limit దాటితే.. liver దెబ్బతింటుంది..

Posted on మే 31, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం, పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , , , , , , |

శ్రుతి మించడం ఎప్పటికి పనికి రాదని నేను చాలా బాగా గ్రహించాను. అతి సర్వత్రా వ్యర్జతే అని అన్నారు పెద్దలు. కొంత మంది చేసే కొన్ని చేష్టలు కాస్త రోజులకు అందరికి ఆమోదయోగ్యం కావచు. ఆ చేష్టలను అందరు ఆస్వాదించవచ్చు. కాని అవి శ్రుతి మించినప్పుడే ఇబ్బంది కలిగిస్తాయి.

మన చేష్టలు సాటి వారికి ఇబ్బందిగాను, నష్టాన్ని కలిగించే విధముగా వుండరాదు. శ్రుతి మించి ప్రవర్తించడం వలన, సాధు జీవులు కూడా బలంగా ఎదురుతిరగడం నేను గమనించాను. కళాశాలలో నాతో విద్య అభ్యసించిన విద్యార్థి ఒకతను, తన ముక్కు మీద వున్న వాత గురించి నాకు చెప్పాడు. అతను తన చిన్నప్పుడు, ఒక కుక్కను చాకే వాడు. ఆ కుక్క ఎంత మంచిదంటే,  అస్సలు మొరగదు, కాస్త కుడా కరవదు. ఒకానొక రోజు ఆ కుక్కను ఒక గదిలో తీసుకెళ్ళి, దాన్ని రెండు కాళ్ళను పట్టుకొని గిరుమ్మని బొంగరం వలె తిరిగాడు. అలా చేసాక, దాన్ని తన చెంతకు తీసుకొని మొహంలో మొహం పెట్టి ముద్దాడపోయాడు. అప్పుడు ఆ అమాయకపు కుక్క ఇతని ముక్కును గట్టిగా కరచి పారిపోయింది. ఇతను శ్రుతి మించడం వలన కుక్కా పోయె, మొహంలో గాటు మిగిలే.

ఆ అబ్బాయి కుక్కను పోగొట్టుకున్నాడు. కాని మన రోజువారి జీవితాలలో  కొందరు శ్రుతి మీరడం మరియు అతి చేయడం ద్వారా కొన్ని బంధాలను, బంధుత్వాలను పోగొట్టుకుంటున్నారు. కొందరికి అవి అర్థమవటము లేదు. అర్థమైన అవి ఎలా ఆపు చేయాలో వారికి తెలియటము లేదు.

మన చేష్టలు శ్రుతి మీరాయి అని ఎలా కనుగొనడం? శ్రుతి మించిన క్షణాన్ని గ్రహించడం పెద్ద కష్టమేమి కాదు. మన అంతర్వాణి మనలను హెచ్చరిస్తుంది. ఎదుటి వారి హావ భావలు కూడా వాటిని తెలుపుతాయి. తప్పు చేయడం సహజం. కాని ఆ తప్పును అంగీకరించిన వాడు మనిషి. ఆ తప్పును సరిదిద్దుకొనే వాడు మహర్షి. శ్రుతి మీరుతున్నాము లేక శ్రుతి మీరాము అని గ్రహించిన వెంటనే, అ చర్యను/చేష్టను అంతటితో ఆపు చేయడం ఉత్తమం, అందరికీ శ్రేయస్కరం.

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది

Posted on సెప్టెంబర్ 2, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , |

ఒకానొక తమిళ ఛానలును నేను వీక్షిస్తుండగా, ఒక కొరియర్ సర్వీసు ప్రకటన నన్ను ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఒక కంపెనీ యజమాని తన ఆంతరాంగిక సహాయకురాలతో(personal assistant) వివిధ ప్రదేశాలకు చేరవేయవలసిన కొరియర్‌ల గురించి చర్చిస్తూ వుంటాడు. అందులో చాలా కొరియర్‌లు  దూర ప్రదేశాలకు, విదేశాలకు చేరవేయవలసి వుంటుంది. కాని, ఒకటి మాత్రం ఏదో కుగ్రామంకు చేరవేయవలసి వుంటుంది. అప్పుడు ఆ యజమాని తన ఆ.స.(P.A.)తో ఈ కొరియర్ తన గమ్యం చేర్చటం కుదరదు కదా అని అంటే, దానికామె మనము వాడే కొరియర్ సర్వీసు ఎక్కడికైనా మన వస్తువులను చేరవేయగలదు సార్ అని చెప్తుంది.

అవును కదూ, ఇప్పుడు మన సాధించిన పురోగతి మరియు సమాచార విప్లవాల వలన, మనోళ్ళు ఎక్కడ ఉన్నా , వాళ్ల స్థితిగతులు చాలా సులువుగా తెలుసుకోగలుగుతున్నాము మరియు  వారితో‌ సంభాషించగలుగుతున్నాము. ఇంకా అంతర్జాలం(internet) పుణ్యామా అని క్రొత్త మిత్రులను సంపాదించుకోగలుగుతున్నాము. ఉన్న చోటనే దేశ, విదేశ వార్తలను తెలుసుకుంటున్నాము. ఏవైనా సంఘటనలు జరిగితే, దాన్ని చిటికలో అందరికి చేరవేయగలుగుతున్నాము. దీని ద్వారా ఈ ప్రపంచం రోజురోజుకు చాలా చిన్నదౌతూవస్తున్నది.

ఇది సంతోషించ దగ్గ పరిణామమే కదా!! కాని, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు, దగ్గరను దూరంచేసుకుంటున్నాము. ప్రస్తుత సమాజంలో మనిషి తన పరిసరాలను పట్టించుకోవటం లేదు. తన పొరుగువారి బాగోగులు చూడటంలేదు. పోని, కనీసం తన నివాస పరిసరాలలో ఎవరుంటున్నారన్నది కూడా తెలుసుకోలేకున్నాడు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. దూరము దగ్గరైతే మంచిదే. కాని, అందుకు దగ్గరను దూరము చేసుకోవటం ద్వారా మూల్యం చెల్లించటం ఎంత వరకు సమంజసం?!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...