుండా ఉంటాయా?

మాట నేర్చిన మనిషి ఎంత కాదనుకున్నా ఈ ‘వాదోపవాదాల’ సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అతను ఉపయోగించాల్సిందల్లా గొడవదాకా దారితీయకుండా చూసుకునే తనదైన ‘విద్వత్తు’ను.

సంభాషణ నుంచి వాదనకు మన మాటతీరు ఎలా మారింది? అన్నది మనం జాగ్రతగా గమనించాల్సి వుంటుంది. ఈ రెండోదశలో సాధ్యమయినంతవరకూ ఆగిపోవాలి. అంతేకాదు వాదనలో‌ గెలుపు, ఓటమి అనే మాటల మీద పెద్ద పట్టింపును కూడా చూపవద్దు.

ఇంగ్లీషులో ఒక మంచి మాట ఉంది…ఆ మాట అర్థం “వాదనలో గెలిచే ప్రతిసారీ నువ్వో మిత్రుణ్ణి పోగొట్టుకుంటున్నావని గుర్తుంచుకో”. ఆ మాటా వాదనలో గెలుపు, ఓటమి అనే మాటలు ఎంత నిరర్థకమైనవో చెప్పకనే చెప్పింది కదూ?!

గొడవలతోనూ, వాదనలతోనూ సాధించేది ఎప్పుడూ తక్కువే

మన స్థాయిని, మన భవిష్యత్ లక్ష్యాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే మన ఇతరులతో వాదోపవాదాలకో, గొడవలకో తలపడితే బావుంటుంది. పెద్ద నష్టం ఉండదు కూడా. అలా చేసిన మీకే నష్టం రాదనితెలిసినా మీరు గొడవలకు, వివాదాలకు మీ సమయాన్ని వెచ్చించకపోతే మరింత గొప్పజీవితానికి, ఉన్నత లక్ష్యాలకు చేరువ కావచ్చుకూడా.

గొడవలకు దారిచూపేది ఎప్పుడూ అహంభావమే

ఇతురులకన్నా అధిక్యులమన్న భావనవల్లనో, లేదా మనదైన ఉనికికి ప్రత్యేకత కావాలని కోరుకోవడంతోనో ‘గొడవ’ అనే విషవృక్షానికి బీజం పడుతుంది. ఎలాగంటారా? పై విధంగా ఆలోచించే మనిషి తన ఆలోచనలకు భిన్నంగా కనిపించిన దేన్నీ సహించలేడు. వాదానికి దిగుతాడు. తనను తాను నిరూపించుకోవడం  కోసం గొడవకు సైతం సిధ్దపడతాడు.

అహంభావాన్ని త్యజించమని చెప్పడం సన్యాసి మాటలాగా ధ్యనించవచ్చేమో కానీ, మిమ్మల్ని అపరిణతమనస్కులుగా బయటి ప్రపంచానికి చూపే మీ అహానికి సరైన సమయంలో, సరైన రీతిలో కళ్లేలు బిగిస్తుండండి అనడం మటుకు చాలా సాధ్యమయ్యే పనే.

కొన్ని చిట్కాలు

౧. అనవసర వాదనలకు ఎప్పుడూ దిగకండి. వాదనలో గెలవడం చెప్పుకోదగ్గ ‘విద్వత్తు’ ఏమీ కాదు.

౨. ఎవరితో వాదిస్తున్నారో బాగా గుర్తుంచుకోండి. ఆత్మీయులతోనూ, మంచిమిత్రుడితోనూ అయితే మరింత జాగ్రత్తగా మాటలను ఉపయోగించండి. మీరు వాదనలో గెలిచే ప్రతిసారీ ఒక మిత్రుణ్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.

౩. అల్పవిషయాల కోసం, అసంగతమైన కోరికల వెంపర్లాటతోనూ ‘గొడవ’ పడుతూ అందమైన జీవితాన్ని వికృతంగా మార్చుకోకండి.

౪. మీరు వాదోపవాదాలకు దిగరు. తార్కికంగానే ఆలోచిస్తారు. అయినా ఎదుటివాళ్లు అలా లేనప్పుడు గొడవలు వస్తాయి కదా…. అప్పుడు ఏం చేయాలంటారు? ఈ ప్రశ్నకు అబ్రహం లింకన్ జవాబిది… “ఎదురుగా వచ్చే శునకానికి మీరే దారి ఇవ్వండి. అంతేగానీ అదే పక్కకు తొలిగిపోవాలని ఆశించవద్దు”.

౫. అనవసరమైన వాదనల వల్ల, గొడవల వల్ల సమయం వృధా అవుతుంది. మానసికంగా కుంగిపోయే ప్రమాదం వుంటుంది. శారీరకంగా జబ్బులబారిన పడవచ్చు. అవన్నీ ఒక ఎత్తు. అందివచ్చే అవకాశాలను గుర్తించలేని అంధత్వంతో జీవితంలో మనం చాలా పోగొట్టుకునేవారమూ కావచ్చు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

సర్దుబాటు మనస్తత్వం కీలకం!

Posted on జూన్ 16, 2009. Filed under: వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, |

ఆధునిక జీవితంలో మనిషి సంతోషంగా జీవించాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇంకొన్ని సామాజిక పరమైన సమస్యలు, మరికొన్ని వృత్తిపరమైన సమస్యలు. అనేకమైన సవాళ్ళు, సమస్యలు ఎదురయ్యే  సమాజంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అనుకున్నట్లు మనచుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు ఉండవు. వాటికి తగ్గట్టుగా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. ‘Ability is something but test is everything’ అన్నారు. test అంటే మోసం కాదు. నైపుణ్యత, ఇతరులతో ఏ విషయం, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగి మన పని చేసుకోగలగడం. ప్రతి చిన్నదానికి కోపం, విచారం రాకుండా మనల్ని మనం కాపాడుకోగలగడం.

ఎన్ని సమస్యలు వున్నా సంతోషంగా జీవించాలని అనుకునేవారు కొన్ని పద్దతులు పాటించాలి.

* మంచి అలవాట్లు చేర్చుకోవడం, చెడ్డ అలవాట్లు మానుకోవడం
* స్వయం అభివృధ్ది  కోసం నిరంతరంగా కృషిచేయడం.
* మితంగా మాట్లాడడం, తినటం.
* అనవసర వత్తిళ్ళు తగ్గించుకోడానికి ప్రయత్నించడం
* స్వతంత్రంగా నిర్ణయాలు చేయగలగడం, ఆచరించడం
* పరిపక్వంగా ఆలోచించగలగడం, ఆచరించడం
*‌ పిల్లలను సక్రమంగా పెంచగలగడం
* తగినంత విరామం, వినోదం పొందడానికి ప్రయత్నించడం
* ఏదైనా టైం ప్రకారం ఒక పధ్దతిలో చేయగలగడం
* ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు గడపగలగడం
* ఏ సమస్యనైనా తేలికగా తీసుకోగల  మనస్తత్వం ఏర్పరచుకోగలగడం
* రోజూ కొంచెం  సేపు మౌనంతో ప్రార్థన చేసుకోగలగడం

ఇటువంటి రకరకాల పధ్దతులు పాటించడం వలన సంతోషంగా జివించగలగటానికి అవకాశం చాలా ఎక్కువ.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...