వినదగునెవ్వరు చెప్పిన……

Posted on జూలై 3, 2009. Filed under: పెద్దల మాట - సద్ది మూట | ట్యాగులు:, , , , , , , , , , , |

వినదగునెవ్వరు చెప్పిన వినాలి. ఈ అలవాటును నేను మా స్వర్గీయ తాతగారి నుంచి అలవరచుకున్నాను. ఈ‌ లక్షణం ఎంత ఉత్తమమైనదో, మీకు ఓ రెండు ఉదాహరణలతో వివరిస్తాను.

రామ రావణులు

అది శ్రీరామచంద్రునికి, రావణాసురునికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్నవేళ. రావణుని రావణబ్రహ్మ అని కూడా అంటారు. అతను సకల విద్యాపారంగతుడు. కానీ పర స్త్రీ వ్యామోహం అనే దుర్గుణం, అతనితో పాటు అతని బంధుగణం, సమస్థ రాజ్యం యొక్క వినాశనానికి దారితీసింది. ఆ మహా సంగ్రామంలో‌  రావణుడు, శ్రీ రాముని ధాటికి మెల్లమెల్లగా కుప్పకూల సాగాడు. అప్పుడు రాముడు, ఇప్పుడు కాకపోతే అతడు మరిణించాక తెలుసుకునే అవకాశం రాదు. అందుకే అది సమయం కానప్పటికీ, అదే అదనుగా భావించి లక్ష్మణుణ్ని పిలిచి ‘రావణాసురుని దగ్గరకెళ్లి రాజనీతి తెలుసుకునిరా!’ అని పంపించాడు. అన్నగారి ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు వెళ్లి అడిగాడు. దానికి రావణుడు ‘అది నీకు చెప్పవలసినది కాదు. ఎందుకంటే కాబోయే రాజు మీ అన్నయ్య. కాబట్టి అతడినే  రమ్మను, చెబుతాను’ అని సమాధానం ఇచ్చాడు.

రావణుని రాజనీతిజ్ఞతకు ఇదొక నిదర్శనంగా భావించిన రాముడు తానే‌ స్వయంగా వెళ్లాడు. అంత యుద్ధంలోనూ తన అతిథిగా వచ్చిన రామునితో‌ అంతవరకు ఉన్న శత్రుత్వాన్ని ఆ క్షణానికి మరచాడు రావణుడు. తన పక్కనే కూర్చుండబెట్టుకుని అతడికి రాజనీతి సారమంతటినీ బోధించి సాదరంగా సాగనంపాడు.

విషాల్లో అమృతాన్ని గ్రహించాలి. బాలుడైనప్పటికీ‌ మంచిమాట చెపితే ఆలకించాలి అని పెద్దలన్నారు. శత్రువులనుంచి అయినా మంచి విషయాలు నేర్చుకోవాలి. మలిన పదార్థాల నుంచి నలుసంత బంగారమైనా గ్రహించాలన్నది వారి ప్రబోధం.

అబ్రహం లింకన్ఒక బాలిక ఇచ్చిన సలహాను మంచిమాటగా ఎంచి, పాటించి ఒక సామాన్యుడు అద్భుత ఫలితాన్ని సాధించాడు.

ఆ బాలిక పేరు గ్రేస్ బాడిల్. వయసు పదకొండు సంవత్సరాలు. ఆమె‌ ఇచ్చిన సలహా- ‘మీ మీద చాలా మంది ప్రజలకు అభిమానం ఉంది. కానీ అది మీరు గెలవడానికి చాలకపోవచ్చు. మీకు ఎన్నికల్లో గెలుపు సునాయాసం కావాలంటే మీరు గడ్డం, మీసం పెంచాలి. అలా అయితే‌ మీముఖం బాగుంటుంది. అప్పుడు చూడడానికి చాలా బాగుంటారు. అందువలన స్త్రీలందరూ వారి ఓట్లు మీకే వేసి గెలిపిస్తారు. ఎందుకంటే గడ్డం, మీసం ఉన్న మగాళ్లలు స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు. అలాగైతే మీరే ప్రెసిడెంట్ అవుతారు’.

లేఖ ద్వారా అందిన ఆ సలహా చదివిన వ్యక్తి దాన్ని చిన్న విషయంగానో, ఆ చిన్నపిల్ల మాటల్ని బాల్యచేష్టలుగానో భావించలేదు. మంచిమాట ఎవరు చెప్పినా పాటించాలనిపించి పాటించాడు. అలా చేయడం వలన అతడు అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. అతడే అబ్రహం లింకన్.

Read Full Post | Make a Comment ( 2 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...