స్వర్గం – నరకం

Posted on అక్టోబర్ 2, 2012. Filed under: Uncategorized | ట్యాగులు:, , , , , , |

తొండంలో గ్రుచ్చుకున్న ముల్లు, ఎంతటి బలిష్ఠమైన ఏనుగునైనా గజ గజలాడించగలదు. మనసుకు తగిలే ముల్లులు కూడా, మనిషిని తికమక పెడుతుంది.  అందరూ ఏదో ఒక దశలో ఇటువంటి అనుభూతిని చవి చూసి  వుంటారు. జీవితం పూల బాట కాదుగా, పూలతో కూడిన ముల్లులు కూడా వుంటాయి.

‘ఆ నలుగురు’ చిత్రంలో ‘దుఃఖంలో వుండడం అంటే నరకం, సుఖాన్ని ఆస్వాదించడం అంటే స్వర్గం’ అని ఒక పాత్ర చాలా చక్కగా చెప్పాడు. మనిషికున్న సహజ సిద్ధ స్వభావం చేత దుఃఖాన్ని అధిగమించి బయట రావడం కష్టతరమే. దుఃఖంలో మునిగి వుండడం కన్నా, ఆ స్థితిలో మనము వున్నాము అని గుర్తించి, ఆ స్థితి నుంచి బయట రావాలని నిశ్చయించుకొని చేసే ప్రయత్నాలు ఇంకా కష్టతరమే కావచ్చు, కానీ కష్టించి బయటకు వస్తేనే మనిషి సుఖాన్ని పొందగలడు.

బాధ, నిరుత్సాహము, ఆవేదన.. ఇవ్వన్ని దుఃఖానికి దారి తీస్తుంది. బాధలను దిగమింగి, నిరుత్సాహాన్ని పారద్రోలి, ఆవేదనలను లెక్కచేయకుంటేనే సుఖాన్ని అనుభవించగలము. కోరికలు నెరవేరక పోతే, వాటిని నెరవేర్చుకోవడాయనికి తగిన ప్రయత్నాలు చేయకుంటే, దుఃఖమే మిగులుతుంది. కానీ మనము చేస్తున్నఆ ప్రయత్నాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగితే, కోరిక నెరవేరాక మాత్రమే కాకుండా, ఆ కోరికల కొరకు మనను చేసిన ప్రయత్నాలు కూడా సుఃఖాన్ని కలగజేస్తుంది.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

వ్యసనానికి దూరంగా… వ్యాపకానికి దగ్గరగా…

Posted on జనవరి 20, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, వ్యక్తిత్వ వికాసం | ట్యాగులు:, , , , , , , , , , , , , |

ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని, వాటితో కొనసాగడం మంచిది. బాధ, ఒత్తిడి, చింత, ఆవేశం వంటి మనోస్థితుల వలన మనకు నష్టం వాటిల్లే ఆస్కారమున్నది. ఆ నష్టాన్ని ఆపగలగడం కాస్త కష్టతరం కావచ్చు. సాధారణంగా కొందరు పైన పేర్కొనబడిన మనోస్థితులను తట్టుకోవడానికి వ్యసనాలకు దగ్గరవుతుంటారు. ఈ వ్యసనాలు కాస్త విశ్రాంతి, ఓదార్పును కలగచేసినా మరో రకాలుగా నష్టం వాటిల్లజేస్తుంది

ఈ విధమైన నష్టాన్ని అరికట్టాలంటే వ్యసనాన్ని వీడి, వ్యాపకాన్ని అలవరచుకోవాలి. వేధనకు గురి చేసే మనోస్థితులను వెలియబుచ్చకుండా లోపలే వుంచేసుకున్నట్లైతే, అది మనలను దెబ్బతీస్తుంది. స్యయం కృషి చలన చిత్రములో ఒకానొక సన్నివేశములో కథానాయకుడు, తను కోపానికి గురైనప్పుడు, అతని కార్యాలయములోని ఒక గదిలోనికి వెళ్ళి, తలుపులు కట్టేసుకొని, ఒంటరిగా చెప్పులు తయారుచేస్తాడు. ఆ విధముగా తన కోపాన్ని ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో వెలియబుచ్చుతాడు. వేధనకు గురి కాకుండా తనను తాను కూడా కాపాడుకుంటాడు. చెప్పులు కుట్టడం అనే వ్యాపకంతో మనఃశాంతిని పొందాడు. ఇంకా ఒక జత చెప్పులు కుడా తయారయ్యాయి.

వ్యాపకం మరియు వ్యసనానికి తేడా ఏంటి? నా ప్రకారమైతే… క్రొన్ని కారణాల రీత్యా కలుగుతున్న వేధనలను దూరం కావించుకోడానికి, మనము క్రొన్ని అలవాట్లను అలవరచుకుంటాము. అలా పుట్టుకొవచ్చిన అలవాట్లకు మనము బానిసలమైతే అది వ్యసనం. అదే ఆ అలవాట్లు మనకు బానిసలలైతే దాన్ని వ్యాపకంగా పరిగణించవచ్చు.

