ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!

Posted on ఆగస్ట్ 18, 2009. Filed under: నా విసుర్లు | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , |

క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను.

తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, సి.డి.లు తయారీకి అయ్యే ఖర్చులు ప్రవాసాంధ్రులు అందజేస్తారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెపుపుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.

ఈ వార్త చదివాక, ప్రవాసాంధ్రులకు మన మాతృభాష మీద ఉన్న మమకారాన్ని చూచి ఆనందించాలా లేక ఆంధ్ర రాష్ట్రంలోనే వుంటూ మన తెలుగు దినపత్రికలను కూడా చక్కగా చదవలేని నేటి తరాన్ని చూచి సిగ్గుపడాలా అనే సంధిగ్ధంలో పడ్డాను.

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

Read Full Post | Make a Comment ( 4 వ్యాఖ్యలు )

ఏ జో దేశ్ హై తేరా

Posted on ఆగస్ట్ 15, 2009. Filed under: దేశ భక్తి, సంగీతం | ట్యాగులు:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , |

ప్రపంచ నలుదిశలలో ఉన్న భారతీయులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము గర్వించదగ్గరోజు. స్కూలు రోజులలోనైతే సైకిల్‌లకు, మా స్కూలు ఆటో మరియు  బస్సులకు జెండాలను కట్టేవారము. స్కూలులో ఒక అతిథి వచ్చి జెండాను ఆవిష్కరించి నాలుగు మంచి మాటలు చెప్పిన తర్వాత  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరిపిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసేవారు. తర్వాత రాజ్యమంతా మాదే. ఆటపాటలు, నాటకాలు నిర్వహించేవారము. చివరన జనగణమన ఆలపించి సంబారాలకు అంతం పలికేవారము. ఇంటర్ లో ఆ అవకాశం దొరకలేదు. ఇంజనీరింగులో తిరిగి అటువంటి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంజనీరింగు కూడా అయిపోయింది. ఆ రోజులు మళ్లీ తిరిగివస్తే ఎంత బాగుండును.

అసలు విషయానికి వస్తే; నిన్న  ప్రయాణిస్తున్నప్పడు షారుక్ ఖాన్ హిందీలో నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని బాణీలు విన్నాను. ఏ.ఆర్.రెహమాన్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆ సినిమాను పలుమార్లు చూసాను.చూసిన ప్రతీసారి ఒక మంచి అనుభూతి కలిగేది. అందులో ఒక్కొక్క పాట ఒక్కో ఆణిముత్యం. కాని ఈ రోజు ప్రత్యేకంగా చర్చించుకోవలసిన పాట ఒకటి ఉన్నది. అది “యే జో దేశ్ హై తేరా”. హిందీ బాగా అర్థమవుతుందన్న వారు ఆ పాట యొక్క చరణాలు ఇక్కడ చూడగలరు. కథా నాయకుడు అమెరికాలో 12 సంవత్సరాలు ఉండి, తిరిగి భారతదేశానికి తనిని చిన్నప్పుడు పెంచినావిడను చూడడానికి వస్తాడు. అమెరికాకు తిరిగి వెళ్లాక మన దేశంలో అతను గడిపిన క్షణాలు నెమరువేసుకుంటూనే ఉంటాడు. ఇక్కడి మనుషులు, అతని ప్రేయసి మరియు మన దేశ దుస్థితి చూసి చలించి, NASAలో తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదలి మన దేశం తిరిగి వచ్చేస్తాడు. అతడు చేసినదాన్ని నేను సమర్థిస్తున్నాను, మన దేశాన్ని మనము కాకుంటే మరెవరు కాపాడుకుంటారు?! మీరందరు ఈ సినిమా ఒకవేళ చూసివుండకపోతే తప్పక చూడవలసినదిగా నేను కోరుతున్నాను. నా నిన్నటి మరియు ఇవాల్టి టపాలను చూసి, నన్ను ప్రవాసాంధ్రులు మరియు ప్రవాసభారతీయుల వ్యతిరేకి అని దయచేసి అనుకోవద్దు.మరోమారు మీ అందరికి స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు. జై హింద్!!

post to facebook post to twitter Stumble It! Digg it post to friendfeed Share

Read Full Post | Make a Comment ( 11 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...