దాగుడుమూత

Posted on నవంబర్ 7, 2011. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , |

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనము దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది…

జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నను లేకున్నను.. మనము ఆ ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవగలగడం, కోరిన వస్తువులను పొందగలగడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత…

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముతాటే ..

మధ్య వయస్కుడు తాను ఊహించిన విన శైలిలోనే బ్రతక గలగడం.. జీవితం మనతో ఆడే దాగుడుమూతే….

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక.. వారి మధ్య వుంటూ.. మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా.. జీవితం మనతో ఆడుకునే దాగుడుముట ఆటలోని భాగమే…

చిత్రకథనాలలో మలుపులు లేకుంటే, ఆ చిత్రము నీరసంగా ఎలా తయారవుతుందో.. జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితము మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, చక్కగా ఆడితే.. గెలుపు మనదే…

అయినా అన్నీ మనము తలచిన విధముగానే సాగితే.. జీవితములో కిక్ ఏముంటుంది చెప్పండి…

ప్రకటనలు
టపా మొత్తం చదవండి | Make a Comment ( None so far )

కృషి చేస్తే….. ఏమిటట????

Posted on జూలై 29, 2009. Filed under: నా అనుభవం - నేర్చుకొన్న పాఠం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

కృషి

“కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు…” ఇది ఎన్.టి.ఆర్ గారి ఒకానొక సినిమాలోని పాట యొక్క మొదటి చరణము.

ఈ రోజు  యదావిధిగా, java క్లాసు పూర్తయిన తర్వాత వేలూరు నుండి చిత్తూరుకు RTC బస్సులో తిరిగివస్తుండగా, conductor దగ్గర టికెట్ల వివరములు కలిగిన ఒక చిట్టాలో నాకు ఒక వాక్యము కనిపించింది. అదేమనగా “కృషి చేస్తే జీతమునకు, జీవితమునకు చేయూత”.

నిజమే!! కృషి చేస్తే పైన తెలపబడిన లాభాలు తప్పక కలుగుతాయి. కాని, నా ఆలోచనలు ఇంతటితో ఆగలేదు. నాకు మా పాఠశాల అధ్యాపకులు గుర్తుకు వచ్చారు. వారు నాకు చిన్ననాటి నుంచి చాలా విషయములు భోదించారు, నడత నేర్పారు, నా గుణమును స్వభావమును తీర్చిదిద్దారు, మంచి విలువలను అందించారు…… ఇంకా మరెన్నో.

పాఠశాలలో చదువుతున్న రోజులలో నాకు చిరకాలము గుర్తుకు ఉండిపోయో ఒక సంఘటన చోటుచేసుకుంది. అది నేను తొమ్మిదవ తరగతిలో, కోడైకనాలుకు విహారయాత్రకు వెళ్ళిన రోజులు. విహారయాత్ర రెండవ రోజున మా బృందము మధ్యాహ్నం భోజనానికి ఒక మాంసాహార హోటలులో దిగాము. నేను శాఖాహారి అయినందున నాకు అక్కడ భోజనం చేయటం కష్టతరమైంది. ఒక్క ముద్ద కూడా గొంతు దిగడంలేదు. నాకు తెలవకుండానే వేడివేడిగా కన్నీటి దారలు కారడం మొదలైంది. నాకు ఏమి చేయాలో పాలుపోక బయటకు వెళ్ళిపోయాను. నా తోటి విద్యార్థులంతా భోంచేసి మా యాత్ర బస్సులోనికి  ఎక్కిన తర్వాత, నేను భోజనం చేయలేదని గ్రహించిన మా social మేడము నన్ను హోటలు లోనికి బలవంతంగా తీసుకెళ్లింది. నేను చిన్నపటి నుంచి బయపడే science మేడము, ఇంకా chemistry మేడము నా ప్రక్కన కూర్చొని “మేము కూడా ప్రస్తుతము వ్రతములో ఉన్నాము. మేము కూడా మాంసాహారము తినరాదు. బాధపడవద్దు” అని నన్ను ఓదారుస్తూ, అమ్మలాగా  గోరుముద్దలు తినిపించారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే… వారు ఆనాడు కేవలం జీతం కోసమే పని చేసేవారై వుంటే నాతో ఆ విధంగా ప్రేమగా వ్యవహరించేవారా??!! ఒకవేళ, వారు జీతం కోసమే పనిచేస్తుండవచ్చు, కాని వారు వారి వృత్తిని ప్రేమించారు. వారు నాపై చూపిన వాత్సల్యము వారి జీతమునకు ఏ విధంగా దోహదపడిందో నాకు తెలియదు, కాని వారికి చిరకాలము కృతజ్ఞతా భావము కలిగిన ఒక విద్యార్థి(బిడ్ద)ను సంపాదించి పెట్టింది.

కొన్ని నెలలలో నేను కూడా ఒక సాఫ్టువేరు కంపెనీలో ఉద్యోగంలో చేరనున్నాను. నేను కూడా మా టీచర్ల వలే నా వృత్తి ప్రేమిస్తాను. బాగా కృషిచేసి నా జీతమునకు, జీవితమునకు చేయూత అందేవిధంగా నడచుకుంటాను. మరి, ఈ‌ వాక్యము చదినప్పుడు మీకు ఏమి స్పురించింది?????

టపా మొత్తం చదవండి | Make a Comment ( 7 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...