అందుచేత మనకు కీడు తలపెటే వ్యసనానికి దూరంగా… మనకు మేలు తలపెటే వ్యాపకానికి దగ్గరగా వుండడం శ్రేయస్కరం.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

తండ్రి మనస్సు

Posted on నవంబర్ 24, 2009. Filed under: వ్యక్తిగతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , |

మా నాన్నగారు వంశపార్యంపరంగా వస్తున్న మా చిల్లర అంగడి ( దీనినే కొన్ని చోట్ల కిరాణా కొట్టు అనో లేక శెట్టంగడి అనో లేక ఉత్తిగా కిరాణా అనో పిలుస్తుంటారు ) నిర్వహిస్తున్నారు. మా జీవనాధారం, ఊపిరి అంతా అదే. మాకు అన్నం పెట్టే దైవమది. నా ఇంజనీరింగు ఈ ఏడాదే పూర్తయ్యింది. నాకు ఉద్యోగవకాశం ఇచ్చిన సంస్థ వారు, వచ్చే నెల నన్ను ఉద్యగంలోకి తీసుకోనున్నారు. మరి ఈ కాలీ సమయాన్ని ఎలా తోసిబుచ్చాలని నేను అప్పట్లో ఆలోచించాను. కాని, ఆలోచించేలోపు సమయంతా దాదాపు గడిచిపోయింది. ఇన్ని రోజులు మా అమ్మమ్మ, నాన్నమ్మ, మేన మామ , బాబాయి ఇలా దాదాపు అందరి బంధువుల ఇళ్లకు వెళ్ళివచ్చాను. ఓ కంప్యూటరు కోర్సుకు కూడా వెళ్ళాను( కాలం వెళ్ళబుచ్చడానికే ఈ కోర్సు. ఏదో దంచేద్దామనో, చించేద్దామనో కాదు). ఈ బ్లాగును కూడా మొదలెటాను.

కార్తీక మాసంలో అంగట్లో వ్యాపారం చేయడానికి మా నాన్నకు, నా అవసరం వుంటున్నది. నేను లేకున్నా ఏదో విధంగా ఆ భగవంతుని కృపతో నెట్టుకు రాగలరు. నేను కూడా మా అంగట్లో అప్పుడప్పుడు వెళ్తూ మా నాన్నకు సాయం చేస్తుంటాను. అందులో నాకు ఏమి ఇబ్బంది కూడా లేదు. కాని, కొన్ని రోజులుగా మా నాన్న నా గురించి బాధపడుతున్నారని తెలిసింది. మా నాన్న ప్రోద్బలంతోనే నేను ఇంజనీరింగు చేశాను. మరి నేనిప్పుడు ఇంట్లోనే వున్నాను కదా, మా నాన్న పిలిచినా పిలవకున్నా అప్పుడప్పుడు మా అంగడికి వెళ్ళి పని చేస్తుంటాను. ఇంజనీరింగు చదవి, ఒక బహుళజాతి సంస్థలో త్వరలో ఉద్యోగంలో చేరునున్న తన కొడుకు ఈ విధంగా అంగట్లో పని చేస్తున్నా,పని చేయవద్దు అని కూడా అనలేకున్నాను అని మా అమ్మతో మా నాన్నగారు తన బాధను వ్యక్తపరిచారంటా.

ఈ విషయం తెలుసుకున్న మొదట్లో నాకు ఎలా ప్రవర్తించాలో  తెలియరాలేదు. మా అంగడి గిరాకిలలో(customers) కొందరితో మాకు మంచి స్నేహ బంధం ఏర్పడింది. అటువంటి గిరాకి ఐన  ఒకతని బాగా చదువుకున్న కొడుకు, తన కాలీ సమయాలలో వాళ్ల పొలంలో, పసువుల పెంపకంలో బాగా పని చేస్తాడని, ఓ మారు మా నాన్న చాలా గొప్పగా ఆ గిరాకి యొక్క కొడుకు గూర్చి చెప్పడం గుర్తు. మరి నాదగ్గర ఆ చదువుకున్న అబ్బాయి గురించి గొప్పగా పొగిడిన మా నాన్న, నా విషయం వచ్చేసరికి బాధపడడం నాకు సబుబని అనిపించలేదు. కాని ఏమి చేద్దాం, ఏ తండ్రైనా, తన పిల్లలు కష్ట పడడం సహించలేడు కదా?! అప్పుడప్పుడు కాస్త కష్టంగా తోచినా, మన పనులు మనము చేయడంలో తప్పులేదు గనక, నేను మా అంగట్లో పని చేస్తుంటాను. ఎంతైనా నేను ఈ రోజు అనుభవిస్తున్న సుఖాలకు కారణం మా అంగడే గనక, దాంట్లో పని చేయడం నాకు చాలా సంతోషమే. మన గతాన్ని మనం ఎన్నటికి మరవకూడదన్నది నేను నమ్ముతాను. మంచి మనసు కలిగిన తండ్రి నాకు వున్నందుకు ఆ భగవంతుడికి నా శత కోటి ప్రణామములు.

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...