భూమిగుండ్రంగా ఉందని మన ప్రాచీనులకు తెలియదా?

Posted on జూన్ 14, 2009. Filed under: మన విజ్ఞానం | ట్యాగులు:, , , , , |

ఆర్యభట్టుమన పాఠ్య పుస్తకాలలో కెప్లర్ కోపర్నికస్, గెలీలియోలు భూమి గుండ్రంగా ఉందని 16వ శతాబ్దంలో కనుగోన్నారని చదువుతున్నాము. మన ప్రాచీనులకు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా తెలుసు. ఋగ్వేదంలో 1:38:8 మంత్రంలో ఆ విధంగా ఉంది. “చక్రాణాసఃపరీణాహం పృధివ్యా…………..” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవాడు అని భావం.

సూర్య సిధ్దాంతం అనే అతి ప్రాచీన గ్రంధంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో “మధ్యే సమన్తా దణ్ణస్వభూగోళో‌ వ్యోమ్ని తిష్టతి“. బ్రహ్మాడం మధ్యలో భూగోళం ఆకాశంలో‌నిలచి ఉన్నది అని అర్థం.

ఆర్యభట్టు క్రీ..శ 476 ప్రాంతం వాడు. ఈయన భూగోలఃసర్వతో వృత్తః అని ఆర్యభట్టీయం అనే గ్రంధంలో గోళపాద అనే అధ్యాయంలో 6వ శోకంలో తెల్పేను. భూమి వృత్తాకారంలో‌అన్నివైపులా ఉన్నదని అర్థం. పంచ మహాభూతమయస్తారాగణపంజరే మహీ గోళః(13-1)

పంచసిధ్దాంతిక అనే గ్రంథంలో కీ..శ 505 సంవత్సరానికి చెందిన వరాహమిహురుడు “పంచభూతాత్మికమైన గుండ్రని భూమి, పంజమురలో వేలాడే  ఇనుప బంతిలాగా, ఖగోళంలో‌ఉన్నది” అని వ్రాసారు.

లీలావతి అడిగిన ప్రశ్నకు – భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు నీవు చూసేదంతా నిజం కాదు. భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు పెద్ద వృత్తం(circle) గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖ(straight line) లాగ కనిపిస్తున్నది. కాని అది నిజానికి వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.(లీలావతి అనే గ్రంథంలో‌ కలదు)

ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ నభూచ్ఛాయా” సూర్యుడిని చంద్రుడు కప్పినప్పుడు నీడా భూమి మీదకు సూర్యగ్రహణంగాను, చంద్రుడు భూమిని కప్పినప్పుడు చంద్రగ్రహణంగాను కనిపిస్తుందని ఆర్యభట్టీయంలోని 37 శ్లోకంలో ఆర్యభట్టు వివరించాడు. భూమి తన కక్ష్యలో‌తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు అని ఆర్యభట్టు స్పష్టంగా వ్రాసారు.

Read Full Post | Make a Comment ( 26 వ్యాఖ్యలు )

Liked it here?
Why not try sites on the blogroll...